NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 30 2024 Episode 611: పెళ్లి చేసుకో పోతే చచ్చిపోతాను అంటున్న వసుంధర, జీవితంలో నీ మొహం చూపించొద్దు అంటున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights

Malli Nindu Jabili March 30 2024 Episode 611: తన భర్తని రక్షించుకోవడం కోసం నా భర్త బ్రతికే ఉన్నాడని చెప్తుంది అని మాలిని బాధపడుతుంది. కట్ చేస్తే, కోటేశ్వరరావు రైస్ మిల్లులో కూలీలకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. గౌతమ్ కి కూలి డబ్బులు ఇచ్చి గౌతమ్ రేపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని చెబుతాడు. ఎందుకు సార్ అని గౌతమ్ అడిగితే నా కొడుకుని ప్రేమించిన ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలయ్యా అని కోటేశ్వరరావు అంటాడు. సార్ పర్సనల్ విషయంలో నన్ను లాగకండి నేను రాను అని గౌతమ్ అంటాడు. అదేంటయ్యా అలా అంటావ్ ఆ మధ్య తరగతి అమ్మాయి నా కొడుకుని పెళ్లి చేసుకోకూడదు నువ్వొచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ వదిన మీద అమ్మాయి మీద కేసు పెడతాను అని కోటేశ్వరరావు అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights
Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights

ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది తన పేరేంటి సార్ అని గౌతమ్ అడుగుతాడు. ఆ అమ్మాయి పేరు ఏదో ఉందయ్యా అంటూ ఉండగా కోటేశ్వరరావు కి ఫోన్ రావడంతో రేపు మాట్లాడుకుందాం వెళ్ళు అని అంటాడు. కట్ చేస్తే, మాలిని మళ్ళు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వసుంధర వచ్చి మాలిని ఇంకా నిద్ర పోలేదా అని అడుగుతుంది. నిద్ర పట్టడం లేదు మామ్ అని మాలిని అంటుంది. అరవింద్ జ్ఞాపకాలతో నీకు నిద్ర పట్టడం లేదు అరవింద్ ను మర్చిపోయి మరో వ్యక్తిని నీ జీవితం లోకి ఆహ్వానించు అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు అని వసుంధర అంటుంది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ మామ్ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights
Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights

ఈ లోకంలో బిడ్డ గురించి తల్లి తప్ప ఎవ్వరు గొప్పగా ఆలోచించరు నువ్విలా బాధపడుతూ కృంగిపోతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను నువ్వు గనక పెళ్లి ఒప్పుకోకపోతే నేను ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను అని వసుంధర అంటుంది. ఏంటి మామ్ ఆ పిచ్చి మాటలు అని మాలిని అంటుంది. నువ్వు ఏదో ఒక డిసిషన్ తీసుకోకపోతే జరిగేది అదే బేబీ అంటూ వసుంధర వెళ్ళిపోతుంది.అరవింద్ నువ్వు పోయాక అందరి బాధలకి నేనే కారణం అవుతున్నాను. నువ్వు బ్రతికున్నావా చచ్చిపోయావా రెండిట్లో ఏది నిజమో తెలియక మదన పడుతున్నాను అని మాలిని బాధపడుతుంది. మాలిని మల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకునే హాస్పిటల్ కి బయలుదేరుతుంది. మల్లి ఈరోజు నువ్వు గనక హాస్పిటల్ లో అరవింద్ ను చూపించకపోతే జీవితంలో నీ మాట నమ్మను అని మాలిని అనుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights
Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights

ఈ బాబు మనకు దొరికి రెండు నెలలకు పైన అవుతుంది ఇతనికి సంబంధించిన మనుషులు ఎవరో కూడా మనకు తెలియట్లేదు నరసమ్మ ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరో హాస్పిటల్కి వస్తారని చెప్పింది కదా వాళ్ళు రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని వాళ్ళ ఆవిడ అంటుంది. అలాగే ఇద్దాం లేకపోతే మనం ఇబ్బందుల్లో పడతాం అని వాళ్ళ ఆయన అంటాడు.కట్ చేస్తే, మల్లి ఇంకా హాస్పిటల్ కి బయలుదేరిందా లేదా అని గౌతమ్ ఎదురుచూస్తూ ఉంటాడు. మల్లి వచ్చి ఏమండీ నాకు బయట పని ఉంది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంది. ఏ మల్లి ఎక్కడికి వెళ్తున్నావ్ అని కౌసల్య అడిగితే ఆయనకి చెప్పాను అత్తయ్య అంటూ మల్లి వెళ్ళిపోతుంది. ఇలా భార్యని నెత్తికెక్కించుకోకురా అర్ధరాత్రి  ఎక్కడికి తోలుతున్నావ్ అని కౌసల్య అడుగుతుంది. నాకు బయట పని ఉందమ్మా వెళ్ళొస్తాను అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మల్లి  మాలిని కి ఫోన్ చేసి బయలుదేరావా కానీ అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights
Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights

వస్తున్నాను మల్లి ఈరోజు నువ్వు చెప్పింది అబద్ధం అయితే జీవితంలో నీ మొహం నాకు చూపించకు అని మాలిని అంటుంది. నేను చెప్పింది నిజమే అయితే జీవితంలో ఈ చెల్లిని ఎప్పుడు దూరం పెట్టకు అని మల్లి అంటుంది. మల్లి నర్స్ కి ఫోన్ చేసి అరవింద్ బాబు ని తీసుకొచ్చారా అని అడుగుతుంది. వస్తున్నారంట మీరు త్వరగా రండి మేడం అని నర్స్ చెబుతుంది. గౌతమ్ కి తెలిసిన సిస్టర్ ఆ నర్స్ ని ఫాలో అవుతుంది.కట్ చేస్తే, అరవింద్ వచ్చే అంబులెన్స్ మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు బండి రెడీ అవ్వదు వేరే వెహికల్ చూసుకోండి అని అంబులెన్స్ డ్రైవర్ చెబుతాడు.వాళ్ళిద్దరూ రోడ్డు మీద వచ్చే పోయే కార్ ని ఆపుతూ బాబుఆపండి ఒక బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు సహాయం చేయండి అని  కారు ఆపుతారు.

Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights
Malli Nindu Jabili Today Episode March 30 2024 Episode 611 highlights

మాలిని కారు దిగి వచ్చి నాకు అర్జెంట్ పని ఉంది నేను హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెబుతుంది. అమ్మ లేట్ అయితే అతని ప్రాణాలకు ప్రమాదం అమ్మ అని వాళ్ళు అంటారు. మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి అని మాలిని అడుగుతుంది. సూర్య హాస్పిటల్ కమ్మ అని వాళ్ళు చెప్పడంతో నేను అదే హాస్పిటల్ కి వెళ్తున్నాను అతని కారులో ఎక్కించండి అని మాలిని వెళ్లి కారులో కూర్చుంటుంది. అంబులెన్స్ డ్రైవర్ సహాయంతో వాళ్లు అరవింద్ ని కార్ కూర్చోబెడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri