Malli Nindu Jabili మే 18 ఎపిసోడ్: మాలిని నువ్వు ఇలారా అంటూ మాలిని చెయ్యి పట్టుకుని వసుంధర తీసుకువెళ్లడం తో మల్లి నిండు జాబిలి మే 18 ఈరోజు ఎపిసోడ్ E360 మొదలవుతుంది. మాలిని అరవింద్ పెళ్లి రోజు వేడుక జరుగుతుండగా అందరి ముందు మాలిని ని మాట్లాడాలి నువ్వు ఇలా రా అని తీసుకువెళ్తుంది వసుంధర…అక్కడ ఉన్న కాంచనమాల శరత్ తో వదిన మాట్లాడితే పిడుగులు పడినట్లే ఉంటుంది అన్నయ అంటుంది. వసుంధర గారి దెగ్గర అదే స్పెషలిటీ ఆ నోటి తో వంద మంది నోళ్లు కూడా మూయించగలుతుంది అని వెటకారం చేస్తుంది రూప.

ఇంతకీ ఇందులో మాలిని అత్త మామ గార్లు ఎవరు
కథలోకి కాంచన కొత్తగా వొచ్చిన సంగతి గుర్తు ఉంది కదా…క్రితం ఎపిసోడ్ లో మల్లి ని చూసి మాలిని అనుకుని వసుంధర చేతిలో తిట్లు తింటుంది శరత్ చెల్లి కాంచన. మాలిని ని వసుంధర పక్కకు తీసుకువెళ్లిన తరువాత ఇంతకీ ఇక్కడ మాలిని అత్త మామ ఎవరు అని అడుగుతుంది కాంచన. అరవింద్ తల్లి తండ్రులను కాంచనకు పరిచయం చేస్తాడు శరత్. అనుపమ రామకృష్ణలను చూడగానే కాంచన వెంటనే వెళ్లి తన సూట్కేసు తెచ్చి ఓపెన్ చేస్తుంది, అందులో ఉన్న చీరలు బయటకి తీసి ఇదిగోండి ఈ చీరలు చూడండి మీకు 40% డిస్కౌంట్ కి ఇస్తాను అని అంటుంది. వెంటనే శరత్ కాంచనకు ఇది బిజినెస్ చేసే టైం కాదు ఇక్కడ వొద్దు అని చెబుతాడు. పోనీ మొత్తం నువ్వు కొనేసి మీ చుట్టాలందరికి పెట్టెయ్ అని కాంచన అనడం తో జేబు లోంచి డబ్బులు తీసి కాంచనకి ఇస్తాడు శరత్.

Malli Nindu Jabili Today Episode మే 18 : మాలిని వసుంధర రహస్య మంతనాలు
తరువాత సీన్ లో మాలిని వసుంధరలు రహస్యంగా పక్కన మాట్లాడుకోవడం మనం చూస్తాం. ఎందుకు నన్ను ఇక్కడకి తీసుకువొచ్చావ్ అని మాలిని వసుంధరతో అంటుంది. ఒక దారిద్య్రాన్ని ఫంక్షన్ కి రాకుండా చేశాను కానీ మరో దరిద్రం మన వెంట వొచ్చింది అని వసుంధర అంటే అర్ధం కాక ఎం మాట్లాడుతున్నావ్ మామ్ అని మాలిని అడుగుతుంది. మీరా ఊర్లోకి దిగింది అని వసుంధర చెప్పగానే షాక్ లో కనపడుతుంది మాలిని.

మీరా అనే బురదని వొదిలించుకు రాగలిగాను కానీ కాంచన అనే చెత్తను మాత్రం అంటించుకు రావాల్సి వొచ్చింది అని అంటుంది వసుంధర. మీరా నీకు ఎక్కడ కనిపించింది అని మాలిని అడుగుతుంది, బట్టల షాపులో అని చెప్తుంది వసుంధర. వీళ్లు మీరాని ఫంక్షన్ కి పిలిచారంట అందుకే ప్లాన్ చేసి అది ఇక్కడికి రాకుండా చేశాను అని బట్టల షాపులో మీరాను అన్యాయంగా దొంగతనం కేసులో ఇరికించిన విషయం మాలిన చెప్పేస్తుంది వసుంధర. మంచి పని చేసావు మామ్ ఆమె గాని ఇక్కడకు వొచ్చింది అంటే నాన్న విషయం తెలిసి మా అత్తారింట్లో నా పరువు పోతుంది అని మాలిని అంటుంది.

సీసీటీవీ లో చిక్కిన వసుంధర దొంగతనం డ్రామా
మరోపక్క పోలీస్ స్టేషన్ లో ఉన్న మీరా మనకు కనిపిస్తుంది. స్టేషన్ లో బెంచి పైన కూర్చొని నాకు ఏ పాపం తలియదు అని వొణుకుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకు ఇన్స్పెక్టర్ వొస్తాడు, అతని తో తాను దొంగ తనం చేయలేదు అని ఏడుస్తూ చెబుతుంది మీరా. అడవి తల్లి బిడ్డను అయ్యా కూడు దొరకక పోతే పస్తులుంటాను గాని దొంగతనం చేసే రకం కాదయ్యా అని అంటుంది. నీ కాళ్లు పట్టుకుంటాను నన్ను వొదిలెయ్యండి అని దండం పెడుతుంది మీరా. దానికి బదులుగా ఇన్స్పెక్టర్ ఇలా అంటాడు ‘నువ్వు వెళ్లిన షాపులో నేను సీసీటీవీ ఫ్యూటేజ్ చూసాను ఆ దొంగతనానికి నీకు ఎలాంటి సంబంధం లేదు’ అని మీరా ను వొదిలేస్తాడు స్టేషన్ ఇన్స్పెక్టర్. ఇంట్లో ఫంక్షన్ మొదలయి ఉంటది అనుకుంటూ కంగారుగా మల్లి దెగ్గరకు పోతుంది మీరా.

Malli Nindu Jabili Today Episode మే 18: ఇదంతా చూస్తే అమ్మ ఏమైపోతుందో
ఫంక్షన్ కొద్ది సేపట్లో మొదలు అవుతుంది…అక్కడ మల్లి అమ్మ ఇప్పుడు వొచ్చేస్తుంది ఇక్కడ ఇదంతా చూసి అమ్మ ఏమైపోతుందో అని మనసులో అనుకుంటుంది. ఆ పక్కనే అనుపమ కూడా ఎదురు చూస్తూ కనపడుతింది. అక్కడకు వొచ్చిన వసుంధర అనుపమను చూసి మీరు ఎవరి కోసం చూస్తున్నారు అని అడుగుతుంది, బదులుగా మల్లి వాళ్ళ అమ్మ కోసం వసుంధర గారు అని సమాధానం ఇస్తుంది. ఇది విన్న శరత్ షాక్ లో కనబడటం చూపిస్తారు. ఎప్పుడో వొచ్చెయ్యాలి ఇంకా రాలేదు అని అంటుంది అనుపమ.

నా కూతురు అల్లుడు వేడుకకు పని వాళ్ళ అమ్మ ఎందుకు
ఈ రోజు నా కూతరు అల్లుడు అరవింద్ పేళ్ళి రోజు వేడుక కదా ఇలాంటి వేడుకకు పని మనిషి వాళ్ళ అమ్మ ఎందుకు అని వసుంధర అనడం అక్కడ ఉన్న ఎవరికీ నచ్చదు. మీరు పదే పదే అలా అనకండి వసుంధర గారు అని కోపం తో అంటుంది రూప. ఇంతకీ మీరాను ఎందుకు రమ్మన్నావ్ అనుపమ అని శరత్ తల్లి అడుగుతుంది, మల్లి పెళ్లి గురించి మాట్లాడటానికి అని అనుపమ అందరితో చెబుతుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాము అని రామకృష్ణ అంటే మరి మల్లి ఒప్పుకుందా అని అడుగుతుంది వసుంధర. ఒప్పిస్తాము వసుంధర గారు అని అంటారు.

తండ్రిని అసహ్యించుకున్న మల్లి
తరువాత సీన్ లో శరత్ అరవింద్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఎంత కాలం భరిస్తారు మావయ్య మల్లి కి మీ గురించి నిజం చెప్పకుండా అని అడుగుతాడు అరవింద్. వసుంధర మల్లి తండ్రిని టార్గెట్ చేసి మాట్లాడుతునన్నపుడు మల్లి చాలా నరకం అనుభవిస్తుంది అయినా నేను ఏమి చేయలేక పోతున్న అంటాడు శరత్. ఇంతలో అక్కడికి మల్లి వొస్తుంది…తన తండ్రి గురించి మాట్లాడుకుంటున్నారు అని విన్న మల్లి ఇలా అంటుంది ‘మీకు ఒక విషయం చెప్పనా బాబుగారు 25 ఏళ్ళు నాన్న కోసం ఎదురు చూసిన తరువాత ఇప్పుడు నేను ఆయన గురించి వొదిలేసాను, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను మా అమ్మ ఎంత బాధ పడుతుంది, ఇలా మమ్మల్ని వొదిలేసి వెళ్ళినాడు కాసాయాడు. అందరి ముందు ధైర్యంగా రాలేని వాడు ఇలా నన్ను ఎందుకు కనాలి మా అమ్మను మోసం చేయడానికా’ అని మల్లి అనడం తో తీవ్రంగా బాధ పడతాడు శరత్… మరి ఆ ఆ తరువాత మల్లి నిండు జాబిలి సీరియల్ లో ఏమైంది అని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చోడాల్సిందే…