malli Nindu jabili:మల్లి సీరియల్ లో నటిస్తున్న గౌతమ్ అసలు పేరు ఆర్యన్ దిర్ కుమార్. ఈయన కన్నడ స్టార్. కన్నడలో మంచి పాపులర్ నటుడు. ఈయన భువనేశ్వర్ లో పుట్టి పెరిగాడు. ఇతనికి నటనంటే చిన్నప్పటినుంచి చాలా ఇష్టం అందుకే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టాడు.

కన్నడలో కొన్ని యాడ్స్ లో కూడా నటించాడు. కన్నడలో కొన్ని సినిమాలు కూడా చేశారు. చూడ్డానికి చాలా క్యూట్ గా అందంగా ఉండే, గౌతమ్ కి ఇచ్చిన ప్రతి పాత్రని చాలా చక్కగా నటించి మంచి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.ఆర్యన్ కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించాడు.ఇతను నటించిన కొన్ని యాడ్స్ తెలుగులో కూడా ఉన్నాయి. ప్రదీప్ తో కలిసి ఒక యాడ్లో కూడా పాల్గొన్నారు.గౌతమ్ కన్నడలో జోగి, కహిదె తారే అనేటటువంటి సినిమాలు మంచి పాపులర్ సంపాదించుకున్నాయి.

ఆ తరువాత బుల్లితెర మీదకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్. తెలుగులో మొదటిసారి చేస్తున్న సీరియల్ మల్లి. ఈ సీరియల్లో ఆర్యన్ కి మంచి పాత్రే దొరికింది. ఆర్యన్ గౌతమ్ అనే క్యారెక్టర్ లో బాగా నటిస్తున్నాడు.ఈ సీరియల్లో అరవింద్ కి యాంటీగా నటిస్తున్నప్పటికీ తను పైకి సీరియస్ గా ఉన్న లోపల మంచితనం ఉన్న క్యారెక్టర్ గా ఆర్యన్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గౌతమ్ ఎంట్రీ తర్వాత అతి కొద్ది సమయంలోనే ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

స్టార్ మా సీరియల్స్ లో ఇప్పుడు మళ్లీ సీరియల్ కూడా మంచి పిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది దీనికి ఓకింత కారణం గౌతమ్ అని చెప్పొచ్చు.గౌతమ్ చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు పైగా మల్లి క్యారెక్టర్ పక్కన భర్తగా నటిస్తూ అందరిని అలరిస్తున్నాడు ఆర్యన్.

ఇక ఇప్పుడు గౌతమ్ రియల్ లైఫ్ లో కూడా తనకి పెళ్లయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటాడు ఆర్యన్.అలాగే తన భార్యని కొడుకుని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ వీడియోని మీరు చుడండి.