malli nindu jabili november 15 2023 episode 494: గుడి కమిటీ వాళ్లు మల్లి కి గౌతమ్ కి పసుపు కుంకుమ కొత్త వస్త్రములు ఇచ్చి ఇక మేము బయలుదేరుతామండి అని వెళ్ళిపోతారు. మల్లి నువ్వు పుట్టిన ఊళ్లో బడి కట్టిస్తున్నావు అని సంతోషం నీకు మిగలకుండా ఇక్కడ జరిగిన సంఘటన నీలో బాధని నింపింది దీనికి ఎక్కడో అక్కడ సమాధానం దొరుకుతుంది లే అని గౌతమ్ అంటాడు. ఇక మనం బయలుదేరుదాం సమయం మించిపోతుంది అని కౌసల్య అంటుంది. వనజాక్షి వెళ్ళిపోతూ మీరా వంక చూస్తూ మీరా నా అక్క స్థానంలో నువ్వు ఎట్లుంటవ్ అది చూస్తా అనుకుంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వనజాక్షి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఏంది అక్క ఇలా చేశావు నా ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది. ఎన్ని రోజులైనా ఈ వరంగల్లో ఉంటాను అందుకే నా ఇంటికి నేను వచ్చేసాను ఎక్స్ప్రెస్ డేట్ అయిపోయిన టాబ్లెట్ చావడానికి ఉపయోగపడుతుంది కానీ బ్రతకడానికి కాదు అలాగే నేను కూడా కాకూడదని నా ఇంటికి వచ్చేసాను అంతమాత్రాన నేను అవమానించి వచ్చినట్టు కాదు చెల్లి నువ్వేం బాధపడకు అని వసుంధర అంటుంది.

నీకు చెప్పే అంత దాని కాదు గాని అక్క నేలకొండపల్లిలో ఏం జరిగిందో అంత పూస ఊచ్చినట్టు చెప్తా విను అని, మల్లి స్కూల్ కట్టించే కాడ అవమానం చేయబోయాను కానీ తప్పించుకుంది ఎంజాయ్ చేసే కాడ చీరకు నిప్పు పెట్టాను కానీ అక్కడ తప్పించుకుంది గా మీరా పసుపు కుంకుమ తీసుకుందామని అనుకుంటే లొల్లి లొల్లి చేసిన ఇంకో నాలుగు దినాలు అక్కడ ఉంటే వాళ్ల సంగతేందో చూసె దాన్ని అక్క కానీ వాళ్ళ టైం బాగుండి తొందరగా హైదరాబాద్ కి రావాల్సి వస్తుంది ఆ గౌతమ్ ని చూస్తుంటే చాలా ముదురు అనిపిస్తున్నాడు అక్క రేపు శివపార్వతుల కల్యాణంలో భావచేత మీరా కి తాళి కట్టించిన మనం చేసేది ఏమీ లేదక్కా కానీ వాని ఏదో ఒకటి చేయాలి అక్క అని వనజాక్షి అంటుంది. సరే నేను చూసుకుంటాను అని వసుంధర ఫోన్ కట్ చేస్తుంది. అంటే గౌతమ్ శివపార్వతుల వేదికని తనకు అనుకూలంగా మార్చుకుంటే నేను తర్వాత చేసేది ఏమీ లేదు నా కుటుంబం జోలికి వస్తే వాడికి వణుకు పుట్టేలా చేయాలి అని వసుంధర అనుకుంటుంది. ఇంతలో తెల్లవారింది మాలిని అరవింద్ ఇంటికి వస్తారు.

అమ్మ నువ్వు ఇంటికి వచ్చావాని పిన్ని ఫోన్ చేసి చెప్పింది నేను తొందరగా ఇంటికి వచ్చేసాను చాలా నిన్ను మిస్ అయ్యాను అమ్మ ని మాలిని అంటుంది. అత్తయ్య మీ హెల్త్ ఎలా ఉంది అని అరవింద్ అడుగుతాడు. నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ మనసే బాగోలేదు అని వసుంధర అంటుంది. అత్తయ్య మీరు ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుంది అని అరవింద్ అంటాడు. నాకు అడ్డొస్తున్న వాళ్లందర్నీ షూట్ చేశాక అలాగే చేస్తాను అని వసుంధర అంటుంది. అది సరే మీ నాన్న ఎక్కడ అని మాలినిని వసుంధర అడుగుతుంది. ఆ ఇంటికి వెళ్ళాడు రేపు శివపార్వతుల కళ్యాణం ఉంది కదా అది అయిపోయాక వస్తాడు అని అరవింద్ అంటాడు. కళ్యాణం అయిపోయాక గౌతమ్ పంపిస్తాడని నమ్మకం ఏంటి గౌతమ్ ని నమ్మలేము అని వసుంధర అంటుంది. గతాన్ని తలుచుకొని బాధపడడం కన్నా మంచిగా ఆలోచించి కూల్ గా ఉందాం మా మంచి అమ్మ కదా నా మాట వింటుంది స్మైల్ ఇవ్వు అని మాలిని అంటుంది.

అలాగే నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా అని సుందర అంటుంది. హైదరాబాద్ కి వచ్చేసావని తెలిసింది నీ ఆరోగ్యం ఎలా ఉంది వసుంధర అని కౌసల్య అడుగుతుంది. నా ఆరోగ్యం గురించి ఎందుకులే ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని వసుంధర అంటుంది. శివపార్వతుల కళ్యాణానికి పిలుద్దామని ఫోన్ చేశాను వసుంధర అని కౌసల్య అంటుంది. ఎవర్ని అవమానించడానికి ఇలా తీయగా పిలుస్తున్నావు నీ కొడుకు ఎప్పుడు ఎక్కడ కలిసి నన్ను అవమానిస్తూనే ఉంటాడు అని వసుంధర అంటుంది. నా కొడుకు తెలిసి ఎప్పుడు ఎవరికీ ద్రోహం చేయడు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్న వసుంధర అని కంసల్య అంటుంది. నా భర్తను తీసుకువెళ్లి మీ ఇంట్లో పెట్టాడు అది ద్రోహం కాదా అని వసుంధర అంటుంది. శరత్ అన్నయ్యకి నువ్వు మీరా ఇద్దరు సమానమే అని నా అభిప్రాయం కూడా అదే వసుంధర అని కౌశల్య అంటుంది. మీ దాకా వస్తే భర్త రాముడిలా ఉండాలి వేరే వాళ్లకైతే ఇద్దరు భార్యలు ఉన్నా పర్వాలేదు ఎవడికి చెపుతారండీ నీతులు అని వసుంధర అంటుంది. నా మాటలు నీకు చెవికెక్కవని నాకు తెలుసు కానీ గుడికైతే రా అని కౌసల్య అంటుంది. ఇంతలో శరత్ వచ్చి ఫోన్ తీసుకొని చానా రోజులైంది వసుంధర ఎలా ఉన్నావు అని అడుగుతాడు.

బ్రతికే ఉన్నాను శరత్ చంద్ర గారు మీరు ఎలా ఉన్నారు కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్లినట్టు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంట కదా మా చెల్లెలు చెప్పింది వెరీ గుడ్ అని వసుంధర అంటుంది. ఈవారం రోజుల్లో నీలో ఏదో మార్పు వచ్చింది అనుకున్నాను కానీ అదే పొగరుతో ఉన్నావు అని శరత్ చంద్ర అంటాడు.నేను నా కూతురు ఎప్పుడు ఒకే లాగా ఉన్నావు మీరే ఊసరవెల్లిలా మారిపోతున్నారు అని వసుంధర అంటుంది. ఇన్ని రోజులు ఏమైందో తెలియదు కానీ శివపార్వతుల కళ్యాణికి రా అక్కడ కళ్యాణం అయిపోగానే అందరం కలిసి ఇంటికి వెళ్దాం అని శరత్ అంటాడు. అందరిలో అ మీరా స్థానం ఏంటో తెలియజేసి నా భర్త నేను తెచ్చుకుంటాను ఇదే మంచి సమయాo అని ఆలోచిస్తుంది వసుంధర. ఏంటి వసుంధర మాట్లాడవేంటి అని శరత్ అడుగుతాడు. సరే తప్పకుండా వస్తాను అని వసుంధర ఫోన్ కట్ చేస్తుంది. వసుంధరలో మార్పు వస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు అన్నయ్య అని కౌసల్య అంటుంది . రేయ్ గౌతమ్ నేను నీకంటే ముందు పుట్టాను రా గుళ్లో రచ్చ రచ్చ చేస్తాను చూడు అని వసుంధర అనుకుంటుంది. కట్ చేస్తే కౌసల్య గౌతమ్ కి ఫోన్ చేసి శివపార్వతుల కళ్యాణానికి కట్టుకోబొయే బట్టలు పంపించాను చూసుకోండి అలాగే అరవింద్ మాలిని కూడా కూర్చోబెడదాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అని కౌసల్య అడుగుతుంది.

అమ్మ నువ్వు ఏది చేసినా అందరి మంచి కోసమే చేస్తావు నీ ఇష్టం అలాగే కానివ్వు కానీ శరత్ అంకుల్ చేత మీరు అత్తయ్యకి తాళి కట్టిద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అని గౌతమ్ అంటాడు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అందరూ ఆనందంగా ఉంటారు గౌతమ్ మల్లి కళ్ళలో ఆనందం మెరిసిపోతుంది అని కౌసల్య ఉంటుంది. తన కళ్ళలో ఆనందం చూడటానికే అమ్మ నేను ఇదంతా చేసేది అనే గౌతమ్ అంటాడు. కట్ చేస్తే వనజ ఆ బట్టల ఆయనని మల్లి మేడం ని లోపలికి రమ్మని చెప్పు అని గౌతమ్ అంటాడు. అలాగే అని వనజ వెళ్లి మల్లి కి చెప్తుంది. ఏంటండీ రమ్మన్నార అంట అని మల్లి అడుగుతుంది. రేపు శివపార్వతుల కళ్యాణానికి కట్టుకోబోయే బట్టలు మీ అత్త పంపించింది సెలెక్ట్ చేసుకో అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది