Malli Nindu Jabili ఏప్రిల్ 24: మల్లి కి అరవింద్ గట్టి వార్నింగ్ ఇవ్వడం తో మల్లి నిండు జాబిలి సీరియల్ నేటి ఎపిసోడ్ S1 E342 మొదలవుతుంది. మాలిని ని నన్ను కలపడానికి నువ్వు చేసే ప్రయత్నాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆచారాలను అడ్డుపెట్టుకొని నాలుగు గోడల మధ్య ఉంచి తాళి కట్టిస్తే మేము కలిసిపోతామా? మాలిని ఇంకా ద్వేషాన్ని రగిలించుకుంటుంది మేము కలిసిపోతాం అని ఎలా అనుకుంటున్నావు? నీ పిచ్చి కాకపోతే మనస్పర్థలు వొచ్చిన చోట మనసులు కలుస్తాయి అని ఎలా అనుకున్నావ్… అని అరవింద్ మల్లి తో అంటాడు.

Malli Serial April 24 Today Episode: లైఫ్ అంటే ఫాంటసి కాదు మల్లి
మల్లి ని నిలదీస్తూ అరవింద్ అంటాడు… లైఫ్ అంటే ఫాంటసీ కాదు మల్లి, మన పెళ్లి అయినప్పుడు పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు నువ్వు అలాంటి పరిస్థిథి తెచ్చి విజయం సాధించి పెద్ద త్యాగమూర్తి అవుదామని అనుకోకు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు అని అరవింద్ హెచ్చరిస్తాడు. సీతారాముల దెగ్గర దండం పెట్టుకొని ఆ రోజు నా విషయంలో జరిగినట్టే ఈ రోజు అరవింద్ బాబు గారు మాలిని అక్క జీవితం లో కూడా జరిగేలా చూడమని వేడుకున్నాను ఎందుకో మరి ఆ దేవుడు నా మోర ఆలకించలేదు అంటుంది మాలిని. బాపు రాకముందే చేసేద్దాం అనుకున్న కానీ బాపు వొచ్చి ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడి పెళ్లి జరగకుండా చేసాడు. మీ పెళ్లి జరుగుతే కొంత కాలానికి మీ మనస్పర్థలు దూరం అయ్యి మీరు దెగ్గర అవుతారు అనుకున్నాను అంటుంది మల్లి.

Malli Nindu Jabili Serial ఏప్రిల్ 24: దొంగతనాన్ని ఆపేసిన మీరా…కొత్త రహస్యం తెలుసుకున్న మాలిని
మాలిని ట్రంక్ పెట్టిలో తన హ్యాండ్ బ్యాగ్ ని దాచిపెట్టుకుంది. అయితే మీరా తల్లి మాలిని దెగ్గర డబ్బు బానే ఉంటుంది పైగా ఇన్ని రోజులు మా దెగ్గరే తినింది కాబట్టి 4 పెద్ద నోట్లు తీసుకుంటే తప్పు ఏం లేదు అంటూ బ్యాగ్ లో నుంచి డబ్బులు బయటకి తీస్తుంది. ఇంతలో మాలిని తో కలిసి లోపలికి వొచ్చిన మీరా తన తల్లిని చూసి తిట్టి బయటకు పంపించేస్తుంది. ఎం అనుకోవొద్దమ్మ మా అమ్మ బుద్ధి అప్పుడప్పుడు గడ్డి తింటుంది అని మాలిని దెగ్గర క్షమాపణ కోరుతుంది మీరా.
కింద పడిన ట్రంక్ పెట్టి సామాను మీరా సర్దుతూ ఉండగా అడుగున ఉన్న ఫోటో ఒకటి బయటపడుతుంది. అది చూసిన మీరా మాలినికి కనపడకుండా తిరిగి పెట్టెలో పెడుతుండగా మాలిని మీరా చేయి పట్టుకొని ఆపుతుంది. ఒక్కసారి ఫోటో నన్ను చూడనివ్వండి… అది అంత రహస్యమా అని మాలిని అనగా మీరా దానికి ఇది నా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేనిది అని చెప్తూ ఫోటో గురించి మర్చిపోండమ్మా అని అంటుంది.
అయితే మాలిని మాత్రం మీరా మాటలు లెక్క చేయకుండా ఫోటో తీసుకొని చూస్తుంది. ఆ ఫోటో చూసిన మాలిని మొఖం ఒక్కసారిగా మారిపోతుంది మీరా మొఖంలో కంగారు పెరిగిపోతుంది.
Nuvvu nenu prema: కృష్ణ చెంప పగలగొట్టిన అండాలు..అరవిందకు పద్మావతి నిజం చెబుతుందా..?

ఫొటోలో మీరా తో ఉన్నది ఎవరు
ఫోటో లాక్కుని చూస్తున్న మాలిని ని చూసి ఎందమ్మ ఆలా బలవంతంగా ఫోటో ఎలా లాక్కుంటారు అని నిలదీస్తుంది. కానీ ఫోటో లో ఉన్న వ్యక్తిని చూసి మాలిని ‘డాడీ’ ఎందుకు మీరా తో ఉన్నారు ఈ ఫొటోలో అని అనుకుంటుంది. ఫోటో లో ఉన్న అతను ఎవరు మీకు ఎం అవుతారు అని మీరాని అడుగుతుంది మాలిని. అందరితో చెప్పుకునే విషయం కాదమ్మా అని మీరా అంటుంది దానికి బదులుగా మాలిని మీ కుటుంబ విషయాలు మొత్తం తెలుసుకున్న దానిని ఫొటోలో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుంటే తప్పా అని ఆడుతుంది. సత్య మీ భర్త కాదు అని మీ అమ్మగారు చెప్పారు, అప్పుడే అనుమాన వొచ్చింది కానీ రెట్టించి అడిగేవారు లేక అడగలేదు. కానీ ఇప్పుడు ఒక ఆధారం చూసాను కాబట్టి అడుగుతున్న మల్లికి చదువు చెప్తున్నాను అనే కృతజ్ఞత తో అయినా చెప్పండి అని మాలిని అడుగుతుంది… దానికి బదులుగా మీరా ఫోటోను బయటకి తీసి నా పక్కన ఇంత చనువుగా ఉండేటోడు ఇంకెవరు అవుతారమ్మ నా కడుపున పుట్టిన మల్లి కి తండ్రి ఇతను అని చెప్తుంది… ఆ తరువాత మల్లి నిండు జాబిలి సీరియల్ లో ఏమవుతుంది? నిజం తెలుసుకున్న మాలిని ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ విషయం మల్లికి తెలుస్తుందా? ఇలాంటి రసవత్తరమైన సీన్స్ కోసం మల్లి నిండు జాబిలి నేటి ఎపిసోడ్ ఏప్రిల్ 24 ఎపిసోడ్ ని హాట్ స్టార్ లో చూడండి.
Krishna Mukunda Murari: నందిని సిద్ధుని ఒక్కటి చేసిన మురారి కృష్ణ.. భవాని ఊహించని నిర్ణయం..