Malli Nindu Jabili ఆగష్టు 18 ఎపిసోడ్ 426: అరవింద్ నీ వల్ల ఆల్రెడీ నా లైఫ్ కి పెద్ద డ్యామేజ్ జరిగింది,ఇప్పుడు నీ వలన మల్లి ఇబ్బంది పడకూడదు మా పెళ్లి అయిన తర్వాత నీ సంగతి తేలుస్తాను నేను మల్లి ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు నువ్వు ఈ పెళ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగదు అసలు నువ్వే కాదు ఎవరు అడ్డుపడిన ఆగదు మల్లి నాది మల్లి నాకే సొంతం అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు.

కట్ చేస్తే సత్య అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ పనిమనిషి ఈరోజు మల్లికి పెళ్లి అని అంటుంది. అందరూ పెళ్లికి వెళ్లారు. మళ్లీ మల్లి కి పెళ్లి ఏంటి అని సత్య షాక్ అవుతాడు. ఇదంతా అబద్ధం సత్య అంటాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి కావాలి అంటే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్లి చూడండి మీకే తెలుస్తుంది అని అంటుంది. సత్య తన మనుషులకి ఫోన్ చేసి మల్లి కి అన్యాయం జరుగుతుంది నాకు గన్ను తెచ్చి ఇవ్వురా అని చెప్తాడు. అరవింద్ ఇంట్లో కోడలిగా ఉండాల్సిన మల్లి ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి మీరా ఎలా ఒప్పుకుంది అరవింద్ నాకు ఇచ్చిన మాట తప్పి మల్లి కి ఇంకో పెళ్లి చేస్తున్నాడు అన్నమాట అరవింద్ నిన్ను వదలను అని సత్య వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే, శరత్ కి దండం పెడుతుంది మీరా, నా కూతురిని బడిలో అడిగితే చూపించలేకపోయాను కనీసం పేరు కూడా చెప్పలేకపోయాను కానీ ఈరోజు తండ్రి దగ్గరుండి కూతురి పెళ్లి జరిపిస్తున్నారు అందుకే నాకు తల్లిగా చాలా ఆనందంగా ఉంది, నా మల్లికి అరవింద్ బాబుతో జరిగిన పెళ్లి పెద్ద పెద్ద గొడవల మధ్య జరిగింది కానీ ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈసారి నా కూతురు మెడలో పడబోయే మూడు ముళ్ళు మల్లి ని నిండు నూరేళ్లు సంతోషంగా ఉంచుతాయి అని నమ్ముతున్నాను అని చెప్తుంది మీరా.

ఇంతకాలం మీరు గుర్తింపు లేని మనుషులుగా సమాజం నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఇకపై మీకు అలాంటి పరిస్థితి రాదు నీకు భర్తగా మల్లికి తండ్రిగా జీవితాంతం ఉంటాను అని శరత్ అంటాడు. నీకు అంత మంచే జరుగుతుంది సంతోషంగా ఉండు మీరా అని శరత్ వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే మాలిని వాళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తారు. నువ్వు అనుకుంది జరుగుతుందని ఆనందంగా ఉంది కదా మాలిని అని అరవింద్ వాళ్ళ అక్క అంటుంది. నువ్వంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మాలిని చేసింది మంచి పని, అరవింద్ వచ్చి పెళ్లిని ఆపుతాడని నీకు ఇంకా నమ్మకం ఉందేమో అలాంటి పనులు ఏమైనా చేశాడంటే కుటుంబానికి పెద్ద శత్రువు అయిపోతాడు, అంతేకాదు అరవింద్ ని కుటుంబం నుంచి బహిష్కరించక తప్పదు, జరుగుతున్న పెళ్లి ఇటు మల్లి కి మాలినికి కొత్త జీవితాలను ప్రసాదించబోతుంది అరవింద్ వచ్చి అర్థం లేని పనులు చేశాడంటే ఊరుకునేది లేదు అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు.

కళ్యాణ మండపం వరకు వచ్చేసాం బయట నిలబడి వాదనలు ఎందుకు జరగాలని రాసి పెట్టిన వాటిని ఎవరు ఆపలేం ఆగిపోవాలని రాసి పెట్టిన వాటిని జరిపించలేం ఏం జరుగుతుందో చూద్దాం పదండి అన అరవింద్ వాళ్ళ అక్క అంటుంది. మల్లి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది ఎవరు ఆపాలని చూసిన ఆగదు అని మాలిని అంటుంది. కట్ చేస్తే, అరవింద్ బాబు గారితో చనువుగా ఉండడం చూస్తే తట్టుకోలేని గౌతం సార్ అరవింద్ సార్ తో పెళ్లి అయ్యిందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని నాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు అని మల్లి అనుకుంటుంది.
నేను గనక లెటర్ మార్చకపోయి ఉండి ఉంటే ఈ పెళ్లి ఇక్కడ దాక వచ్చేది కాదు అరవింద్ మళ్లీ కి ముందే పెళ్లి జరిగిన విషయం బయట పడకుండా చూసుకోవాలి అని మాలిని అనుకుంటుంది. మీ తరఫున రావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అని కౌసల్య అడుగుతుంది మీరాని. అరవింద్ బాబు గారు వాళ్ళు రావాలి అని మీరా చెప్తుంది. మల్లి గురించి అన్ని తెలుసుకొనే కూడలి చేసుకుంటున్నారు కదా ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అందరం చూస్తాం లేండి అని అరవింద్ వాళ్ళ అమ్మ అంటుంది. మల్లి గురించి మీరు వంకలు పెట్టాల్సిన అవసరం లేదు అని కౌసల్య అంటుంది. ఏంటి మీరా గారు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు ఈ మాలిని ఏమో మల్లి గురించి పేపర్లో తప్పుగా వేయించింది అరవిందేమో మళ్లీని బలవంతంగా మా ఇంట్లో నుంచి తీసుకెళ్దామని చూశాడు, ఇదేమైనా బాగుందా అని కౌసల్య అడుగుతుంది.

గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం, అందరం పెళ్లి పనులు చూద్దాం పదండి అని మాలిని అంటుంది.కట్ చేస్తే సత్య తన మనుషులతో, ఆ అరవింద్ కళ్యాణ మండపం దగ్గరికి కచ్చితంగా వస్తాడు ఈరోజు అరవింద్ తలలో బుల్లెట్ దించాల్సిందే అని సత్య అంటాడు. ఆయుధం వాడకుండా న్యాయం జరగాలి అనుకుంటాను అన్యాయం రెక్కలు విచ్చుకుంటుంది అన్నప్పుడు ఆ రెక్కలను విరిచేయాలి, మల్లి కి పెళ్లి జరగబోయేది ఎవరి కారణం వల్ల అనేది తెలుసుకోవాలి. కట్ చేస్తే గౌతమ్ మల్లి గదిలోకి వస్తాడు, చాలా చాలా అందంగా కనపడుతున్నావు అని గౌతం అంటాడు. ఇంతలో మీరా జగదాంబ అక్కడికి వస్తారు, మా మల్లి అదృష్టం చూసి అందరూ అసూయ పడిపోతున్నారు అనుకోండి, ఆ అరవింద్ బాబు గారి కుటుంబం అయితే మరీను అని జగదాంబ అంటుంది. అరవింద్ బాబు మా మల్లికి తాళి కట్టి వదిలేశాడు అని జగదాంబ అంటుంది. అది విన్న గౌతమ్ ఆశ్చర్యపోతాడు.