Malli Nindu Jabili మే 10: వసుంధరను అరెస్ట్ చేయించడానికి మల్లి సంపాదించిన సాక్షం గురించి అరవింద్ అరా తీస్తాడు అసలు విషయం మల్లి అరవింద్ కు చెప్తుండగా పక్కన రహస్యంగా వింటుంది మాలిని… మల్లి దెగ్గర నుంచి ఎలా అయినా తాళి దూరం చేయాలి అని మాలిని అనుకోవడం తో మల్లి నిండు జాబిలి నేటి ఎపిసోడ్ E354 మొదలవుతుంది. ఇక ఆ తరువాత ఈ రోజు ఎపిసోడ్ లో ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వెళ్లిపోండి బాబు ఎవరైనా చూస్తే బాగోదు
మల్లి తో ఆలా మాట్లాడుతూ ఉంటాడు అరవింద్ కాసేపటికి అరవింద్ ను అక్కనుండు వెళ్లిపొమ్మని చెప్తుంది మల్లి ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్తుంది. ఇంతలో మాలిని గది బయట నుండి లోపలి వొచ్చి ఇలా అంటుంది ‘ఇక్కడ ఉన్నారా మీరు కనిపించకపోయే సరికి అందరూ కంగారుపడుతున్నారు ఎమ్ చేస్తున్నారు ఇక్కడ’ అంటుంది మాలిని.
నేను ఒక మాట అంటాను ఏమి అనుకోకండి
అరవింద్ మల్లి ని రూమ్ లో చూసిన మాలిని ఇలా అంటుంది ‘నేను ఒక మాట అంటాను ఏమి అనుకోకండి మీకు పెళ్లిఅయిన విషయం నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు అత్తయ్య మావయ్య మిమ్మల్ని ఇలా రూమ్ లో చూసారు అంటే అపార్ధం చేసుకుంటారు కదా అంతే కాదు పెద్ద అత్తయ్య కోపం గురించి మీకు తెలిసిందే కదా మల్లిని చంపినా చంపుతారు.

మీరు కలవాలి మాట్లాడుకోవాలి అంటే బయట ఏ కాఫీ షాప్ కో వెళ్ళండి కానీ ఇలాంటి రిస్కీ పనులు చేయకండి అని అంటుంది మాలిని. కానీ ఒక్కమాట అరవింద్ నీ సపోర్ట్ మల్లి చదువు వరకు మాత్రమే అనుకుంటే ఒకే లేదా ఇప్పుడే తాళి బయట పెట్టి అందరికి నిజం చెప్పేసేయ్ అని అంటుంది మాలిని. వొద్దు అక్క ఆలా అనొద్దు నిన్ను తప్ప అరవింద్ బాబు గారు నన్ను భార్యగా ఉహించుకోవట్లేదు అని మల్లి అంటుంది. అలాంటప్పుడు మీరు ఇలా కలవ కూడదు అరవింద్ అని ఫైనల్ గా చెప్తుంది మాలిని.
Malli Nindu Jabili మే 10: ఒక మాట అడగాలి మాలిని నిన్ను – అరవింద్
మాలిని ఇంకా అరవింద్ ఇద్దరు బెడ్రూమ్ లో కూర్చుని వుంటారు. అప్పుడు అరవింద్ మాలిని తో ఒక మాట అడగాలి అని అంటదు. దానికి బదులుగా మాలిని అడగటానికి పర్మిషన్ ఎందుకు అని అంటుంది. నేను పరాయిదాన్నా నీలో సాగ భాగం ని నీ దాన్ని అడుగు అని అంటుంది.

Malli Nindu Jabili: వసుంధర అరెస్ట్ కు మల్లి వేసిన ప్లాన్ తెలుసుకున్న మాలిని…వసుంధరను నిలదీసిన శరత్!
ఎప్పుడు మమ్మల్ని ద్వేషించే దానివి ఇప్పుడు సడన్ గా మాలిని విషయం లో పాజిటివ్ గా ఎలా మరగలిగావు? అని అడుగుతాడు అరవింద్. బహుశా ఈ అనుమానం నీకు పోలీస్ స్టేషన్ దెగ్గరనుంచి కలిగి ఉంటుంది ఆమ్ ఐ రైట్? అప్పటినుంచి నీలో నువ్వు మధన పడకుండా నన్ను అడగాల్సింది నీ మనసులో భారం తగ్గించేదాన్ని.
మల్లి నిన్ను ఆరాధిస్తుంది అరవింద్ ప్రేమించడంలేదు – మాలిని
వన్ థింగ్ ఐస్ క్లియర్ అరవింద్ మల్లి నిన్ను ఆరాధిస్తుంది ప్రేమించడంలేదు అని అరవింద్ తో అంటుంది మాలిని. మల్లిని నువ్వు బాధ్యతగా చూసుకుంటున్నా భార్యగా చూడటం లేదు, ఈ విషయం నాకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. నువ్వు మల్లి ఈ విషయం నాకు చెప్పడానికి చాలా ట్రై చేసారు కానీ అర్ధం కావడానికి నాకు టైం పట్టింది అని అంటుంది మాలిని. అందుకే ఇప్పుడు నాకు చాలా హ్యాపీ గా ఉంది అందుకే నువ్వు మల్లిని పెళ్లిచేసుకున్న నిన్ను క్షమించి నేను నీ దెగ్గరకు వొచ్చాను.
మల్లికి నాతో సమాన గౌరవం దక్కేలా చేస్తాను అరవింద్

మాలిని అరవింద్ తో మాట్లాడుతూ…నేను మల్లికి ఈ ఇంట్లో సమాన హక్కులు దక్కేలా చేయలేను కానీ సమాన గౌరవం మాత్రం దక్కేలా చేస్తాను. నువ్వు ఇంకేమి చేయమన్న చేస్తాను అరవింద్ అని మాలిని చెప్తుంది. నువ్వు ఎంత క్లారిటీ ఇచ్చినా నా మనసు ఎందుకో దాన్ని తీసుకోలేక పోతుంది మాలిని అని అరవింద్ మనసులో అనుకుంటాడు. అరవింద్ నా మాటలు నీకు అంత త్వరగా ఒప్పుకునేట్లు అనిపించక పోవొచ్చు ఎందుకంటే మార్పు ఎవరు అంత త్వరగా స్వీకరించరు. మనసులో అనుమానాలు పెట్టుకుని నాతో అంటి అంటనట్టు ఉండకు అరవింద్ నేను తట్టుకోలేను అని బాధ పడుతుంది మాలిని. మాలిని మాటలకు ఎమోషనల్ అయి చివరికి అరవింద్ మాలిని కౌగిలించుకుంటారు.
తన తాళి కనిపించడం లేదు అని కంగారులో మల్లి
మరునాడు పడుకుని లేచిన మల్లి మెడలో తాళి కనిపించడం లేదని కంగారుగా వెతుకుంది. అక్కడికి వోచిన అరవింద్ ఏమైంది అని మల్లిని అడుగుతాడు…బాబు గారు నా జీవితానికి సంబందించిన అతి ముఖ్యమైన వొస్తువు ఒకటి పోయింది బాబు గారు అని మల్లి చెప్తుంటే అదేంటో చెప్పమని అడుగుతాడు అరవింద్. మీరు నా మేడలో కట్టిన తాళి బాబు గారు, నిద్ర లేచిన తరువాత మొక్కుకుందాం అని చూస్తే లేదు బాబు గారు రూమ్ లో కూడా లేదు అని చెప్తుంది. ఇంతలో ఏం వెతుకుతున్నావ్ అరవింద్ అని అనుపమ అడుగుతుంది. నా పర్సు కనపడటం లేదు అని చెప్తాడు.

ఇంతలో అక్కడకి సుందర్ వస్తాడు…ఎం వెతుకుతున్నావ్ మల్లి అని సుందర్ అడుగుతాడు. పెన్ పోయింది అని చెప్తుంది, పెన్ ఏ కదా ఇంకోటి కొనుక్కుంటే సరిపోతుంది అని చెప్తాడు. అది విలువైనది సుందర్ ఒకరు నా జీవితానికి ఇచ్చిన గౌరవం లాంటిది దానికి వేళ కట్టలేం అని చెప్తుంది.

Malli Nindu Jabili మే 10: బాబు గారు ఎప్పుడు లేనిదీ ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది
మల్లి మాట్లాడుతూ బాబు గారు ఆ తాళి ఎవరి కంటైన పడితే పెద్ద గొడవ అయిపోతుంది. ఎప్పుడు లేనిది ఇపుడు ఎందుకు ఇలా అవుతుంది అని అంటుంది మల్లి. ఒక]వేళ దేవుడి దెగ్గర ఏమైనా పెట్టానా అని అక్కడ వెతకడానికి వెళ్తారు. దేవుడి గుడిలో సీతా రాములని గట్టిగా నిలదీస్తుంది మల్లి. అప్పుడే అక్కడికి మాలిని వొస్తుంది ఏమైంది అని విషయం తెలుసుకుంటుంది. తన చేతిలో ఉన్న తాళిని తీసి చూపిస్తుంది మాలిని. అక్క నా తాళి నీ దెగ్గరకు ఎలా వొచ్చింది అని అడిగితే ‘రాత్రి మంచినీళ్లు తాగుదాం అని వెళ్తుంటే ముడులు విడిపోయి నీ తాళి కింద పది ఉంది అందుకే తీసి భద్రంగా దాచాను అని చెప్తుంది.

నా కంట పడకుండా ఇంకెవరైనా చూస్తే ఎలా ఉంటుంది పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి అని అక్కడ సిట్యుయేషన్ ని అనుకూలంగా మార్చుకొని చివరికి అందరి సేఫ్టీ కోసం మల్లి తాళిని తన దెగ్గర దాచిపెట్టుకుంటాను అని చెప్తుంది మాలిని… ఆ తరువాత మల్లి నిండు జాబిలి సీరియల్ లో ఎం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Bandla Ganesh: ఎవరిని నమ్మొద్దని హితబోధ చేస్తున్న బండ్ల గణేష్.. తగలరానిచోట దెబ్బేదైనా తగిలిందా పాపం!