Malli Nindu Jabili ఆగస్టు 7 ఎపిసోడ్ 417: మల్లి నిండు జాబిలి ఈ రోజు ఆగస్టు 7 2023 ఎపిసోడ్ S1 E417 ఇలా మొదలవుతుంది… ఒక మంచి ఉద్దేశంతో మల్లి కి ఫోన్ కొనిస్తే మాలిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. మల్లి ఏమో ఆ గౌతమ్ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదంటే మాట వినట్లేదు అని అరవింద్ ఆలోచిస్తూ ఉంటా. కట్ చేస్తే మల్లి అరవింద్ గురించి ఆలోచిస్తుంది.నేను ఎన్ని మాటలు అంటున్న అరవింద్ బాబు గారు నన్ను విడిచి పెట్టకుండా నా క్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఆపద సమయంలో పనికొస్తుందని ఫోన్ కొనిచ్చారు. అది అర్థం చేసుకోకుండా గౌతం సార్ ఫోన్ పగలగొట్టేశారు.

గౌతమ్ సార్ చేసే పనులు బాలేదు
రేపు ఈ విషయం బాబు గారికి తెలిసింది అంటే నేను ఏం సమాధానం చెప్పాలి గౌతమ్ సార్ చేసిన పని నాకేం నచ్చలేదు గౌతమ్ సార్ ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు మల్లి అనుకుంటుంది.మల్లి నీ మంచి కోసం ఎంతలా ఆలోచిస్తున్నా నువ్వు అర్థం చేసుకోవడం లేదు నువ్వు పాము పడగ కింద ఉన్నావు అది ఎప్పటికైనా నీకు ప్రమాదమే అది నువ్వు గుర్తించేసరికి చాలా కోల్పోతావ్ అని అరవింద్ అనుకుంటాడు. ఎన్నిసార్లు నేను నిన్ను నమ్మి మోసపోవాలి అరవింద ఇంక నావల్ల కాదు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది మాలిని. కచ్చితంగా చేస్తాను అరవింద్ చేసిన డ్యామేజ్ కి ఏదో ఒక రోజున నేను చేయాల్సింది కచ్చితంగా చేస్తాను అని గౌతమ్ అనుకుంటాడు.

Malli Nindu Jabili ఆగస్టు 7 ఎపిసోడ్ 417: నా కోసం వెయిట్ చేయొద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి
కట్ చేస్తే కౌసల్య నీలిమ డైనింగ్ హాల్ దగ్గర కూర్చుంటారు, ఇంతలో గౌతమ్ వస్తాడు నాకోసం వెయిట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీరు బ్రేక్ ఫాస్ట్ చేయాల్సింది కదా అని గౌతమ్ అంటాడు నువ్వలా అనటం మేము వెయిట్ చేయటం మామూలే కదా గౌతం అని కౌసల్య అంటుంది.ఎందుకు ఇద్దరు డల్ గా ఉన్నారు అని గౌతమ్ అడుగుతాడు. నైట్ నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు బ్రో అంటుంది నీలిమ. నువ్వు నీ బిజినెస్ పార్ట్నర్ తో హార్శ్ గా మాట్లాడినట్టు ఆడపిల్లతో అలా మాట్లాడితే హర్ట్ అవుతుంది. ఆ మాలిని చేసిన పని వల్ల మల్లి హాస్టల్ నుంచి బయటికి వచ్చింది లక్కీగా నిన్ను సేవ్ చేసింది కాబట్టి మన ఇంటికి వచ్చింది ఇప్పుడు మన ఇంట్లో షెల్టర్ తీసుకుంటుంది అని మనం ఎలా ప్రవర్తించిన సరిపోతుందా బ్రో అని నీలిమ అంటుంది.

కరెక్ట్ ఎలా అవుతుంది నా పరిస్థితి బాగాలేదు అని ఇంట్లో ఉన్నందుకే కదా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అని చిన్న బుచ్చుకుంటారు అని కౌసల్య అంటుంది. మల్లి అలా ఏమీ అనుకోలేదు. అలా అనుకోకపోతే ఎందుకు బాధపడుతుంది అని కౌసల్య అంటుంది. తను చేసిన పని నాకు నచ్చలేదు అని గౌతమంటాడు. తనకి మెల్లగా చెప్పాలి కదా.మల్లి ప్లేస్లో నేనుంటే అలాగే చేసేవాడివా అని నీలిమ అడుగుతుంది.అలా చేయకూడదు గౌతమ్ ఆడపిల్లలను మహాలక్ష్మి అంటారు అది కాకుండా మనకు చాలా సహాయం చేసింద అలాంటి పిల్లని మనం ఎంత బాగా చూసుకోవాలి. అందరికీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది బ్రో గతంలో నువ్వు ఒకసారి బ్రేస్లెట్ విషయంలో తనని తిట్టినందుకే ఫీల్ అయ్యి జాబ్ మానేస్తా అని మాతో చెప్పింది. ఆరోజు నీ గతం గురించి చెప్పావు కాబట్టి అర్థం చేసుకొని జాబ్ మానేయకుండా ఆగిపోయింది.

మల్లికి మనకి ఏదో సంబంధం ఉంది అంటున్న కౌసల్య
గౌతమ్ ఒక మాట చెప్తాను విను మల్లి కి మనకి ఏదో సంబంధం ఉంది దయచేసి నువ్వు అర్థం చేసుకో గౌతమ్ అని కౌసల్య అంటుంది. నీలు వెళ్లి మల్లి ని పిలుచుకొని రా. లేదు తను వెళ్ళిపోయింది అని నీలిమ అంటుంది. అనగానే గౌతమ్ కూడా చెయ్యి కడిగి వెళ్లిపోతాడు. అక్కడ ఆఫీస్ లో మల్లి ని ఏమంటాడో ఏమో అని మాలిని అంటుంది. కట్ చేస్తే మల్లిని గౌతమ్ తన క్యాబిన్ కి రమ్మంటాడు. మళ్లీ వెళ్తుంది, నామీద కోపం తగ్గలేదా అని మల్లి అడుగుతుంది. నీ మీద కోపం తగ్గింది కానీ నా మీద నాకు కోపం తగ్గలేదు.నేను అలా చేసినందుకు సారీ అని అంటాడు. మీరు నాకు సారీ చెబుతున్నారా. చాలా గొప్ప విషయం జరిగింది ఈరోజు అని మల్లి అంటుంది. టిఫిన్ చేయకుండా వచ్చావ్ అంట, నేనేమైనా అన్నా తిట్టిన టిఫిన్ చేయకుండా మాత్రం రాకు అని గౌతం అంటాడు.

Malli Nindu Jabili Today Episode ఆగస్టు 7:ఎం కావాలో చెప్పు మల్లి ఆర్డర్ చేస్తాను
మీరు కూడా తినకుండా వచ్చారంట మేడం గారు ఫోన్ చేసి చెప్పారు. ఆర్డర్ చేస్తాను ఏం కావాలో చెప్పు అని గౌతమ్ అంటాడు. ఇంతలో ఆఫీస్ బాయ్ టిఫిన్ తీసుకొని వస్తాడు మీ కోసం మేడం పంపించారు అని చెప్తాడు. అమ్మ ఇద్దరి కోసం పంపించింది దా తిన్నాం అంటాడు. నాకు వద్దు బాస్ అని అంటుంది మల్లి. బాస్ గా ఆర్డర్ చేస్తున్నాను తిను అంటాడు గౌతం. ఇంతలో అరవింద్ వచ్చి మల్లి రాలేదా అని అడుగుతాడు. వచ్చింది సార్ గౌతమ్ పిలిచారని వెళ్ళింది. గౌతమ్ ఇంక మల్లి కలిసి తినడం చూసి అరవింద్ ఫీలవుతాడు.అక్కడ నిప్పుంది పట్టుకోవద్దు అని పసిపిల్లలకు ఒకసారి చెప్తే వింటారు గౌతమ్ తో మల్లికి ప్రమాదం ఉందని చెప్తుంటే ఎందుకు వినట్లేదు. గౌతమ్ గురించి మల్లి గురించి ఆఫీసులో తప్పు తప్పుగా మాట్లాడుకుంటారు. నైట్ నీ మొబైల్ పగలగొట్టినందుకు నష్టపరిహారంగా ఇస్తున్నాను అని మొబైల్ ఇస్తాడు గౌతం. తీసుకోకపోతే దీన్ని కూడా పగలగొట్టేస్తాను అంటాడు.
అసలు మధ్యలో వాడు ఎవడు మల్లి అని అడిగిన అరవింద్
వద్దు తీసుకుంటాను లేండి అంటుంది మల్లి. మల్లి క్యాబిన్ లో నుంచి వెళ్ళిపోతుంది.నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది మల్లి అని గౌతమ్ అనుకుంటాడు.మల్లి నీతో మాట్లాడాలి రా అని అరవింద్ అంటాడు. అయినా నాకు పని ఉంది నేను రాను అంటుంది మల్లి. అదేంటి నేను నిన్న కొన్న ఫోన్ ఇది కాదు కదా అని అంటాడు అరవింద్. బాబు గారు దయచేసి ఇప్పుడేం మాట్లాడకండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని మల్లి అంటుంది. అరవింద్ మల్లిని పక్కకు తీసుకెళ్తాడు. నేను ఇచ్చిన ఫోన్ ఏది అని అడుగుతాడు అరవింద్. పగిలిపోయింది అని మల్లి అంటుంది. నీ దగ్గర విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంటాయి పగిలిపోయింది అంటే నేను నమ్మను. ఇది ఎవరిచ్చారు ఆ గౌతమి కదా అని అంటాడు అరవింద్. అవును అని చెప్తుంది మల్లి.

అంటే నేను ఇచ్చిన ఫోన్ గౌతమ్ పగలగొట్టేసాడు అంతేనా నేనిచ్చిన ఫోన్ వాడు ఎందుకు పగలగొట్టాడు అంటాడు అరవింద్. బాస్లను ఎదిరించి నాలాంటి వాళ్ళు బతకగలరా. అయినా మీ ఫోన్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాను కదా మీకెందుకు బాధ. నావల్ల నువ్వు రోడ్డున పడ్డావు అని ఇదంతా బాధ. ఉండకూడదు బాధపడకూడదు నేనింకా అని అరవింద్ అనుకుంటాడు.