Malli Nindu Jabili మే 16 ఎపిసోడ్: మల్లి పెళ్లి గురించి మాట్లాడటానికి అరవింద్ మాలిని పెళ్లి రోజు ఫంక్షన్ కి మీరాను ఆహ్వానిస్తుంది అనుపమ. తను మీరా ని రమ్మన్న విషయం అనుపమ రూపకు చెప్పడం తో మొదలవుతుంది ఈ రోజు మల్లి నిండు జాబిలి మే 16 ఎపిసోడ్ 358. అనుపమ ఇలా అనడం తో రూప కంగారు పడుతుంది, అయినా మల్లి విషయం చెబుతుంటే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్ రూప అని సందేహం తో అడుగుతాడు రామకృష్ణ. లేదు అని రూప అంటుంది, మల్లి చదువుకుంటుంది కదా అప్పుడే పెళ్లి ఎందుకు అని ఆలోచిస్తున్న అంతే అని వివరణ ఇస్తుంది రూప.

మల్లి కి మళ్ళీ పెళ్లి అని కంగారులో రూప
అనుపమ మల్లి పెళ్లి విషయం మాట్లాడానికి మీరాను పిల్చింది అని తెలుసుకున్న రూప కంగారు పడుతుంది. మల్లి కి ఇంతక ముందే పెళ్లి అయింది ఇప్పుడు రెండో పెళ్లి చేయడం ఏంటి అని వీళ్లకు అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరా వొచ్చింది అంటే ఇక్కడ గొడవలు అయిపోతాయి అని సందిగ్ధం లో పడుతుంది రూప. తరువాత సీన్ లో పట్నం వొచ్చిన మీరా రోడ్ మీద నడుస్తూ కనిపిస్తుంది.

Malli Nindu Jabili మే 16 ఎపిసోడ్: అసలు విషయం తెలియక కూతురి కోసం తల్లి ఆలోచనలు
అరవింద్ మాలిని పెళ్లి రోజు కోసం వొచ్చిన మీరా రోడ్ మీద తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. మల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మీ అమ్మ ఇంకా రాలేదు అని మల్లి వాళ్ళ అత్త కూడా ఎదురుచూస్తుంది అని అనుకుంటుంది మీరా. కానీ మీరా కు అసలు విషయం తెలియదు కదా…అనుపమ అమ్మ గారు ఇంట్లో ఏదో ఫంక్షన్ కూడా ఉంది అని చెప్పారు అలాంటి ఫంక్షన్ కి ఉట్టి చేతులతో వెళ్తే ఎం బాగుంటుంది, అరవింద్ బాబు గారికి మల్లికి బట్టలు పెడితే బాగుంటుంది అని బట్టల దుకాణం కి వెళ్తుంది మీరా.

అరవింద్ ఎక్కడ ఉన్నాడు మల్లి
గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పెడుతూ కనిపిస్తుంది మల్లి, ఇంతలో అక్కడికి కంగారుగా వొచ్చి ‘అరవింద్ ఎక్కడ ఉన్నాడు మల్లి’ అని రూప ఆడుతుంది. దానికి బదులుగా తెలియదు అన్నట్లు తల ఊపుతు రూమ్ లోనే ఉండి ఉంటాడు అని అంటుంది మల్లి. అర్జెంటు గా మీతో నీకు ఒక విషయం మాట్లాడాలి అరవింద్ దెగ్గరికి వెలదాం రా అని మల్లి చెయ్యి పట్టుకుంటుంది రూప. ఇంతలో అరవింద్ అక్కడికి వొస్తాడు.

అరవింద్ మీ ఇద్దరు పెద్ద డేంజర్ లో ఉన్నారు
అక్కడికి వొచ్చిన అరవింద్ తో రూప ఇలా అంటుంది ‘అరవింద్ మీ ఇద్దరు చాలా డేంజర్ లో ఉన్నారు’ అని అంటుంది. మల్లి మీ అమ్మ ఆల్రెడీ ఇక్కడకి బయలుదేరింది అని రూప చెప్పగానే షాక్ లో కనపడుతుంది మల్లి. ఎందుకు అక్కా అని అరవింద్ అంటాడు. మల్లి కూడా కంగారు ఉంది ఎందుకు వొస్తుందో చెప్పండి అమ్మగారు అని అందుతుంది. వింటే తట్టుకోలేవు అలా అని చెప్పకుండా ఉండలేను అని అంటుంది రూప. నీ పెళ్లి గురుంచి మల్లి అని అంటుంది. మల్లి పేళ్ళి టాపిక్ ఎందుకు వొచ్చింది అని అడుగుతాడు అరవింద్. ఇంట్లో అనుపమ తో జరిగిన సంభాషణ మొత్తం అరవింద్ మల్లి కి చెప్పేస్తుంది రూప.

మీరాకు అసలు విషయం తెలిసుండదు
అసలు విషయం తెలియక మీ అమ్మ ఎందుకు పిలిచారనుకుని వొస్తుందో అని కంగారు లో రూప అంటుంది. మీ పెళ్లి విషయం అందరికి తెలిసిపోయింది అందరూ ఒప్పుకుని ఉంటారు అనుకుని ఆశతో వొస్తునట్టు ఉంది అని అంటుంది రూప. నీ నుండు శుభవార్త వినాలనే ఆశతోనే అత్తయ్య బయల్దేరి ఉండొచ్చు లేదంటే ఏమైనా ఉంటె నాకు కాల్ చేసేది అని అంటాడు అరవింద్. అమ్మ వొచ్చింది అంటే చాలా గొడవలు అయిపోతాయి అర్జెంటు గా ఫోన్ చేయండి బాబు గారు అని అరవింద్ ని అడుగుతుంది మల్లి. అమ్మ బయల్దేరి ఉండక పోతె అప్పుదాం అని అంటుంది మల్లి. అరవింద్ కాల్ చేసి చూస్తే మీరా అప్పటికే బయల్దేరింది అని తెలుస్తుంది.

వసుంధర వర్సెస్ మీరా
తరువాత సీన్ లో ఒక మంచి బట్టల షాపును చూసిన మీరా ఇక్క బట్టలు బాగుంటాయి అనుకుంటూ లోపలి వెళ్తుంది. అదే బట్టల షాపులో వసుంధర ఉండటం ఈ రోజు కథలో మెయిన్ ట్విస్ట్. మాలిని అరవింద్ పెళ్లి రోజు కోసం చీర కొనడానికి వసుంధర కూడా అదే షాపుకు వొస్తుంది. అక్కడ వసుంధరను చూసి మీరా కంగారు పడుతుంది, నా గురించి ఆవిడకు తెలియదు కాబట్టి నేను కంగారు పడకూడదు అని అనుకుంటుంది మీరా. పాపం మీరాకు తెలియదు కదా వసుంధరకు అసలు విషయం తెలుసు అని.

మీరాను చూసిన వసుంధర దెగ్గరకు వొచ్చి గొడవ చేస్తుంది, ఇలాంటి స్థాయి తక్కువ వారిని ఇక్కడకు ఎలా రానిస్తారు అని అడుగుతుంది. చూడండి నేను ఎవరో మీకు తెలియదు నా గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అమాయకంగా అడుగుతుంది మీరా.

కొంచెం సేపడి తరువాత మీరా ను ట్రాప్ చేయడానికి ప్లాన్ ఆలోచించుకున్న వసుంధర షాపులోని వొస్తువు ఒకటి తీసి మీరా సంచిలో వేస్తుంది. ఆ తరువాత దొంగతనం నింద వేసి మీరాను పోలీసులకి పట్టిస్తుంది, ఇదంతా అరవింద్ మాలిని పెళ్లి రోజు ఫంక్షన్ కి మీరా రాకుండా చేయడానికి చేస్తుంది వసుంధర. ఇక మరి ఆ తరువాత ఎమ్ జరుగుతుంది అనేది సరి కొత్త మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ లో రేపు తెలుసుకుందాము…