Krishna: సూపర్ స్టార్ కృష్ణ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడటంతో.. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలో కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. వైద్యులు వెంటనే కృష్ణకి ఐసీయూలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం తీవ్రంగా అనారోగ్య సమస్య తలెత్తడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దీంతో వెంటనే వార్త తెలుసుకుని కృష్ణ చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ వద్దకు మహేష్ చేరుకున్నారు.
ఇదిలా ఉంటే నటుడు నరేష్ కృష్ణ అనారోగ్య వార్తలపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు తెలియజేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈరోజు సాయంత్రం వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వల్లే హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థిస్తున్నారు. ఏడాది ప్రారంభంలో పెద్ద కొడుకు రమేష్ ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో భార్య ఇందిరా దేవి మరణంతో కృష్ణ ఎంతగానో కృంగిపోయారు.
ఇక మహేష్ కూడా తన సోదరుడు మరియు తల్లి మరణించడంతో చాలా కృంగిపోవడం జరిగింది. సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుకల్లో కూడా… తన సోదరుడునీ తలుచుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ఇంతలోనే ఇప్పుడు తండ్రి కృష్ణ హాస్పిటల్ లో జాయిన్ కావటంతో మహేష్ ఎంతగానో కంగారుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 79 సంవత్సరాలు వయసున్న కృష్ణ… గత కొంతకాలంగా సినిమాలు ఆపేయడం జరిగింది. బయట వేడుకలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదు. ఈ క్రమంలో వయసు మీద పడటంతో.. పలు అనారోగ్య కారణాలకు గురై ఇటీవల తన కుటుంబంలో ఇద్దరు మరణించడంతో మరింతగా కృంగిపోవటం జరిగిందట. ఇదిలా ఉంటే హాస్పిటల్ లో ఐసీయులో ఉన్న కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.