NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 23 2024 Episode 605: అరవింద్ ని హాస్పిటల్ కి తీసుకొస్తున్నా నర్స్, మల్లికి సప్రైజ్ ఇచ్చిన గౌతమ్..

Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605   highlights

Malli Nindu Jabili March 23 2024 Episode 605:  మల్లి ఇంకెప్పుడైనా తీసుకువెళ్తానులే ఏం దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదండి మీతో ఒక విషయం మాట్లాడాలి  అని మల్లి అంటుంది. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి మల్లి బయటికి అని తీసుకు వెళ్తూ ఉండగా నీలిమా వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అని అడుగుతుంది నీలిమ. నేను వదిన బయటికి వెళ్తునామ్ అమ్మకి చెప్పు తలుపులు వేసుకొని పడుకోండి అని గౌతమ్ వెళ్తూ ఉండగా నీలిమా నిజం చెప్పకు అని దండం పెడుతుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉండగా నీలిమా బయటికి వస్తుంది. ఏమైంది నీలిమ ఒంట్లో బాలేదా జ్వరం వచ్చిందా ఎందుకలా ఉన్నావ్ అని గౌతమ్ అంటాడు. నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని నీలిమా అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605   highlights
Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605 highlights

సరే వెళ్లి పడుకో అని గౌతమ్ మల్లి ని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ ఒక మొక్కజొన్నపొత్తుకొని ఇచ్చి ఒకచోట కూర్చొని మల్లి గౌతమ్ తింటూ ఉంటారు. ఇప్పుడు చెప్పు మల్లి నాతో ఏదో మాట్లాడాలన్నావ్ అని గౌతమ్ అంటాడు. మీరేదో మాట్లాడాలన్నారుగా అదేంటో చెప్పండి అని మల్లి అంటుంది. ఏమి లేదు మల్లి నీ మీద రోజు రోజుకి ప్రేమ నాకు పెరిగిపోతుంది నువ్వు నాకు ఈమధ్య చాలా నచ్చేస్తున్నావ్ ఎందుకంటే పిల్లల విషయంలో నువ్వు ఒప్పుకున్నావు కదా  నువ్వు ఎప్పుడు తల్లివి అయితావ్ అని ఎదురు చూస్తూ ఉన్నాను అని గౌతమ్ అంటాడు. నన్ను క్షమించండి మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని మల్లి బాధపడుతుంది. మల్లి నన్ను మోసం చేస్తున్నానని బాధపడుతున్నావ్ కదా ని గౌతమ్ మనసులో అనుకుంటాడు. మల్లి ఏదో చెప్పాలన్న ఏంటో చెప్పు అని గౌతమ్ అంటాడు. మీ మీడియాలో మూటలు కూడా మోసే పని చేస్తారా అని మల్లి అడుగుతుంది. మల్లి నువ్వేం మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావట్లేదు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605   highlights
Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605 highlights

రైస్ మిల్లులో మీరు మూటలు మోయడం నేను చూశానండి ఎంతో తెలివి చదువు ఉన్న మీరు అలాంటి పని చేయడం ఏంటండీ నాకు చాలా బాధగా ఉంది అని మల్లి బాధపడుతుంది. ఏం చేయను మల్లి వసుంధర అత్త నేను ఎక్కడికి వెళ్లినా జాబ్ దొరకనివ్వలేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పని చేసి మిమ్మల్ని పోషించుకోవలసి వస్తుంది అని గౌతమ్ అంటాడు. ఇదంతా నన్ను మీరు పెళ్లి చేసుకోవడం వల్లే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది నన్ను కొట్టండి అని మల్లి అంటుంది. మల్లి ఈ పరిస్థితికి కారణం నువ్వని కొన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాను అప్పుడు నన్ను నీడలా అట్టే పెట్టుకుని ఉన్నావు ఇప్పుడు నేను నీకు నీడలా ఉంటాను ఆంజనేయుడు గుండె చీలిస్తే సీతారాములు ఉన్నటే  నా గుండెలో ఉన్నది నువ్వే మల్లి అని గౌతమ్ అంటాడు.మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి అని మల్లి గౌతమ్ నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కన్నీళ్లను తుడిచి గౌతమ్ మల్లి నువ్వంటే నాకు ప్రాణం నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నీకోసం ఏమైనా చేస్తాను అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605   highlights
Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605 highlights

ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి మల్లి గారు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ మీరే లక్కీగా కనిపించారు అరవింద్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన వాళ్లు రెండు రోజుల తర్వాత అరవింద్ ని తీసుకొని హాస్పిటల్ కి వస్తున్నారు మీరు అక్కడికి వస్తే వాళ్లను చూడొచ్చు అని నర్స్ చెబుతుంది. అవునా చాలా థాంక్స్ అని మల్లి చెబుతుంది. మల్లి గారు ఈ విషయం ఎవరికీ చెప్పకండి ఎందుకంటే మొన్న సీసీటీవీ ఫుటేజీ కనిపించకుండా పోవడానికి మీకు తెలిసిన వాళ్ళే చేసుంటారు అరవింద్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో ఆలోచించండి ఈ విషయం ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఆయన్ని ఏమైనా చేస్తారు అని నర్స్ వెళ్లిపోతుంది.. నర్సలా చెప్తుంటే గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏవండీ విన్నారు కదా అరవింద్ బాబు బ్రతికున్నాడు ఎల్లుండి వస్తున్నాడంట మనం వెళ్లి కలుద్దాం అని మల్లి అంటుంది. కట్ చేస్తే,, వసుంధర పెళ్లిల పేరయ్యకి ఫోన్ చేసి రేపు పెళ్లి వాళ్ళని గుడికి తీసుకురమ్మని చెబుతుంది. వసుంధర మాలినకి ఒకసారి ఈ విషయం చెబితే బాగుంటుంది అని శరత్ అంటాడు. నా కూతురికి ఎప్పుడు ఏ విషయం చెప్పాలో నాకు తెలుసు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605   highlights
Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605 highlights

వసుంధర వాళ్లు వచ్చాక ఈ నిజం మాలినికి తెలిస్తే నిన్ను అసహ్యించుకుంటుంది అని శరత్ అంటాడు. నన్ను అసహ్యించుకోదు నా తల్లి నా గురించి బాగా ఆలోచిస్తుంది అనుకుంటుంది కానీ,ఒక విషయం రేపు మాలినీకి పెళ్లిచూపులు అది ఇక్కడ కాదు గుడిలో జరుగుతున్నాయి అదికూడా మాలినికి తెలియకుండా వాళ్ళు చూసి వెళ్ళిపోతారు  ఒకవేళ మాలిని వాళ్లకి నచ్చితే అప్పుడు మాలినికి చెప్తాను అంతకంటే ముందు మాలినీకి చెబితే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అని వసుంధర అంటుంది. శరత్ ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మల్లి నర్సి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని సంతోషిస్తుంది. ఇంతలో గౌతమ్ వెనుక నుంచి వచ్చి మల్లి నీ హగ్ చేసుకుని ఏం ఆలోచిస్తున్నావ్ మల్లి అని అంటాడు  అరవింద్ బాబు    గారుని మనం ఎల్లుండి చూస్తామండి అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605   highlights
Malli Nindu Jabili Today Episode March 23 2024 Episode 605 highlights

ఎలాగూ హాస్పిటల్ కి వెళ్తాం కదా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని గౌతమ్ మల్లి ని ఎత్తుకొని టెర్రరిస్ట్ పైకి తీసుకువెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి అని మల్లి అంటుంది. సర్ప్రైజ్ మేడం అని గౌతమ్ పైకి తీసుకువెళ్లి చూడు మల్లి నీ చీరలతో మనకు ఏర్పాటు చేసిన స్పెషల్ గది అని అంటాడు. అది చూసి మల్లి సంతోష పడిపోయి అందులోకి పరిగెత్తుకెళ్తుంది. గౌతమ్ అక్కడికి వెళ్లి మల్లి ని హగ్ చేసుకుంటాడు. మల్లి గౌతమ్ ని నెట్టేసి పారిపోతుంది.పారిపోతున్న మల్లి ని పట్టుకొని ఎత్తుకొని  పరుపు మీద కూర్చో బెట్టి పైకి చూడు మల్లి చందమామ ఎంత అందంగా ఉంది అని అంటాడు. మల్లి చందమామను చూస్తుంది. గౌతమ్ మల్లి వంక ప్రేమగ చూస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri