Malli Nindu Jabili november 10 episode 491: నిలిమ జగదాంబ ఇద్దరూ డాన్స్ చేస్తారు. అన్నయ్య నువ్వు వదినకి లవ్ ప్రపోజ్ చేయాలి అని నీలిమ అంటుంది. చెప్పడానికి మాటలు సరిపోవు రాయడానికి సమయం సరిపోదు 24 గంటల్లో ప్రతి సెకండ్ నీ గురించి ఆలోచిస్తాను ఏ సెకండ్ మర్చిపోయిన నేను చాలా కోల్పోతాను ప్రేమించడానికి గంట చాలు మర్చిపోవడానికి జీవితం సరిపోదు ఎందుకు అంటే నేను నేను అర్థం చేసుకోవడం ప్రేమించడం ఒకటే కాదు నీకు అర్థమయ్యేలా ఉండడం నీతో ప్రేమించబడడం నాకు తెలుసు నీ నేనంటే నీకు ఎంత ఇష్టమో ఐ లవ్ యు మల్లి అని గౌతమ్ అంటాడు. అక్క మల్లి చీరకు నిప్పు పెట్టడానికి అదిగో రౌడీని పిలిచాను వచ్చాడు చూడు అని యాదగిరి అంటాడు. వాళ్ళిద్దరూ అలా డాన్స్ వేస్తూ ఉంటారు. అలా మల్లి డాన్స్ చేస్తూ ఉండగా ఆ రౌడీ చాటుగా వచ్చి మల్లి కొంగుకి నిప్పు పెడతాడు. గౌతమ్ బకెట్లలో నీళ్లు తెచ్చి ఆ కొంగు బకెట్లో వేస్తాడు నిప్పు చల్లారిపోతుంది. మల్లి నీకేం కాలేదు కదా అమ్మ అసలు నిప్పు ఎలా అంటుకుంది అని జగదాంబ అంటుంది.

ఆ రౌడిని చూసిన గౌతమ్ అతని వెనకాల పరిగెత్తుకెళ్ళి అతని పట్టుకుంటాడు. అతన్ని అందరి ముందుకు లాక్కొచ్చి గౌతమ్ నా మల్లిని ఎందుకు చంపాలి అనుకున్నవు రా చెప్పు అని కొడుతూ ఉంటాడు. ఏవండీ అతని వదిలేయండి అని మల్లి అంటుంది. మల్లి అంటే నాకు ప్రాణం నా ప్రాణాన్నే చంపేద్దామనుకుంటావా ఎవడు రా నువ్వు అని గౌతమ్ అతని చితకబాతాడు. ఆ రౌడీ గౌతమ్ చేతిలో నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఈ ఊర్లో మల్లి మీద ఇలాంటి ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు అని శరత్ అంటాడు.మల్లి కి ఎవరైనా పడని వాళ్ళు ఉన్నారా అని అరవింద్ అడుగుతాడు. నా మల్లికి ఇక్కడ పడని వాళ్ళు అంటూ ఎవరూ లేరు బాబు గారు అని మీరా అంటుంది. మల్లి కళ్ళు తిరిగి గౌతమ్ మీద పడిపోతుంది. గౌతమ్ మల్లి ని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోతాడు.

మల్లి ప్రాణం పోతుంది అనుకున్నా దాని అదృష్టం బాగుండి బతికి బయటపడింది అని వనజాక్షి తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే మల్లి కి స్పృహ వస్తుంది. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఏం టెన్షన్ పడకు మల్లి అంత నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు. ఇంతలో మీరా వచ్చి నా బిడ్డకు ఈ ఊర్లో అన్యాయం చేసె వాళ్ళు ఎవరా అని ఆలోచించి నా బుర్ర పాడైపోతుంది బాబు గారు అని మీరా అంటుంది. ఆ విషయం నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి అని గౌతమ్ అంటాడు. వాళ్ల వల్ల మల్లి కి ఎప్పటికైనా ప్రమాదమే కదా బాబు గారు అని మీరా అంటుంది. మల్లి కి రక్షణ కవచంలా నేను ఉంటాను మీరు ఆ విషయం గురించి మర్చిపోండి అని గౌతమ్ అంటాడు. మీరా గారు మల్లి కి అన్నం తినిపిస్తానని అంటుంది. నేను తినిపిస్తాను అత్తయ్య గారు మీరు వెళ్ళండి అని గౌతమ్ మల్లి కి అన్నం తిని పెడతాడు.

ఆడపిల్లకి తాళిబంధంతో భర్త మాత్రమే దొరుకుతాడు కానీ నా మల్లికి అమ్మ నాన్న ప్రేమ దొరికింది మంచి స్నేహితుడు దొరికాడు ఆత్మబంధువు దొరికాడు ఒక్క మనిషిలో అన్ని బంధాలు దొరికాయి అందుకే అల్లుడు రూపంలో ఉన్న ఈ దేవుడికి ఒక భక్తురాలినిగా దండం పెట్టుకుంటున్నాను అని మిరా అంటుంది. అత్తయ్య నన్ను దేవుడిగా పోల్చి దండం పెట్టింది అంటే ఇదంతా ఈ దేవత వల్లనే అని గౌతమ్ ప్రేమగా మల్లి కి అన్నం తినిపిస్తాడు. ఒక మగాడు భార్యని ఇంతగా ప్రేమించబడడం నా అదృష్టం పాలకుడలాంటి ఈ ప్రేమలో నా గతం ఒక విషపు చుక్కలా ఉంది,పాము కాటేసిన ప్రేమగా విషయాన్ని తీయగలిగే అంత ప్రేమ కలిగిన వాడు నా భర్తనా గతం గురించి నా భర్తకు చెప్పేస్తే చెప్పేస్తాను ఇంకా ఈ నిజాన్ని దాచలేను అని మల్లి ఆలోచిస్తుంది. ఏంటి మల్లి ఏదో ఆలోచిస్తున్నావు అని గౌతమ్ అడుగుతాడు. చెప్తే నన్ను అర్థం చేసుకుంటారు రోజు బాధని అనుభవించే కంటే నేను తీసుకున్న నిర్ణయం మంచిది అని మల్లి అనుకుంటుంది.

చెప్పు మల్లి మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు నిన్ను నేను అర్థం చేసుకోగలను నేను అంతగా ప్రేమిస్తున్నాను అందుకనే నువ్వు నా ముందు ఏ విషయమైనా భయపడకుండా చెప్పుకోవచ్చు అని గౌతమ్ అంటాడు. మనకు పెళ్లికాకముందు అని మల్లి చెప్పబోతుండగా గౌతమ్ కి లాయర్ ఫోన్ చేసి గుడ్ న్యూస్ సార్ మనం కేసు గెలిచాము ఆ వ్యక్తికి శిక్ష పడింది అని అంటాడు. మోసం చేసేది ఆడైనా మగ అయినా అలాంటి వాళ్లకు వెన్నుల్లో వణుకు పుట్టాలి నమ్మిన వాళ్లని ఎలాగైనా మోసం చేయొచ్చు అని అనుకునే వాళ్లకు భయం పుట్టాలి నేను హైదరాబాద్ వచ్చాక నిన్ను కలుస్తాను ఆ అమ్మాయికి నా కంపెనీలో జాబ్ ఇచ్చి అమ్మాయి లైఫ్ సెటిల్ చేస్తాను అని గౌతమ్ అంటాడు. గౌతమ్ మాటలు విన్న మల్లి భయపడిపోతుంది.

ఏంటి మల్లి ఇందాక ఏదో చెప్పాలనుకున్నావు మన పెళ్లికి ముందు అని అన్నావు ఏంటి అని గౌతమ్ అంటాడు. అంటే పెళ్లికి ముందు నేను చదువుకున్నాను కదా ఇప్పుడు మల్లి చదువుకోవాలి అనుకుంటున్నాను అని మల్లి అబద్ధం చెప్తుంది. జాబ్ చేస్తూ చదువుకో లేదంటే జాబ్ మానేసైనా చదువుకో ఈ విషయం చెప్పడానికైనా పెద్ద రహస్యం చెబుతున్నట్టు బిల్డప్ ఇచ్చావు నీ చదువు విషయంలో నీకు పర్మిషన్ ఇచ్చాను అని గౌతమ్ అంటాడు. థాంక్స్ అండి అని మల్లి అంటుంది. చూడు మల్లి నీ విషయంలో చివరి శ్వాస వరకు ఏదైనా చేస్తాను అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది