Malli Nindu Jabili: మల్లి సీరియల్ ద్వారా మాలిని క్యారెక్టర్ లో మనకి పరిచయమైన దీప జగదీష్. స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్ లో మాలిని కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఆమె చీరకట్టుకి అందరూ ఫిదా అయిపోతుంటారు అందం అబినయంతో పాటు ఆకట్టుకునే మాలిని అసలు పేరు దీప జగదీష్. ఈ సీరియల్ లో మాలిని నటనకు మంచి గుర్తింపు లభించింది. మాలిని క్యారెక్టర్ లో భర్తను అతిగా ప్రేమించే పాత్రలో దీపా జగదీష్ అద్భుతంగా తన నటన కనపరుస్తుందని చెప్పుకోవచ్చు.

ఇక సీరియల్ గురించి పక్కన పెడితే, ఈ అందాల భామ తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో దగ్గరగా ఉంటుంది. ఈమె రీసెంట్ గా పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈమె పెట్టిన పోస్ట్ ఏంటంటే తన భర్తతో దుబాయిలో సైమా అవార్డులో పాల్గొన్న ఫొటోస్ మరియు దుబాయ్ లో తన భర్తతో కలిసి ఉన్న ఫొటోస్.. ఏమిటి వీటి ప్రత్యేకత అనుకుంటున్నారా, అసలు దీప జగదీష్ భర్త గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దీప జగదీష్ గత ఏడాది కన్నడ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన సాగర్ పురాణిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అసలు దీప ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందే సాగర్ తండ్రి బ్యానర్ లో, అతను ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ లోనే దీపాకు ఫస్ట్ టైం నటించే అవకాశం దొరికింది. అదే సీరియల్లో సాగర్ కూడా నటించాడు. అప్పటినుండి వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరింది. ఇక సాగర్ అసలు పేరు సాగర్ పురానిక్. ఇతను జాతీయ అవార్డు పొందిన దర్శకుడు. ఇతను మొదటి సినిమా రింగ్ రోడ్ సుమ 2017 లో ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. చాలా సీరియల్స్ ని దర్శకత్వం వహించాడు. ఇతను తీసిన సీరియల్స్ అన్ని కన్నడంలో మంచి హిట్గా నిలిచాయి.

భగత్ సింగ్ పై చేసిన ఒక షార్ట్ ఫిలిం ఇతనికి మంచి అవార్డుని ఇచ్చింది. 66వ జాతీయ జల చిత్ర అవార్డు ను ఈ షార్ట్ ఫిలిం దక్కించుకుంది. ఇతను తీసిన డొల్లు అనే కన్నడ సినిమాకు, 68వ జాతీయ చలనచిత్ర అవార్డు లో ఉత్తమ కన్నడ చిత్రంగా నిలిచింది. తీసింది నాలుగు సినిమాలైనా అందులో రెండిటికీ ప్రత్యేక స్థానం అవార్డులు దక్కాయి. 2019లో మహాను వృథాత్మ అనే కన్నడ సినిమాకు 66వ జాతీయ చలనచిత్ర అవార్డులో ప్రత్యేక ప్రస్థాన అవార్డు దక్కింది. చిన్న వయసులోనే ఇతను దర్శకత్వం వహించిన సీరియల్స్ సినిమాలు మంచి గుర్తింపు పొందడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. ఇప్పుడు డొల్ల 2022 లో వచ్చిన సినిమాకు అవార్డుని తీసుకోవడం కోసం దుబాయిలో దీప జగదీష్ మరియు సాగర్ ఇద్దరూవెళ్లారు. క్యూట్ కపుల్స్ అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ను వీడియోస్ ను షేర్ చేశారు. అవి ఇంస్టాగ్రామ్ లో దీప పోస్ట్ చేసి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. వన్ ఆఫ్ ద మెమొరబుల్ అండ్ అమేజింగ్ ట్రిప్ అండ్ సైమా అవార్డ్స్. అని గుర్తుండిపోయే సైమా అవార్డ్స్ మరియు దుబాయ్ ట్రిప్ అని తన ఆనంద క్షణాలను తన అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఆ ఫొటోస్ కు దీపా అభిమానులు మంచి కామెంట్స్ తో కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఆ ఫొటోస్ని ఒక లుక్ వేయండి దీప, సాగర్ కు మనం కూడా కంగ్రాట్యులేషన్స్ చెబుదాం..
Bandla Ganesh: పూరీ క్యూలో నిలబడే రోజు వస్తుంది.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్