NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 27 2024 Episode 557: హాస్పిటల్ కి వెళ్లి మాలినిని పరామర్శించిన గౌతమ్ మల్లి..

Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights

Malli Nindu Jabili January 27 2024 Episode 557: మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అత్త కొన్నాళ్లు ఆగితే నీకే అర్థమవుతుంది అని గౌతమ్ అంటాడు. కడుపులో బిడ్డ బాగానే ఉన్నాడు కదా ఒకసారి చూడ ఇవ్వండి రిపోర్టు అని మల్లి అంటుంది. స్కానింగ్ లో ఉన్న నా కూతురు బిడ్డను చూడడానికి నువ్వు అర్హురాలువు కాదు అని వసుంధర అంటుంది. వసుంధర నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అని శరత్ అంటాడు. మీ బిడ్డ మీకు ముద్దేమో నాకు కాదు నా అల్లుడు నిజంగా చనిపోయాడా బ్రతికున్నాడా అనేది కొంచెం అనుమానంగా ఉండేది పోలీసులు ఇంటికి వచ్చి నిర్ధారణ చేసిన తర్వాత  గుండె పగిలింది నా కూతురు తట్టుకోలేకపోయింది అని వసుంధర బాధపడుతుంది. ఒక్కసారి మాలినిని చూసి వస్తా అని గౌతమ్ అంటాడు. నా కూతురు భర్తను చంపిన నువ్వు చూసి పోవడానికి వచ్చావా అని వసుంధర బయటికి పొమ్మంటుంది.వసుంధర నీకు ఏది అనిపిస్తే అది అనుకుంటూ ఊహించుకుంటున్నావా కొంచెం సహనం పాటి చు అని శరత్ అంటాడు. దీని భర్త చనిపోయి ఉంటే మీరు ఇలాగే అనేవారా అని వసుంధర అంటుంది. నేను ఎలాగైనా అక్కను చూస్తాను అని మల్లి వెళ్లబోతుండగా మీరు నా కూతురుని చూడడానికి వీల్లేదు అని వసుంధర అంటుంది. వసుంధర మనం ఎన్ని అనుకున్నా అరవింద్ తిరిగి వస్తాడా అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights
Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights

అలాగని వీళ్ళని వదిలేయమంటారా అని వసుంధర అంటుంది. ఎంక్వైరీ లో తేలేదాక్క కామ్ గా ఉండు అని శరత్ అంటాడు. కట్ చేస్తే,మల్లి గౌతమ్ మాలిని దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటారు. అక్క నిన్ను ప్రాణంగా ప్రేమించిన బాబు గారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అరవింద్ బాబు గారిని చంపేంత పగ ఎవరు ఉందో ఎవరు ఇలా చేశారో ఏమీ అర్థం కావట్లేదు అని మల్లి పరి విధాలా బాధపడుతుంది. మీ అమ్మ నన్ను అనుమానిస్తుంది మాలిని కానీ నాకు అరవింద్ మన ఫ్యామిలీ అని తెలిసిన తర్వాత మెల్లమెల్లగా కోపం తగ్గిపోవడం మొదలైంది అందుకే అరవింద్ ని మన ఫ్యామిలీ ఫంక్షన్ కి పిలుస్తూ ఉండేవాణ్ణి నిజానికి నేను అలా చేసే వాడిని అయితే నా దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నప్పుడే చేసేవాణ్ణి కానీ ఇలాంటి పరిస్థితులో అంత పెద్ద క్రైమ్ నేను ఎలా చేస్తాను అని గౌతమ్ అంటాడు. నేనే ఈ వార్త విని తట్టుకోలేకపోతున్నాను అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అక్క మాట్లాడు అని మల్లి అంటుంది. నేను ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేను దయచేసి బయటికి వెళ్ళండి ప్లీజ్ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights
Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights

గౌతమ్ మల్లి మాలిని దగ్గర నుంచి బయటికి వచ్చేసి వెళ్ళిపోతారు.నువ్వు ఏం చెప్పినా నా కూతురు నమ్మేస్తుంది కదా ఏం చెప్పావ్ ఏంటి అని వసుంధర అంటుంది.ఉన్నది ఉన్నట్టు చెప్పాను అని మల్లి అంటుంది. నీ మొగుడ్ని కోట్లు చూస్తాను అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తాను అనుకోలేదు అని వసుంధర అంటుంది. మల్లి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని శరత్ అంటాడు. కట్ చేస్తే, ఏవండీ  మాలిని అక్కకు మనం ఏదైనా చేయాలి పోలీస్ కేసు పెట్టి అరవింద్ బాబు గారిని ఎవరు చంపారో తెలుసుకుందాం అని మల్లి అంటుంది. మనం ఇన్ని రోజులు పర్సనల్ జీవితాన్ని డిస్టర్బ్ అయ్యాము ఇప్పుడు మల్లి అదే పరిస్థితిలో వాళ్లని చూసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా మన మధ్య దూరం పెరిగిపోతాయి అని గౌతమ్ అంటాడు. అలాగంటే ఎలాగండి మన వాళ్ళ కోసం నాలుగు మాటలు పడ్డా ఏం కాదు అరవింద్ బాబు గారిని ఎవరు చంపారో కచ్చితంగా నేను తెలుసుకుంటాను అప్పుడే మీ మీద ఉన్న అనుమానం పోతుంది అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights
Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights

కట్ చేస్తే, కడుపులో పాపకి ఏం కాలేదని చెప్పారు మాలిని యాక్టివ్ గా ఉందని డాక్టర్లు చెప్పారు నువ్వు సంతోషంగా ఉండు మాలిని అని వసుంధర అంటుంది. అరవింద్ పోయి 24 గంటలు అవ్వట్లేదు మామ్ ఎలా  సంతోషంగా ఉండగాలను దేవుడు నాతో ఆటలాడుతున్నాడు నాన్న అని మాలిని ఏడుస్తుంది. మాలిని ఊరుకోమ్మా ఊరుకో అని వసుంధర ధైర్యం చెబుతుంది.కట్ చేస్తే,గౌతమ్ మల్లి ఇంటికి వస్తారు. యువరాణి యువరాజు పుష్పక విమానం తిరగడం అయిపోయిందా అని నీలిమ అంటుంది. మల్లి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరు చాలా సంతోషంగా వెళ్లారు కదా ఎందుకిలా బాధపడుతూ వచ్చారు అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights
Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights

దీనితో బయటికి వెళ్లేటప్పుడు అనుకున్నాను గౌతమ్ ఏదో జరిగి ఇంటికి వస్తారని అని కౌసల్య అంటుంది. అన్నయ్య నువ్వైనా చెప్పు అని నీలిమ అంటుంది. అరవింద్  అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు అరవింద్ ని నిన్న నైట్ గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు అంట అని గౌతమ్ చెబుతాడు. ఆ వార్త వినగానే మాలిని కళ్ళు తిరిగి కింద పడిపోయింది హాస్పటల్కి వెళ్లి మేం ఇద్దరం చూసేస్తున్నాం. ఆ వార్త వినక నుంచి మల్లి కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది ఆ బాధని తట్టుకోలేక పోతుంది అని గౌతమ్ అంటాడు.అరవింద్ అన్నయ్య ప్రాణం తీసే అంత శత్రుత్వం ఎవరికుంటుంది అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights
Malli Nindu Jabili Today Episode January 27 2024 Episode 557 Highlights

అరవింద్ బాబు గారిని చంపింది  మా ఆయనే అని వసుంధర అమ్మగారు నా భర్తను అనుమానిస్తున్నారు ఇంతకుముందు అరవింద్ బాబు గారి మీద నా భర్తకు చాలా కోపం ఉండొచ్చు కానీ ఇప్పుడైతే నాకు నంత కోపం కూడా ఆయనకు లేదు నేను తిట్టినంత కూడా అరవింద్ సార్  తిట్టలేదు వసుంధర అమ్మగారు అనవసరంగా నిందని నా భర్త మీద వేస్తున్నారు అని మల్లి బాధపడుతుంది. వసుంధర అత్త ఏదో కోపంలో న్నంత మాత్రాన నేను నేరం చేసినట్టు అవుతుందా ఏంటి అని గౌతమ్ అంటాడు. ఈరోజు చాలా సంతోషంతో గుడికి బయలుదేరాను కానీ నా మీద నింద పడింది అని గౌతమ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. మల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella