NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights

Malli Nindu Jabili  April 25 2024 Episode 632: ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ అని వసుంధర అంటుంది. తెలియదు అత్తయ్య నాతో మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది అని అరవింద్ అంటాడు. పదండి వెతుకుదాం అని ముగ్గురు బయలుదేరుతారు. కట్ చేస్తే, దేవుడా మేము సంతోషంగా ఉంటే చూడలేవా కొన్నాళ్లు కూడా మేము ఆనందంగా లేము అప్పుడే మా జీవితాల్లో కష్టాలను సృష్టించావా అని మల్లి సీతారాములతో మాట్లాడుతుంది. అరవింద్ వల్ల నా ఉద్యోగం పోయిందని మల్లి కి చెబుదామని వచ్చాను ఈ సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు అని గౌతమ్ అనుకుంటాడు. మల్లి ఎందుకు అంతలా బాధపడతావ్ వాళ్ల కోసం నువ్వు ఎంతో చేశావు కానీ వాళ్లకు కృతజ్ఞత అనేది లేదు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights
Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights

మన వల్ల వాళ్లకి చాలా పెద్ద నష్టం జరిగిపోయింది జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది వాళ్ళని మనం క్షమాపణ అడగాలి అని మల్లి అంటుంది. మల్లి నేను ఏ తప్పు చేయలేదు నేను క్షమాపణ అడగను అని గౌతమ్ అంటాడు. మీరు ఆరోజు అలా ఫోన్ చేయించకపోతే అక్క నేను అక్కడికి వెళ్లే వాళ్ళమే కాదు అక్క కు అలా జరిగేదే కాదు అక్కకి క్షమాపణ చెప్పాల్సిందే మీరు రండి అని మల్లి బలవంతం చేసి గౌతమ్ ని తీసుకు వెళుతుంది. వెళ్తూ ఉన్న వాళ్ళని ఆపి ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ నా కొడుకుని అని కౌసల్య అడుగుతుంది. మాలిని అక్కకి మా వల్ల నష్టం జరిగింది క్షమాపణలడానికి వెళ్తున్నాం అని మల్లి అంటుంది. చేసిన రచ్చ చాలు వాడిని ఎక్కడికి తీసుకువెళ్ళకు కావాలంటే నువ్వు వెళ్ళు అని కౌసల్య అంటుంది. మల్లి గౌతమ్ ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మాలిని కోసం వసుంధర అరవింద్ శరత్ వెతుకుతూ ఉంటారు. ఒక దగ్గర కారు కనపడడంతో అక్కడికి వెళ్లి చూసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారు.

Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights
Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights

మేము ఇప్పుడే వచ్చామండి కారు ఒక్కటే ఉంది ఇందులో మనుషులు లేరేంటి అని అనుకుంటున్నాం అని వాళ్ళు అంటారు. మాలిని ఇక్కడే ఎక్కడ ఎక్కడ ఉంటుంది వెతకండి అని తలోదిక్కు వెతకగా వసుంధరకి మాలిని కనిపిస్తుంది. స్పృహ లేకుండా పడిపోయి ఉన్నా మాలినిని ఇంటికి తీసుకొస్తారు. కట్ చేస్తే, డాక్టర్ గారు మాలిని కి పెద్ద ప్రమాదమేమీ లేదు కదా అని వసుంధర అంటుంది. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు టాబ్లెట్ వేసాను కదా కంగారు పడాల్సిన పనిలేదు నాలుగు గంటలో మెలకువ వస్తుంది అని డాక్టర్ టాబ్లెట్లు రాసి ఇచ్చి వెళ్తుంది. మాలిని స్పృహలోకి వస్తుంది. మాలిని ఇప్పుడు ఎలా ఉంది అని అరవింద్ అంటాడు. నేను చచ్చిపోయి నా కూతురు దగ్గరికి వెళ్లి పోయినా బాగుండేది మమ్మీ అని మాలిని ఏడుస్తుంది. నువ్వు చచ్చిపోతే నేనేం కావాలి మాలిని అని అరవింద్ అంటాడు. ఏంటమ్మా ఆ మాటలు నువ్వు లేకపోతే మేమంతా ఏమైపోవాలి అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights
Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights

నీ కూతురు వల్లే నా కూతురికి ఇంత నష్టం జరిగింది ఇప్పుడు పరామర్శిస్తున్నావా అని వసుంధర అంటుంది. మల్లి తనకోసం ఎంతో చేసింది మీరు అలా మాట్లాడకండి అమ్మ అని మీరా అంటుంది. ఒక తండ్రిగా నేను కానీ ఒక తల్లిగా మీ అమ్మకాని నీకోసం మేము ఏమి చేయలేదు మల్లి నీకోసం అంతలా చేసింది తనని తప్పుగా అర్థం చేసుకోకమ్మ అని శరత్ అంటాడు. ఆపుతారా మీ మాటలు మాలిని జీవితంలో మల్లి ఒక శనిలా దాపరించింది దానివల్లే మాలిని కి ఈ పరిస్థితి వచ్చింది అని వసుంధర అంటుంది. అత్తయ్య ఇప్పుడు గొడవ పడే సమయం కాదు మాలినికి రెస్ట్ కావాలి అని అరవింద్ మాలిని లోపలికి తీసుకు వెళ్తూ ఉండగా మల్లి గౌతమ్ అక్కడికి వస్తారు. నువ్వు ఎందుకు వచ్చావే వెళ్ళిపో అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights
Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights

అక్కకి ఏమైంది అని మల్లి దగ్గరికి వెళ్తుంది. నిన్ను కలిసి వస్తూ ఉండగా నా కూతురికి యాక్సిడెంట్ అయింది ముందు నువ్వు బయటికి నడివే నిన్ను చూస్తేనే నా కూతురికి శాపం అని మల్లి ని నెట్టేస్తుంది వసుంధర. అత్త అని అరవింద్ కోపంగా అంటాడు. మాలిని నువ్వంటే నా కూతురికి ప్రాణం  ని కోసం తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి రోడ్లు పట్టుకుని తిరిగింది మీరు ఇలా మాట్లాడటం ధర్మం కాదు అని మీరా అంటుంది. అక్క నీ జీవితంలో జరిగిన నష్టాలకి పరోక్షంగా మేమే కారణం అంటున్నారు కాబట్టి క్షమాపణ అడగడానికి వచ్చాము అని మల్లి అంటుంది. ప్లీజ్ మల్లి నువ్వు కనపడుతుంటే నా జీవితంలో జరిగిన నష్టాలే గుర్తుకొచ్చి బాధ కలుగుతుంది ప్లీజ్ ఇకనుంచి వెళ్ళిపో నువ్వు నాకు చేసింది మేలు కంటే కీడే ఎక్కువ ఉంది అని మాలిని అంటుంది.  మల్లి వద్దంటే ఇక్కడికి వచ్చావు జరిగిన అవమానం చాలు వెళ్దాం పద అని గౌతమ్ అంటాడు. మల్లి ఎప్పుడు మంచి చేయాలనే చూస్తుంది కానీ కొందరు కీడు చేస్తూ ఉంటారు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights
Malli Nindu Jabili Today Episode April 25 2024 Episode 632 highlights

ముందు నువ్వు బయటికి పోవే అని వసుంధర అంటూ ఉండగా మల్లి పరిగెత్తుకెళ్ళి మాలిని కాళ్ళ మీద పడి నన్ను క్షమించక నువ్వు క్షమించకపోతే నన్ను ఇక్కడే చంపేసేయ్ అంతేగాని నువ్వు నన్ను నీ ముందుకు రావద్దు అంటే తట్టుకోలేను అని మల్లి బాధపడుతుంది. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు అంటూ మాలిని మల్లి ని నెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. అక్క నేను చెప్పేది విను అక్క అని మల్లి అంటుంది. మాలిని తో మాట్లాడే సమయం ఇది కాదు నేను చెప్తున్నాను కదా మల్లి వెళ్ళిపో అని అరవింద్ అంటాడు. నా కూతురు నీతో మాట్లాడినట్టున్న సిగ్గు లేకుండా నా ఇంట్లో ఉండడానికి నీకు అసలు బుద్ధి లేదా  వెళ్ళిపో బయటకి అని వసుంధర అంటుంది. జరిగిన అవమానం చాలు పదా ఇంటికి అని గౌతమ్ మల్లి నీ తీసుకొని వెళ్ళిపోతాడు. మాలిని డాక్టర్ గారు చెప్పింది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella