Malli Nindu Jabili:మల్లి నిండు జాబిల్లి సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లో హీరోగా చేస్తున్న పవన్ సాయి, అదేనండి మన అరవింద్. ఆ పాత్రలో పవన్ సాయి జీవించేశాడు. పవన్ సాయి తెలుగు సీరియల్ నటుడు. ఇతను 1987లో జన్మించాడు. ఇతను హైదరాబాదులోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. చిన్నతనం నుంచి పవన్ సాయి కి మోడలింగ్ మీద యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. 19 ఏళ్ల వయసులోనే అతను సీరియల్స్ లో పనిచేయడం ప్రారంభించాడు. అతని మొదటిగా నటించింది హ్యాపీడేస్ అనే సీరియల్ ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ తో మంచి ఫేమస్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన ముద్దమందారం జీ తెలుగులో ప్రసారమయ్యే చాలా పెద్ద సీరియల్అయింది.మొగలిరేకులు ఈశ్వర్ పాత్రలో పవన్ సాయి జీవించేశాడు. అతని పేరు కన్నా ఈశ్వర్ అన్న పేరే ఎక్కువగా వినబడేది. జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ అతనికి ఎంతో మంచి గుర్తింపు తెచ్చింది. శ్రావణ సమీరాలు, నాగ భైరవి ఇలా తెలుగులో చాలా సీరియల్స్ లోనే నటించాడు పవన్. తర్వాత స్టార్ మా సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్స్ లో మల్లి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లో హీరో పాత్రలో పవన్ నటిస్తున్నాడు. అరవింద్ అనే క్యారెక్టర్ లోపవన్ నటిస్తున్నాడు.ఈ సీరియల్ తక్కువ టైంలోనే ఎక్కువ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పవన్ ఇద్దరమ్మాయిలకి న్యాయం చేయలేక తనలో తానే సతమతమవుతూ ఉండే క్యారెక్టర్. కానీ ప్రతి సన్నివేశాన్ని ఎంతో చక్కగా నటిస్తూ ఆ పాత్రకి తగిన న్యాయాన్ని చేసేవాడు పవన్. అలాంటిది ఇప్పుడు పవన్ ఆ సీరియల్ లో కనిపించడం లేదు కొత్త క్యారెక్టర్ని ఆ సీరియల్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగని పవన్ ని పూర్తిగా తీసేయలేదు. పవన్ సీరియల్ నుండి తప్పుకోవడానికి తనే ఒక వీడియో ద్వారా అభిమానులతో ఎందుకు సీరియల్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందో పంచుకున్నాడు. ఆ వీడియోలో తను చెప్పిన కారణానికి సీరియల్ నుంచి వెళ్లిపోవాలా అని అనిపిస్తుంది. తను చెప్పిన కారణం సీరియల్ లో నా పాత్ర కొంచెం తక్కువగా చూపించడం జరుగుతుంది.

సీరియల్ ని కొత్తదనంగా తీర్చిదిద్దడానికి కొత్త క్యారెక్టర్ ని సృష్టించడం జరుగుతుంది. నేనింకో సీరియల్ కి నటించడానికి ఒప్పుకున్నాను కాబట్టి . ఈ సీరియల్ నుండి నన్ను డైరెక్టర్ తీసేయలేదు నేనే నా అంతటా బయటికి వచ్చాను. ఇకనుంచి సీరియల్ కొత్తగా ఉంటుంది మీరు చూసి ఆదరించండి అని వీడియో రిలీజ్ చేశాడు పవన్. ఈ వీడియో చూసిన అభిమానులు ఈ చిన్న కారణానికే పవన్ సీరియల్ నుంచి తప్పుకోవాలా అని అనుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మన అరవింద్ ఇప్పుడు ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ లో అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియోని రిలీజ్ చేశాడు. మళ్లీ సీరియల్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సివచ్చింది.కానీ అందు లో నా పాత్ర లో వేరే కొత్త వ్యక్తి కనిపిస్తాడు అని చెప్పాడు. పవన్ అభిమానులు ఈ వార్తతో కాస్త సంతోషంగా లేరని చెప్పాలి.తన కొత్త ప్రాజెక్టుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ సీరియల్ ని అందరూ ఆదరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.