Malli Nindu Jabili Serial మే 2: నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్న మొదటి భార్య అనే పదాన్ని శాశ్వతంగా తుడిచివేస్తాను అని వసుంధర మాలిని తో అనడంతో మొదలవుతుంది మల్లి నిండు జాబిలి మే 2 నేటి ఎపిసోడ్ S1 E348. నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోవాలి అరవింద్ నాకు దెగ్గర కావడం కోసం నువ్వు ఎమ్ చెప్పినా చేస్తాను అమ్మ అని అంటుంది మాలిని… నీ అంతట నువ్వు కాకుండా వాళ్లే నిన్ను మర్యాదపూర్వకంగా వొచ్చి నిన్ను తీసుకువెళ్లేలా నేను ప్లాన్ చేస్తాను అని మాలిని కి హామీ ఇస్తుంది వసుంధర. ఇక ఈ రోజు మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ వివరాలలోకి వెళ్తే…

Malli Nindu Jabili Serial మే 2: అరవింద్ బాబు గారు నన్ను చదివిస్తున్నారు
ఎన్ని గొడవలు వొచ్చిన ఎంత ఇబ్బంది ఎదురైనా అరవింద్ బాబు గారు ఎంతో బాధ్యతగా నన్ను చదివిస్తున్నారు, తొందరలో రాబోతున్న పరీక్షలకు నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అరవింద్ బాబుగారికి గొప్ప పేరు తీసుకురావాలి అని మనసులో అనుకుంటుంది మల్లి. నేను కూడా మంచి పేరు తెచ్చుకొని జీవితంలో పైకి రావాలి దాని కోసం ఎంత కష్టమైనా నేను కష్టపడి చదువుతాను అని పుస్తకం చదువుతూ అనుకుంటుంది మల్లి

లాయర్ ఆఫీసులో మాలిని వసుంధర
నమస్తే లాయర్ గారు అంటూ వసుంధర మాలిని కలిసి లాయర్ ని కలవడానికి వెళ్తారు, అక్కడికి వీళ్ళను రావడం చూసిన లాయర్ వారిని కూర్చోమని అడుగుతాడు. చెప్పండి వసుంధర గారు, మాలిని డివోర్స్ విషయం గురించే కదా? కోర్టులో మన నెంబర్ వొచ్చినప్పుడు అటెండ్ కావాల్సి ఉంటుంది.
నా కూతురికి అల్లుడికి వొచ్చిన మనస్పర్థలు వాళ్ళ డివోర్స్ కావాలని మేము మీతో చెప్పాము కానీ నా కూతురు ఇప్పుడు డివోర్స్ వొద్దు అని అంకుంటుంది తిరిగి అల్లుడు దెగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటుంది అని లాయర్ తో చెప్తుంది వసుంధర. మంచివిషయం కదా వసుంధర గారు అన్ని లాయర్ అంటాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది లాయర్ గారు, నా అల్లుడు నా కూతురిని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు మల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి మా అల్లుడు ఇంట్లోనే ఉంటుంది తన పేరెంట్స్ కి తెలియకుండా మానేజ్ చేస్తున్నాడు అని చెబుతుంది వసుంధర .

అతను మేనేజ్ చేయొచ్చు కానీ మీరెందుకు మీ వీయంకుల దెగ్గర ఈ నిజాంని చెప్పడం లేదు అని లాయర్ అడుగుతాడు దానికి వసుంధర ‘అనవసరమైన గొడవ లేకుండా లీగల్ గా వెళదామని ఆగిపోయాం అని చెబుతుంది వసుంధర’. మాలిని ని పెళ్లి చేసుకున్న తరువాత ఎన్ని రోజులకు అరవింద్ మల్లిని పెళ్లి చేసుకున్నాడు అని లాయర్ అడుగుతాడు, అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మీరు ఒకరినొకరు చూసుకుంటారు ఏంటమ్మా అని ప్రశ్నిస్తాడు. దానికి మాలిని ఇలా సమాధానం ఇస్తుంది ‘నాకంటే ముందే అరవింద్ మల్లిని పెళ్లి చేసుకున్నాడు’ అని జరిగిందంతా లాయర్ కు చెప్పేస్తుంది.
Malli Nindu Jabili May 2 2023: చట్ట ప్రకారం మల్లి నే అరవింద్ కు అసలు భార్య
ఇదంతా విన్న లాయర్ మాలిని తో మల్లి అరవింద్ కు మొదటి భార్య అవుతుంది అని చెప్తాడు. అలా ఎలా అవుతుంది లాయర్ గారు మాలిని ని అరవింద్ అందరి ముందు గ్రాండ్ గ పెళ్లి చేసుకున్నాడు అని వసుంధర అడుగుతుంది. అదంతా పనికిరాదు వాళ్ళు ఒకవేళ వాళ్ళ పెళ్లి ముందు జరిగినట్టు సాక్షాలు చూపిస్తే మీరు కోర్టులో అడ్డంగా దొరికిపోతారు అని లాయర్ అంటాడు. చట్ట ప్రకారం అన్ని హక్కులు మల్లికి మాత్రమే ఉంటాయి అని చెప్తాడు. అది విను మాలిని ఎమోషనల్ అవుతుంది, మరి నా అరవింద్ ను నేను ఎలా దక్కించుకోవాలి అరవింద్ లేకుండా నేను లైఫ్ లీడ్ చేయలేను ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని అంటుంది మాలిని.

చేతికి మట్టి నెత్తురు అంటకుండా ఒక సలహా
ఇదంతా విన్న లాయర్ వసుంధరతో ఇలా అంటాడు ‘చేతికి మట్టి నెత్తురు అంటకుండా పని అయ్యేలా నేను ఒక సలహా ఇస్తాను, ఆ మల్లి తనకు తానుగా తన దారి తాను చూసుకునేలా మీరు చేయాలి, మీరు ఏ గేమ్ ఆడతారో మీ ఇష్టం ఆ అమ్మాయి మాత్రం స్వచ్చందంగా నాకు ఈ భర్త వొద్దు బాబోయ్ అని వెళ్లి పోవాలి, అలా మీరు చేయండి అప్పుడు మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది’. అలా కాదని మాలిని కోరుకున్నట్లు ఆ మల్లి కూడా అరవింద్ కావాలని అనుకుంటే లీగల్ గా అరవింద్ మల్లికే దక్కుతాడు అని అంటాడు లాయర్.

అరవింద్ ఇంటికి మళ్ళీ వెళ్లిన వసుంధర
నా తో పోలిస్తే ఆ మల్లి నే అరవింద్ తో సంతోషంగా ఉంది మామ్ నువ్వే ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయాలి అని వసుంధరతో అంటుంది మాలిని. ఇది విన్న వసుంధర ఒక్కతే ఏదో ప్లాన్ తో అరవింద్ ఇంటికి వెళ్తుంది. అక్కడ లోపలికి వెళ్ళగానే అందరూ వసుంధరను పలకరిస్తారు, నువ్వు ఒక్కదానివే వొచ్చావా మాలిని రాలేదా అని అడుగుతుంది అనుపమ. మాలిని ఎందుకు వొస్తుంది మీరు ఏమైనా బొట్టు పెట్టి పిలిచారా మాలిని రావడానికి అని మండి పడుతుంది వసుంధర. మాలిని ని ఈ ఇంటికి పంపించాలి అంటేనే నాకు భయంగా ఉంది నా ఇంట్లో నిప్పును వెలిగించి ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారా అని అడుగుతుంది వసుంధర. కొడుకు కోడలు ఇలా ఉన్నప్పుడు మేము ఆనందంగా ఎలా ఉంటాము వసుంధరగారు అని అంటాడు రామకృష్ణ. మధ్యలో మల్లి ఏదో సద్ది చెప్పబోతే నూవ్వు నోరు ముయ్యి అని ఆపేస్తుంది వసుంధర.

అరవింద్ కు నా కూతురు బోర్ కోట్టేసింది
పక్క ప్లాన్ తో అరవింద్ ఇంటికి వెళ్లిన వసుంధర అక్కడ అరవింద్ కు నా కూతురు బోర్ కొట్టేసింది అందుకే ఈ పని మనిషితో మరో 7 ఏళ్ళు ప్రేమాయణం నడుపుదాం అని అనుకుంటున్నాడు అని అంటుంది. అది విన్న సుమిత్ర మేము బాధను అర్ధం చేసుకోగలం కానీ మీ మాటల్లో న్యాయం లేదు వసుంధర గారు అని అంటుంది. మీ అందరి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వొచ్చాను అని వసుంధర కోపంగా అంటుంది…ఒక్కసారిగా అందరూ షాక్ లోకి వెళ్తారు. ఇంతలో అక్కడికి లేడి కానిస్టేబుల్స్ తో పోలీసులు వొస్తారు. వసుంధర గారు ఎందుకు ఇలా ఆవేశం తో ఆలోచిస్తున్నారు అని సుమిత్ర అంటుంది దానికి బదులుగు నా కూతురు ఈ ఇంట్లో ఆత్మ హత్య చేసుకోబోయింది అంటూ తన ప్లాన్ అమలు చేస్తుంది. మరి ఇంటికి వొచ్చిన పోలీసులు ఎమ్ చేస్తారు ఆ తరువాత ఎమ్ జరుగుతుందో తెలియాలి అంటే మల్లి నిండు జాబిలి నేటి పూర్తి ఎపిసోడ్ చోడాల్సిందే.
