Malli Nindu Jabili మే 4 ఎపిసోడ్: నా కుటుంబం జైలుకు వెళ్లే పరిస్థిథి వొస్తే అంతకంటే ముందే వసుంధర గారు జైలుకు వెళ్ళేటట్లు చేస్తాను అని మల్లి అనడం తో నేటి మల్లి నిండు జాబిలి May 4 ఎపిసోడ్ E350 మొదలవుతుంది. అరవింద్ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించి వసుంధరకు బుద్ధి చెప్పే ప్లాన్ తో స్టేషన్ కు పరుగుతీస్తుంది మల్లి. మల్లికంటే ముందు మాలిని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ అనుపమ ను చూసి అత్తయ్య మీరంతా స్టేషన్ లో ఉన్నారు అని తెలిసి కంగారుగా బయలుదేరాను, అసలు ఏమైంది అని అడుగుతుంది. మీ అమ్మ నిన్ను డొమెస్టిక్ వొయిలెన్స్ తో మెంటల్ గా టార్చర్ పెడుతున్నాము అని మా మీద కేసు పెట్టిందమ్మ అని అంటుంది సుమిత్ర. మేము ఎంత బతిమిలాడిన మా మాటలు వినిపించుకోకుండా ఇక్కడి వరకు రప్పించింది అని అంటుంది అరవింద్ తల్లి.

ఇలా జరగడం నేను అస్సలు ఊహించలేక పోతున్నాను
పక్కన లాక్అప్ రూమ్ లో ఉన్న అరవింద్ రామకృష్ణలను చూసి ఏడుస్తూ మాలిని ఇలా అంటుంది ‘అరవింద్ మావయ్య మిమ్మల్ని ఇలా ఈ పరిస్తిథిలో చూడాల్సి వొస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు’ అంటుంది మాలిని. మేమంతా శాడిస్టులా ప్రవర్తించి నిన్ను హింసిస్తున్నాము అని మీ అమ్మ మా మీద కంప్లెయింట్ ఇచ్చి మామీద ఇలా నింద వేసింది ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం అని అంటాడు అరవింద్. కుటుంబ వివాదాలు నాలుగు గుమ్మాల మధ్యలో పరిష్కారం అవ్వాలి కానీ ఇలా స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కేదాకా రాకూడదమ్మా అని మాలిని తో అంటాడు రామకృష్ణ.

మీరు కంగారుపడకండి నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడతాను
రామకృష్ణ మాటలు విన్న మాలిని మీరు ఏమి కంగారు పడకండి మావయ్య మీకు ఏమి కాదు నేను ఎస్ ఐ గారితో మాట్లాడతాను అని అంటుంది మాలిని. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది మా అమ్మ నా ఫామిలీ మీద తప్పుడు అల్లగేషన్స్ పెట్టి కంప్లెయింట్ ఇచ్చింది అని స్టేషన్ ఎస్ఐ కి వెళ్లి చెబుతుంది మాలిని. మా అత్తగారి కుటుంబం నన్ను కోడలిలా కాకుండా కూతురిలా చూసుకున్నారు అని చెప్పడం తో అరవింద్ కుటుంబం కరిగి పొడవం మనం చూస్తాం, ఇది విన్న ఎస్ఐ కూడా సందిగ్ధంలో పడతాడు.

మా అత్తయ్య మామయ్యలు దేవతలు
ఎస్ఐ కి తన వాదన వినిపిస్తుంది మాలిని. మా అత్తయ్య మావయ్య దేవతలు అరవింద్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఎందుకు నన్ను హింసిస్తారు మా అమ్మ ఇచ్చిన కంప్లైంట్ మొత్తం తప్పుడు సమాచారం అని చెప్తుంది మాలిని. అయితే ఒకసారి మీ మదర్ ని పిలవండి మాట్లాడదాం అని అంటాడు ఆమె ఎందుకు అని మాలిని అడిగిన ప్రెశ్నకు కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ కాబట్టి అని చెప్తాడు సబ్ ఇన్స్పెక్టర్. నేను కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఇన్స్పెక్టర్ గారు, నేను మాలిని అనే వ్యక్తి మా అత్త మామల మీద మీకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా మరి మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని నిలదీస్తుంది మాలిని.

నేను కంప్లైంట్ ఇవ్వనప్పుడు మీరు పరువుగల ఒక పెద్ద కుటుంబాన్ని ఇలా అరెస్ట్ చేస్తారా? పోయిన పరువు మీరు తిరిగి ఇస్తారా? మా మామ్ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు నన్ను పిలిచి నిజామా కాదా అని ఎంక్వయిరీ చేయాలి కదా అని సూటిగా అడుగుతింది మాలిని. మా అత్తయ్య వాళ్ళని రిలీజ్ చేయండి ప్లీజ్ ఎస్ఐ గారు అని అడుగుతుంది మాలిని. నేను భాద్యితురాలిని కాదు అని మీరే వొచ్చి చెప్పినప్పుడు వాళ్ళను స్టేషన్ లో ఉంచాల్సిన అవసరం నాకు లేదు, ఒక పని చేయండి మా అత్త మామలు నా మీద ఎలాంటి హింస చేయలేదని ఒక పేపర్ మీద రాసి సంతకం చేయండి వెంటనే వారిని వొదిలేస్తాము అని అంటాడు ఇన్స్పెక్టర్. ఎస్ఐ చెప్పినట్లుగా మాలిని పేపర్ మీద రాసి సంతకం చేస్తుంది ఆ తరువాత అరవింద్ కుటుంబాన్ని బయటకి వొదిలేస్తారు.

కంగారుగా పరిగెడుతూ స్టేషన్ వైపు మల్లి
కంగారుగా స్టేషన్ వైపు పరిగెడుతున్న మల్లి మనసులో ఇలా అనుకుంటుంది ‘మాలిని అక్క జీవితం గురించి వసుంధర గారు ఆలోచించడం న్యాయమే కానీ ఏ తప్పు చేయని అమ్మగారిని ఇలా స్టేషన్ కి పంపడం మాత్రం న్యాయం కాదు వసుంధర అమ్మగారు చాలా దూరం వెళ్లిపోయారు అందరిని విడిపించడానికి నా బలం సరిపోదు అందుకే ఈ ఆధారం పట్టుకుని వెళ్తున్న, ఇది చూసిన తరువాత వసుంధర గారు వెనుకడుగు వేస్తారు’ అనుకుంటూ స్టేషన్ కి దెగ్గర వరకు వెళ్తుంది మల్లి.
సరిగ్గా మల్లి అక్కడకు వెళ్లే సమయానికి వసుంధర కూడా చేరుకుంటుంది ఇంతలో స్టేషన్ లోనుంచి అరవింద్ కుటుంబాన్ని బయటకు తీసుకు వొస్తుంది మాలిని అందరూ ఒకరికొకరు ఎదురు పడతారు.

Nuvvu nenu prema: విక్కీ- పద్మావతిల రొమాన్స్.. అరవిందను చంపడానికి కృష్ణ ప్లాన్..
నేను అరెస్ట్ చేయిస్తే నువ్వే రిలీజ్ చేయిస్తావా
మాలిని అరవింద్ కుటుంబం తో కలిసి బయటకు రావడం చూసిన వసుంధర కోపం తో మాలిని ని నేను అరెస్ట్ చేయిస్తే నువ్వు ఎందుకు రిలీజ్ చేయించావ్ అని అడుగుతుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయించావ్ అని మాలిని అడగటం తో నిన్ను హరాస్ చేసినందుకు అని చెప్తుంది వసుంధర. ఆ ఇంటినుంచి నా అంతట నేను బయటకి వొచ్చాను నన్ను ఎవరు మీద పట్టుకుని గెంటెయ్యలేదు అని వసుంధరతో అంటుంది మాలిని. అసలు నువ్వు కంప్లైంట్ ఎలా ఇస్తావు చేసే పనులకు హద్దులు ఉండవా అని అంటుంది మాలిని. ఇదంతా చూసిన మల్లి హమ్మయ్య నేను తెచ్చిన ఆధారంతో పనిలేకుండా అమ్మ గారు వాళ్ళు బయటకి వొస్తున్నారు అనుకుంటుంది. ఇలా కాసేపు వాదనతో మాటలతో కాసేపు కథ నడుస్తుంది. ఎపిసోడ్ చివరిలో మాలిని గది లోకి వెళ్తుంది వసుంధర, అక్కడ మాలిని ని హత్తుకుని నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది కదా అంటూ ట్విస్ట్ ఇస్తుంది. అవును మామ్ గ్రాండ్ సక్సెస్ అయింది అంటూ వసుంధరను కౌగిలించుకుంటుంది మాలిని. మరి అసలు పూర్తిగా ఎమ్ జరిగిందో మల్లి నిండు జాబిలి నేటి ఎపిసోడ్ May 4 2023 E350 డిస్నీ+ హాట్ స్టార్ లో చూసి తెలుసుకోండి.