మ‌హేశ్ రిక్వ‌స్ట్‌కు రాజ‌మౌళి ఓకే చెబుతాడా?

Share

`స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రాన్ని `ఎస్‌ఎస్‌ఎంబీ28` అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఆగస్టు నుండి సెట్స్‌పైకి తీసుకువెళ్ల‌బోతున్నారు.

ఈ సినిమా పూర్తైన త‌ర్వాత మ‌హేశ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. దాదాపు పదేళ్ల క్రిత‌మే వీరి కాంబి చిత్రం రావాల్సి ఉంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. అయితే ఇప్పుడు ఆ శుభ‌ త‌రుణం వ‌చ్చింది. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇక‌పోతే రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. కానీ, ఒక్కో సినిమాను తెర‌కెక్కించేందుకు ఆయ‌న చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అయిన‌ప్ప‌టికీ రాజ‌మౌళితో సినిమాలు చేసేందుకు వెన‌క‌డుగు వేయ‌రు. కానీ, మ‌హేశ్ మాత్రం ఈ విష‌యంపై కాస్త ఆలోచ‌ల‌న‌తో ప‌డ్డార‌ట‌.

ఒక సినిమాకు రెండు, మూడేళ్లు కేటాయించాలంటే మామూలు విష‌యం కాదు. అందుకే మ‌హేశ్ రాజ‌మౌళిని ఓ రిక్వ‌స్ట్ చేశాడ‌ట‌. సినిమాలో తన పాత్ర కి ఎటువంటి స్పెషల్ లుక్ ఇవ్వద్దని, ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో మూవీ షూటింగ్ పూర్తి చేసేలాగా ఉంటే బాగుంటుందని మహేశ్‌ బాబు కోరిన‌ట్లు తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇదే నిజమైతే మ‌హేశ్ రిక్వ‌స్ట్‌కు రాజ‌మౌళి ఒకే చెబుతాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.

 


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

51 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

54 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago