Malli Nindu Jabili November 15 2023 Episode 495: మల్లి మీ అత్త శివపార్వతుల కళ్యాణానికి బట్టలు సెలెక్ట్ చేసుకోమని పంపించింది అని గౌతమ్ అంటాడు. మల్లి బట్టలు సెలెక్ట్ చేసుకుని ఇవి రెండు సాలండి అని అంటుంది. ఇంతలో అరవింద్ ఆర్టికల్ గురించి మాట్లాడడానికి గౌతమ్ దగ్గరికి వస్తాడు. సార్ ఈ ఆర్టికల్ పూర్తయిపోయింది తీసుకోండి అని ఆ ఫైల్ ఇస్తాడు. అరవింద్ అమ్మ నిన్ను మాలిని శివపార్వతుల కళ్యాణానికి ఆహ్వానించమని చెప్పింది అలాగే మీకోసం బట్టలు కూడా తీసుకోమని చెప్పింది ఇందులో బట్టలు సెలెక్ట్ చేసుకోవా అని గౌతమ్ అంటాడు. ఓకే సార్ అని అరవింద్ బట్టలు సెలెక్ట్ చేసుకుని ఈ రెండు నచ్చాయి సార్ అని అంటాడు. ఇంకేమైనా కావాలా అరవింద్ అని గౌతమ్ అంటాడు. నో థాంక్స్ సార్ అని అరవింద్ వెళ్లిపోతాడు. మల్లి శివపార్వతుల కళ్యాణం లో మామయ్య చేత అత్తయ్యకి తాళి కట్టించబోతున్నాను అని గౌతమ్ చెప్తాడు.

ఇప్పుడు ఉన్న సమస్యల కంటే ఇదే పెద్ద సమస్య అవుతుందని నాకనిపిస్తుందండి అని మల్లి అంటుంది. సమస్యలకు భయపడి యుద్ధ రంగంలోకి దిగకుండా ఉంటామా మల్లి అత్తయ్య మెడలో తాళి లేక ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూశాను అది నీకు కూడా తెలుసు అని గౌతమ్ అంటాడు. అమ్మ మెడలో తాళి కోసం పక్కన తోడు కోసం ఎంతో బాధపడిందండి కానీ వసుంధర అమ్మగారు మాలిని అక్క ఏం చేస్తారో ఏమో అని భయం వేస్తుంది అని మల్లి అంటుంది.వాళ్లు అడ్డు వస్తే నేను ఎదుర్కొంటాను మల్లి అని గౌతమ్ అంటాడు

కట్ చేస్తే, మల్లి శివపార్వతుల కళ్యాణం కోసం తీసుకున్న చీర కట్టుకొని రెడీ అవుతుంది. ఇంతలో గౌతమ్ వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంది మల్లి నువ్వు సెలెక్ట్ చేసింది అని అంటాడు. చాలా బాగుందండి ఈ డ్రెస్ లో మీరు అందంగా ఉన్నారు అని మల్లి అంటుంది.మల్లి తలదువుకుంటూ ఉండగా, మల్లి ఒక్క నిమిషం అని గౌతమ్ వెళ్లి సాంబ్రాణి తెచ్చి తలకి సాంబ్రాణి ధూపం వేస్తాడు. ఏంటండీ ఈ పనులు మీరు ఎందుకు నాకు చేస్తున్నారు అని మల్లీ అడుగుతుంది.

చూడు మల్లి ఉదయం లేచిన కానుంచి మొదలు ఏ పనైనా సరే నీకు నేను చెయ్యాలి అని గౌతమ్ అంటాడు.గౌతమ్ సామ్రాణి వేస్తున్నంతసేపు మల్లి పరధ్యానంలో ఉంటుంది. ఏంటి మల్లి నేను నీ తలకి సాంబ్రాణి ప్రేమగా వేస్తూ ఉంటే చూడకుండా ఏదో పరధ్యానంలో ఉండి ఆలోచిస్తున్నావేంటి నిన్ను అంతలా బాధ పెట్టే విషయం ఏంటి నాకు చెప్పు అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదండి శివపార్వతుల కళ్యాణం లో ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను అమ్మని చూస్తే వాళ్లు అసలే ఓర్వలేరు అక్కడ తనకు ఏదైనా ఆపద తలపెడతారేమోనని భయమేస్తుంది అని మల్లి అంటుంది. నేను ఉండగా నీకెందుకు మల్లి భయం ఆ వసుంధర అత్తయ్య వనజాక్షి అత్తయ్య ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు ఏం చేస్తారో కూడా తెలుసు అయినా సరే వాళ్లకు భయపడకుండా శరత్ అంకుల్ చేత అత్తయ్యకి తాళి కట్టించి తీరతాను అని గౌతమ్ అంటాడు.

అది కాదండి అసలే వాళ్ళు మూర్ఖులు ఎంతకైనా తెగిస్తారు మొన్న చూశారు కదా వనజాక్షి ఎలా చేయబోయిందో అమ్మకి మెడలో తాళిబొట్టు లేదని పసుపు కుంకుమ తీసుకోవద్దని నాన్న రభస చేసింది ఇప్పుడు మీరు అమ్మకి నాన్నకి కళ్యాణం జరిపిస్తానంటే ఆవిడ ఊరుకుంటుందా అని మల్లి అంటుంది. వాళ్లు రణరంగంలోకి దిగాక యుద్ధం చేసైనా సరే గెలిచి నీ మొహం నవ్వు ఆనందం చూస్తాను మల్లి అని గౌతమ్ అంటాడు. ఇంతలో తన పర్సులో నుంచి ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటోని చూసి మల్లి షాక్ అవుతుంది. ఏంటి మల్లి ఈది చిన్నప్పటి ఫోటో గౌతమ్ దగ్గర ఎలా ఉంది అనుకుంటున్నావా గౌతమ్ అర క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేడు నిన్ను చూడలేని నిమిషంలో నీ ఫోటో ఆయన చూసుకోవడానికి తన దగ్గర పెట్టుకున్నాడు నువ్వంటే వాడికి అంత ప్రేమ అమ్మ అని కౌసల్య అంటుంది.

ఆ మాటకి మల్లి చిన్న స్మైల్ ఇస్తుంది. చూడు మల్లి అరవింద్ నీకు ఎంతో సహాయం చేశాడని చెప్పావు ఈ ఫోటో తన పర్సులో నుంచి కింద పడిన నేను ఎందుకు ఏమీ అనలేదు తెలుసా అరవింద్ కి నీ మీద ఎలాంటి చెడు ఉద్దేశం ఉన్నట్టు నాకు కనపడలేదు అందుకే ఏమీ అనలేదు నీ ఫోటో నా పర్సులోనే ఉండాలి ఇంకెవరి దగ్గర ఉండకూడదు అందుకే తీసుకున్నాను అరవింద్ వేరే ఉద్దేశంతో తన పర్సులో పెట్టుకున్నట్టు అయితే ఏం చేసేవానో తెలుసా అరవింద్ ని చంపేసేవాణ్ణి అని గౌతమ్ అంటాడు. ఆ మాటలు విని మల్లి భయపడిపోతుంది. గౌతమ్ టైం అవుతుంది త్వరగా రండి అని కౌసల్య పిలుస్తుంది. ఇదిగో వస్తున్నామమ్మా అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది