Malli Nindu Jabili మే 15 ఎపిసోడ్: పెళ్లి రోజు సందర్బంగా మాలిని అందరిని పిలిచి సాయంత్రం ఫంక్షన్ కోసం బట్టలు నగలు సెలెక్ట్ చేయమని అడగటంతో మొదలవుతుంది మల్లి నిండు జాబిలి నేటి ఎపిసోడ్ మే 15
E357…అనుపమ తో సరదాగా సెలెక్షన్స్ గురించి మొగవారు అవును అంటే మీరు కాదు అంటారు కాదు అంటే మీరు అవును అంటారు అలాంటప్పుడు మమ్మల్ని అడగటం దేనికి అని వెటకారం చేస్తాడు. అందరూ అలా అరవింద్ మాలిని పెళ్లి రోజు సంద్రాభంగా సరదాగా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అరవింద్ కి మూత్రం ఎక్కడో మనసులో ఏదో అనుమానం.

చిరునవ్వుతో వెలిగిపోతున్న మల్లిని చూసి రూప ఇలా అనుకుంటుంది ‘కట్టుకున్నవాడు ఇంకొకరితో ఆనందంగా ఉన్న చూస్తూ నీకు చిరు నువ్వు ఎలా వస్తుంది మల్లి’ అని. ఇంతలో మాలిని వదిన అని రూపాను పిలుస్తుంది, ఏ చీర కట్టుకోవాలి అని అడుగుతుంది. దానికి బదులుగా కట్టుకున్నవాడు పక్కనే ఉన్నాడు ఎ చీర కట్టుకోవాలి అని అరవింద్ నే అడుగు అని అంటుంది. అవును అరవింద్ ఆల్రెడీ నా గురించి డీప్ గ ఆలోచిస్తున్నాడు నువ్వు చెప్పు అరవింద్ ఎమ్ వేసుకోమంటావ్ అని అంటుంది మాలిని.

పెళ్లి రోజు చీర సెలక్షన్ చేయమని అడిగిన మాలిని
అలా సాయంత్రం జరగబోయే పెళ్లిరోజు ఫంక్షన్ కి చీర సెలెక్ట్ చేయమని అరవింద్ ని అడుగుతుంది మాలిని. దానికి ఏదో మొక్కుబడిగా పైన దొరికిన మొదటి చీరను తీసి ఇస్తాడు అరవింద్, ఫార్మాలిటీకి చేస్తున్నాడు అని మనసులో అరవింద్ గురించి అనుకుంటుంది మాలిని. అరవింద్ సెలెక్ట్ చేసిన చీరకు మాచింగ్ నగలు సెలెక్ట్ చేస్తుంది అనుపమ.
Brahmamudi: రాజ్ ని కావ్య విషయంలో నిలదీసిన ధాన్యలక్ష్మి..
Malli Nindu Jabili మే 15 ఎపిసోడ్: చీర నగలు నాకు మల్లినే సెలెక్ట్ చేయాలి
అనుపమమ ఇచ్చిన నగలు కాకుండా మాలిని అందరికి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది… సాయంత్రం ఫంక్షన్ కి నాకు చీర నగలు మల్లినే సెలెక్ట్ చేయాలి అని అంటుంది మాలిని. మాలిని అడగానే ఆనందంగా మల్లి ఉన్న చీరలు నగలు అన్నీ వెతికి మాలినికి మంచి బట్టలు సెలెక్ట్ చేస్తుంది. ఏ కల్మషం లేకుండా మాలిని కోసం ఆనందపడుతున్న మల్లిని చూసి బాధపడతాడు అరవింద్.

మాలిని ఏదో ప్లాన్ చేసుకొని ఇలా చేస్తుంది
మాలిని మల్లి తో అంత మంచిగా ఉండటం అరవింద్ కు అనుమానం కలిగిస్తూ ఉంటుంది, మాలిని ని నేను ఇలా ఉహించుకోలేక పోతున్నాను అని మనసులో అనుకుంటాడు. పక్కన మల్లి ఇచ్చిన చీర తీసుకుని లవ్ యు మల్లి నేను అనుకున్న చీరనే నువ్వుకూడా సెలెక్ట్ చేసావు మన ఇద్దరి టెస్టులు ఒకేలా ఉన్నాయి చూసావా అంటుంది మాలిని.
Krishna Mukunda Murari: దాచాలనుకున్న నిజాన్ని తనే బయటపెట్టిన మురారి.! రేపటికి సూపర్ ట్విస్ట్
మల్లి నీడను కూడా భరించలేకపోయేది…కానీ ఇప్పుడు
మల్లి మీద మాలిని చూపిస్తున్న ప్రేమ గురించి అనుపమ మాలిని ని పొగుడుతుంది. ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రవర్తించిన నువ్వు మాత్రం మల్లిని ఎప్పుడు దెగ్గరికి తీసుకున్నావ్ అని అంటుంది అనుపమ. అవును ఒకప్పుడు మల్లి నీడను చూస్తేనే తట్టుకోలేకపోయేది అలాంటిది ఇంత మార్పు ఎలా వొంచ్చింది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది రూప. దానికి బదులుగా మాలిని ఇలా అంటుంది ‘పల్లెటూరి నుండి వొచ్చిన మల్లి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే సిటీ లో మెచూర్డ్ గ పెరిగిన మనం చూసి చూడనట్లు వదిలేయాలి’. మనందరం కక్షమించరానంత తప్పు అయితే మల్లి చేయదు కదా అని అంటుంది.

Malli Nindu Jabili మే 15 ఎపిసోడ్: చెప్పి చెప్పకుండా చెప్పేస్తున్న మాలిని
మాలిని ఇలా మాట్లాడటంతో మల్లికి ఎంతో ఆనందం వస్తుంది. మరి అమాయకురాలు కదా పాపం. ఈ రోజు మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ లో ఎక్కువగా మనసులో మాటలు ఉంటాయి. మాలిని ప్రవర్తన గురించి అక్కడ కూర్చుని ఉన్నవారు మనసులో అనుకోవడం మనం వింటాం. ముఖ్యం అరవింద్ ఇలా అనుకుంటాడు ‘నువ్వు మల్లి కి ఇన్ డైరెక్ట్ గా ఎమ్ చెప్పాలి అని అనుకుంటున్నావో నాకు అర్ధం అయింది మాలిని’ అని అనుకుంటాడు.

మల్లి తో మైండ్ గేమ్స్ ఆడుతున్న మాలిని
రివర్స్ సైకాలజీ తరహా లో మల్లి తో మైండ్ గేమ్స్ ఆడుతుంది మాలిని. క్షమించరాని తప్పు నేను చేశాను అని మల్లి అరవింద్ తో తనకు జరిగిన పెళ్లి గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంత మంచి మాలిని అక్కకు నా వల్లనే ఇన్ని కష్టాలు అనుకుని తప్పు తనది అని ఆలోచించుకుంటుంది మల్లి. ఇంతలో అక్కడికి మాలిని వొచ్చి ఏమైంది అని అడిగితే ఎమ్ లేదు అక్క అరవింద్ బాబు గారికి మీకు పెళ్లి రోజు జరగబోతుంది అదే నాకు ఆనందం అని కప్పేస్తుంది మల్లి. ఇలా కాసేపు మాలిని మల్లి బయట మాట్లాడుకుంటారు కొంచెం సేపు తరువాత అరవింద్ తో మల్లి మాట్లాడుతుంది. అరవింద్ మాలిని ఉద్దేశం గురించి మల్లికి చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ మల్లి వినిపించుకోకుండా తన భర్త తనకు కావాలి అని మాలిని అక్క అనుకోవడం లో తప్పులేదు బాబుగారు అని అంటుంది. కాంచనమాల ఫ్రొమ్ చెన్నై…కథలోకి కొత్త పాత్ర శరత్ చెల్లెలు కాంచన మాల కాల్ చేస్తుంది. వసుంధర శరత్ కి మధ్యలో ఒక సన్నివేశం ఉంటుంది…ఇక తరువాత ఎమ్ జరుగుతుందో మల్లి నిండు జాబిలి సీరియల్ నేటి ఎపిసోడ్ మే 15 E 357 డిస్నీ+ హాట్ స్టార్ లో చూడండి.