Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజర్`. 26/11 ముంబైలోని తాజ్ హోటల్ లో జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో ప్రాణాలు అర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాళ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ జూన్ 3న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది.
విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. ఇకపోతే ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలైన యాబై రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు.
కానీ, అనుకున్న దానికంటే చాలా ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. మేజర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకున్న దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. జూలై 3వ తేదీ నుండి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఓ అధికారిక పోస్టర్‌కు కూడా బయటకు వదిలారు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…