Malli Nindu Jabili November 16 2023 Episode 496: శివపార్వతులని తీసుకొని కౌసల్య కుటుంబం గుడికి వస్తుంది.ఈరోజు జరగబోయే కళ్యాణం లో వేరొక ఘట్టం కూడా జరగబోతుంది అని గౌతమ్ అంటాడు. ఏమిటి బాబు ఆ గట్టం అని పంతులుగారు అడుగుతాడు. ఇప్పుడు చెప్తే బాగోదు సర్ప్రైజ్ అని గౌతమ్ అoటాడు. నువ్వు ఎప్పుడు ఇలాంటి సప్రైజ్లే ఇస్తూ ఉంటావు గౌతమ్ అని శరత్ అంటాడు. ఇంకా మాలిని వసుంధర అరవింద్ రాలేదేంటి అని కౌసల్య అడుగుతుంది.శివపార్వతుల కళ్యాణం లో అమ్మానాన్నలకి కూడా కళ్యాణం చేయించబోతున్నాడని వసుంధరమ్మ గారికి తెలిస్తే ఊరుకుంటుందా అసలు ఊరుకోదు ఏం జరగబోతుందో ఏమో అని మల్లి భయపడుతుంది. ఇంతలో వసుంధర వాళ్ళు గుడికి వస్తారు. అరవింద్ తాళ ఇలా ఇవ్వు కారు లో ఫోన్ మర్చిపోయాను మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను అని వసుంధర అంటుంది. వసుంధర ఫోన్ తీసుకోవడానికి కారు దగ్గరికి వస్తుంది.

రేయ్ గుడిలోకి వెళ్దాం రారా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ గౌతమ్ సారు బయటే ఉండమన్నాడు రా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి,గౌతమ్ సార్ మల్లి మేడం కోసం ఊళ్లో స్కూల్ కట్టించాడు అలాగే ఇక్కడ సప్రైజ్ ఇవ్వబోతున్నాడు అదేంటో నాకు కూడా తెలియదు రా అని గౌతమ్ ఆఫీసులో పనిచేసే అతను అంటాడు. అది ఏమై ఉంటుందో ఏమో కానీ మల్లి మేడం మాత్రం చాలా అదృష్టవంతురాలు అని వాళ్ల ఫ్రెండ్ అంటాడు. నాకైతే ఒకటి అర్థమైంది రా గౌతమ్ సారు ఇయ్యబోయే గిఫ్ట్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది అయి ఉంటుంది అని వాళ్ల ఆఫీసులో పని చేసే అతను అంటాడు. వాళ్ల మాటలు విన్న వసుంధర రేయ్ గౌతమ్ నువ్వు శరత్ కి మీరా కి పెళ్లి చేయాలని అనుకుంటే ఈ పవిత్రమైన గుళ్లో గన్ను పేలుతుంది రా అమీరా రక్తంతో తడిసిపోతుంది అని కోపంతో రగిలిపోతుంది వసుంధర. కట్ చేస్తే, బాబు కళ్యాణం జరిపించే కంటే ముందు ధ్వజస్తంభానికి పూజ చేయాలి దీనికి ఎనలేని కీర్తి ఉంది బాబు అని పంతులుగారు చెప్తాడు. మల్లి ధ్వజస్తంభానికి పసుపు కుంకుమ బొట్లు పెడుతుంది.

బాబు ఇద్దరూ కలిసి దీపారాధన చేయండి అని పంతులుగారు అంటాడు. మల్లి గౌతమ్ దీపారాధన చేస్తారు. బాబు మీ ఆవిడకి బొట్టు పెట్టు అని పంతులుగారు అంటాడు. గౌతమ్ మల్లి కి బొట్టు పెడుతుండగా ధ్వజస్తంభం మీద నుంచి పూలదండ వాళ్ళిద్దరు మెడలో పడుతుంది. బాబు ధ్వజస్తంభం నుంచి పూలదండ మీ మెడలో పడడం జన్మజన్మల అదృష్టం స్వయంగా ఆ దేవుడే ఆశీర్వదించి పూల దండ వేసినట్టు అని పంతులుగారు అంటాడు. మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు అన్నయ్య గౌతమ్ కోసం మల్లి పుట్టింది మల్లి కోసం గౌతమ్ పుట్టాడు అని నీలిమ అంటుంది. పంతులుగారు వాళ్ళిద్దర్నీ ఆశీర్వదించి తల మీద అక్షంతలు వేస్తాడు.

అన్నయ్య మిమ్మల్ని చూసి ఎవరు ఈర్ష పడకుండా ఉండేలా ఆ భగవంతుడే ఆశీర్వదించి ఈ గిఫ్ట్ ని ఇచ్చాడు అని నీలిమ అంటుంది. గౌతమ్ మల్లి కళ్ళలోకి చూస్తూ ఈ రోజు నిమిషం నిమిషానికి నీ ఆనందం రెట్టింపు అవుతూనే ఉంటుంది మల్లి అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, ఏమండీ ఈ చెట్టుకి ఉయ్యాలను ఎందుకు కడుతున్నారు అని మాలిని అడుగుతుంది. కోరికలు తీరడం కోసం ముడుపులు ఎలా కడతారో సంతానం కోసం ఈ ఉయ్యాల కడతారు అని అక్కడ ఒక ఆవిడ చెప్తుంది.

నాకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది ఇంకా పిల్లలు లేరు, నాకు ఎటువంటి లోటు లేదు కానీ పిల్లలు లేరనే బాధ మాత్రం ఉండిపోయింది నేను పిల్లలు కలగాలని ఉయ్యాల కడుతున్నాను మీరు కూడా కట్టండి అమ్మ నీకు సంతానం కలుగుతుంది అని ఆ గుడిలో ఒక ఆవిడ అంటుంది. అరవింద్ శివపార్వతుల కళ్యాణానికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు అయినా వచ్చాను అంటే దేవుడు నా చేత ఈ ముడుపు కట్టించాలని రప్పించాడేమో, అరవింద్ నేను కూడా ఉయ్యాల కడతాను అని వాళ్ళని అంటుంది. అలాగే కట్టు మాలిని అని అరవింద్ ఉయ్యాల తెచ్చి ఇస్తాడు. మాలిని అరవింద్ ఉయ్యాల కట్టి మురిసిపోతూ ఉంటారు. గుడిలో దూరం నుంచి వాళ్లు ఉయ్యాల కడుతున్నది చూసిన మల్లి సంతోషిస్తుంది.

ఏడేళ్ల మా ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డని ఇవ్వు తల్లి అని మాలిని నమస్కారం చేసుకుంటుంది. మల్లి అరవింద్ మాలిని దగ్గరికి వచ్చి పిల్లల కోసం ఉయ్యాల కడుతున్నారా కట్టండి వచ్చే సంవత్సరానికి బుల్లి అరవిoద్ బాబు బుల్లి మాలిని పుడతారు అని మల్లి అంటుంది. థాంక్స్ మల్లి అని మాలిని అంటుంది. నీ మనసు చాలా గొప్పది అక్క నీ మంచితనానికి మెచ్చి భగవంతుడు ఇద్దరి కమల పిల్లల్ని ఇస్తాడు చూడండి అని మల్లి అంటుంది.సంతోష పడుతూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి మల్లి, అమ్మ నిన్ను నమ్ముకొని అక్క ఉయ్యాల కట్టింది వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించు వాళ్లకి పాప బాబు పుడితే నేను 108 కొబ్బరికాయలు కొడతాను అని మల్లి మొక్కుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది