Malli Nindu Jabili November 11 episode 492: మల్లి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని గౌతమ్ వెళ్ళిపోతాడు. ఈయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు నిజం తెలిసిన నాడు కచ్చితంగా నా చావే ఉంటుంది అని మల్లి భయపడుతుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది గౌతమ్ బయట కూర్చుంటాడు. ఏమండీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని మల్లి అడుగుతుంది. ఏమీ లేదు మల్లి కొంచెం బాడీపెయిన్స్ ఉంది వాటర్ చేంజ్ అయ్యాయి కదా కొంచెం జలుబు కూడా అయినట్టుంది తలనొప్పిగా ఉంది అని గౌతమ్ అంటాడు. అవునా అయితే నేను మీకు ఈ రోజు తల స్నానం చేయిస్తాను అని మల్లి అంటుంది. నేనేమన్నా చిన్న పిల్లవడిన నాకు స్నానం చేపిస్తాను అంటావేంటి అని గౌతమ్ అంటాడు. మరి మీరు నాకెందుకు అన్నం తిన పెడుతున్నారు కాళ్లకు పట్టీలు పెడుతున్నారు నేనేమన్నా చిన్నపిల్లనా అని మల్లి అంటుంది.

అది వేరు మల్లి నీ మీద నాకున్న ప్రేమ అలా తెలియజేస్తున్నాను అని గౌతమ్ అంటాడు. ఇంకా మీరే మాట్లాడకండి నేను తల స్నానం పోస్తే మీ బాడీపెయిన్స్ తలనొప్పి చిటికెలో మాయమైపోతాయి అని మల్లి అంటుంది. మల్లి ఏం చేస్తున్నావు అని గౌతమ్ అంటాడు. ఈ ఆకులన్నీ తెంపి నీళ్లలో వేసి మరగబెట్టి స్నానం చేస్తే బాడీపెయిన్స్ అన్ని పోయి తలనొప్పి కూడా పోతుందండి ఇది మా ఊర్లో ఆయుర్వేదిక్ మా జబ్బులు అన్నిటికీ ఇదే మందు అని అంటుంది మల్లి. అవునా అని గౌతమ్ అంటాడు. రండి ఇలా వచ్చి కూర్చోండి స్నానం పోస్తాను అని మల్లి గౌతమ్ కి స్నానం పోస్తుంది. అలా స్నానం చేపిస్తూ చెంబులో నీళ్లు తీసుకుని తల మీద పోయబోతూ ఉండగా జారీ గౌతమ్ వల్లో పడుతుంది. గౌతమ్ మల్లి ని తన చేతులతో కింద పడకుండా పట్టుకుని అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. టవ్వల తెస్తాను ఉండండి అని మల్లి వెళ్ళిపోతూ ఉంటే తన కొంగు పట్టుకుని దగ్గరికి లాగుతాడు. అబ్బా వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అని మల్లి అంటుంది.

ఆల్రెడీ పంచభూతాలు చూసేసాయి ఇంకా ఎవరు చూస్తే మనకేంటి మల్లి అని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ నువ్వే నా ప్రాణం నువ్వే నా ఊపిరి నువ్వే నా శ్వాస నువ్వే నా నడకలా అయిపోయావు మల్లి నువ్వే నేను గా మారిపోయే అంతగా ఆకర్షించేశావు అని గౌతమ్ అంటాడు.అబ్బ వదలండి నేను టవల్ తెస్తాను జలుబు చేస్తుంది అని మల్లి అంటుంది. ఇందాక నాకు నువ్వు స్నానం పోసావు కదా ఇప్పుడు నేను నీకు పోస్తాను అంటూ చెంబు తీసుకొని మల్లి నీ గట్టిగా పట్టుకొని ఇద్దరి తలల మీద పడేలా పోస్తాడు నీళ్లు. అలా కొద్దిసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మైమరిచిపోతూ ఉంటారు. అలా ఇద్దరు కలిసి స్నానం చేశాక గౌతమ్ టవల్ తెచ్చి మల్లి ఒళ్లంతా తుడిచి నువ్వు చీర కట్టుకొని రా నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ ఇది నేలకొండపల్లి ఊరు అంటూ వీడియో తీసి చూపెడుతుంది నీలిమ. ఇంతలో కౌసల్య వచ్చి అన్నయ్య వదిన ఎక్కడున్నారమ్మ మనం తొందరగా మన ఊరికి బయలుదేరాలి అని అంటుంది.

ఇప్పుడే బయటికి వెళ్దామని రెడీ అవుతున్నారు అని నిలిమా చెప్తుంది. ఇంతలో అందరూ హాల్లోకి వచ్చేస్తారు. అమ్మ ఎప్పుడొచ్చావు అమ్మ మూడు రోజులు పడుతుందన్నావు కదా అని గౌతమ్ అంటాడు. అనుకున్నాను కానీ శివపార్వతుల కళ్యాణం చేయాలి కదా గౌతమ్ మనం వెంటనే మన ఊరు బయలుదేరాలి అని కౌసల్య అంటుంది. అదేంటమ్మా ఇంకా నాలుగు రోజులు ఉందామనుకుంటే అప్పుడే వెళ్దాం అంటావేంటి అని గౌతమ్ అంటాడు. నాలుగు రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్దాం నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అని వనజాక్షి అంటుంది. చూడు గౌతమ్ మనం ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళిపోతే బెటర్ ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అని మాలిని అంటుంది.

అనర్ధాలు అంటున్నావు ఏం జరిగిందమ్మా అని కౌసల్య అంటుంది. బాగున్నావా వదిన అని వనజాక్షి కౌసల్యని అడుగుతుంది. బాగానే ఉన్నాను నువ్వు వసుంధర చెల్లెలివి కదా పోల్చుకోలేకపోతున్నాను అని కౌసల్య అంటుంది. అవును వదిన నేనే వరంగల్ వనజాక్షిని చాలా రోజులైతుంది కదా మనం కలవక అందుకే గుర్తుపట్టలేదు అని వనజాక్షి అంటుంది. నిప్పు ఉన్నచోట నువ్వు మీ అక్క ఉన్నచోట ఉండడం అంత మంచిది కాదు గౌతమ్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని కౌసల్య అంటుంది. నిప్పు అనగానే గుర్తొచ్చింది నైట్ మీ కోడలు చీరకు ని పండుకుంది అని వనజాక్షి చెప్తుంది. అవునమ్మ గారు దేవుడి దయవల్ల బ్రతికి బయటపడింది కానీ లేదంటే ఏం జరిగిందో ఏమో అని మీరా అంటుంది. గౌతమ్ మల్లి కి హాని తల పెట్టాలనుకున్న వాడు ఎవడైనా సరే వదిలిపెట్టకు వాడికి శిక్ష పడేలా చెయ్యి అని కౌసల్య అంటుంది. దాని గురించి నువ్వేం వర్రీ అవ్వదు అమ్మ నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు.

మనం ఇక్కడే ఉంటే బాగోదు గౌతమ్ శివపార్వతుల కళ్యాణం జరిపించాలి వెళ్దాం అని కౌసల్య ఉంటుంది.అవును గౌతమ్ మనం వచ్చిన పని అయిపోయింది కదా ఇంక వెళ్ళిపోవే మంచిది అని అరవింద్ అంటాడు.నేను మా అత్తగారి ఇంటికి నాలుగు రోజులు ఉందామని వచ్చాను అప్పుడే వెళ్ళిపోతాను అంటే ఎలా అని గౌతమ్ అంటాడు. చూడు గౌతమ్ ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చి ఉండుగానే ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాం నాన్న మొక్కు మొక్కుకున్నప్పుడు తీర్చాలి కదరా లేదంటే ఏదైనా ప్రమాదం జరగొచ్చు అని కౌసల్య అంటుంది.
దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
కమల్‌హాసన్ గొప్ప విశ్వవిద్యాలయం.. ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం