Malli Nindu Jabili: మల్లి నేను కూడా వచ్చి మన వివరాలన్నీ చెప్తాను పద వెళ్దాం అంటుంది మీరా. అవసరం లేదమ్మా నేను చెప్పాలనుకున్నది అంత లెటర్లో రాశాను తీసుకెళ్లి గౌతమ్ గారికి ఇస్తాను అని మల్లి అంటుంది. ఆయన అంత చదివి నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే కనుక మీ అందరి కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని మల్లి అంటుంది. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా మీ గతం గురించి చెప్పడం నీ బాధ్యత నీ ధర్మం నీకు తోడుగా రమ్మంటే నేను కూడా వస్తాను అని శరత్ అంటాడు.

నువ్వు కూడా వెళ్ళు శరత్ ఆడపిల్ల మాట్లాడేదానికి తండ్రిగా నువ్వు వెళ్లి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది అని శరత్ వాళ్ళ అమ్మ అంటుంది. అవసరం లేదు అది వెళుతుందిలే తగుదునమ్మా అంటూ మీరు అన్నిట్లో దూరకండి అని వసుంధర అంటుంది. నేను వస్తానులే పదమ్మ అని మీరా అంటుంది. మల్లి ఇప్పుడు ఈ లెటర్ అవసరమా పెళ్లి తర్వాత టైం చూసి ఈ విషయాలు అన్నీ చెప్పుకోవచ్చు కదా అని మాలిని అంటుంది. అప్పుడెందుకు ముందే ఇవ్వనివ్వు లెటర్ చూసి బయటికి గెంటేస్తాడు అప్పుడు ఏ గుడిమెట్ల దగ్గర ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటుంది అని వసుందర అంటుంది. మల్లి నిజాయితీని మెచ్చుకొని తనని పెళ్లి చేసుకుంటాడు వసుంధర అంటాడు శరత్.

నిజాయితీ గురించి మీరు మాట్లాడుతున్నారు వావ్ అని వసుంధర అంటుంది. మల్లి మంచి ముహూర్తంలో బయలుదేరుతున్నావు పెళ్లి ముహూర్తం పెట్టుకొని శుభవార్తతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మాలిని అంటుంది. మల్లి వెళ్ళిపోతుంది. మా మల్లికి అంతా మంచే జరుగుతుంది అని జగదాంబ అంటుంది. మా చిన్న కూతురు కి ఆ దేవుడు మంచి జీవితం ఇవ్వబోతున్నాడు అని శరత్ అంటాడు. ఒకవేళ ఆ గౌతమ్ ఒప్పుకున్నాడనుకుందాం ఒప్పుకోడు అనుకోండి అది వేరే విషయం, పొరపాటున ఒప్పుకుంటే మీరా పక్కన భర్త స్థానంలో ఎవరు నిలబడతారు ఎవరు కన్యాదానం చేస్తారు అని వసుంధర అడుగుతుంది. ఇంకెవరు చేస్తారు శరత్ చేస్తాడు అని జగదాంబ అంటుంది.

ఆయనను గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను అడుక్కునేవాడు ఎలా చేసుకుంటాడో అలాగే జరిపించుకోవాలి అని వసుంధర అంటుంది. నేను చచ్చి ఉంటే అలాగే జరిగేదేమో నేను బ్రతికే ఉన్నాను కదా అలా జరగనివ్వను నా కూతురికి తండ్రి లేని లోటు రానివ్వను ఇంకేం మాట్లాడకు అని శరత్ అంటాడు. ఈ మీరా పక్కన గాని మిమ్మల్ని చూసాను అంటే నాకు పరువు తక్కువ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని వసుందర అంటుంది. ఎట్లా వెళ్ళనివ్వవో నేను చూస్తాను అని జగదాంబ అంటుంది. చూసుకుందాం అని వసుంధర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మాలిని అరవింద్ వాళ్ళ ఇంటికి వస్తుంది, మల్లి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, ఇక మల్లి పెళ్లి విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండవు, అటు నుంచి గౌతమ్ కూడా మల్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలిసింది ఇది నుంచి మల్లి కూడా ఫిక్స్ అయింది పెళ్లి డేట్ ఫిక్స్ కావడమే మిగిలింది అని మాలిని అంటుంది.

మల్లి జీవితం నాశనం చేస్తున్నారు ఇప్పుడు మీ అందరికి సంతోషంగా ఉందా అని అడిగింది అంటాడు. సంతోషంగా ఉండదా మరి ఇటు నీ భార్య కానప్పుడు వేరే వాళ్ళ భార్యతో సంతోషంగా ఉండదా మరి, మాలినికి అడ్డు తొలగిపోతుందన్న కోణంలో ఆలోచించకు మల్లి కి మంచి జరగబోతుంది అని ఆలోచించు అని వాళ్ళ అమ్మ వాళ్ళ అంటారు. మల్లి పెళ్లి చేసుకోవడం నీకు ఇంకా ఇష్టం లేదంటే మల్లి మీద ఇంట్రెస్ట్ నీకు ఇంకా ఉంది అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది అరవింద్.మనసు ఉండడం అంటే ఏంటి నీ మాటకు నాకు అర్థం కావాలి చెప్పు మల్లి నుంచి నేనేం ఆశిస్తున్నాను అని మీరు అందరు అనుకుంటున్నారు, నేను తనని భార్య లాగా చూడడం లేదని ఒక స్నేహితురాల్లాగా చూస్తున్నానని మాది ఇప్పుడు పవిత్రమైన పెళ్లి బంధం కాదు స్వచ్ఛమైన స్నేహబంధం అంటుంటే ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అరవింద్ అరుస్తాడు.

ఆనాడు నా ప్రాణాలు కాపాడిన అమ్మాయి జీవితం బాగుండాలని అనుకుంటున్నాను అది తప్ప మల్లి మీద అభిమానం నాకు ఉందమ్మా దాన్ని మీ కళ్ళు గమనించలేకపోతున్నాయి మీ మనసు గుర్తించలేక పోతుంది అంతే అని అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరవింద్ తన రూమ్ కి వెళ్లి, మల్లి ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది తన జీవితం గురించి చెప్తుంటే ఆలోచించేది ఏంటి అని అనుకుంటాడు. మాలినీ తన గదిలోకి వచ్చి నువ్వు మల్లి పెళ్లి విషయంలో తల దూర్చకపోవడమే మంచిది అని చెప్పి వెళ్తుంది. కట్ చేస్తే మల్లి గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది, నీ గురించి నీ అభిప్రాయం గురించి ఎదురు చూస్తున్నాం అమ్మ అని కౌసల్య అంటుంది. నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం ఇది అందరూ తొందరపడొచ్చు నేను తొందర పడకూడదు అందుకే ముందుగా గౌతమ్ సార్ తో మాట్లాడాలి అని గౌతమ్ రూమ్ దగ్గరికి వెళుతుంది.నువ్వు చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాను మల్లి.

మీకు నా జీవితం గురించి చెప్పే ధైర్యం లేక ఈ లెటర్లో రాశాను లెటర్ లో ఉన్నది నా గతం లెటర్ లో ఉన్నవి నిజాలు లెటర్ లో ఉన్నదే నా జీవితం ఇది చదివిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి అని లెటర్ ఇస్తుంది. గౌతమ్ లెటర్ చదివి కిందికి వస్తాడు, నాకు నీ గతం అనవసరం నువ్వు నాకు నచ్చాక కారణాలు అనవసరం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గౌతమ్ చెప్పేస్తాడు. గౌతమ్ సార్ నిద్ర మొత్తం చదివారా అరవింద్ సార్ ఫోన్ ఇస్తేనే తట్టుకోలేదు అలాంటిది అరవింద్ బాబు గారిని పెళ్లి చేసుకున్నానంటే ఎలా ఒప్పుకున్నారు అని మల్లి అనుకుంటుంది. నేను మళ్ళీ చదివి వినిపిస్తాను సరిగ్గా చదివారో లేదో అని మల్లి అంటుంది. పెళ్లి నీకు ఇష్టమేనా ఒక్కసారి చెప్పమ్మా అని కౌసల్య అంటుంది. నేను పెళ్ళికి నేను అంగీకరిస్తున్నాను అని మల్లి అంటుంది.