Malli Nindu Jabili: మల్లి రాత్రి ఏం జరిగింది అని అరవింద్ అంటాడు. ఆయనకు నిజం చెబుదామని నేను అనుకున్నాను కానీ ఆయన అలసిపోయి వచ్చాను ఇంకెప్పుడైనా చెబుదువు గాని అని వెళ్లి పడుకున్నాడు నాకెందుకు డౌట్ వచ్చి ఆ లెటరు నేను రాసిందేనా కాదా అని వెళ్లి చూస్తే ఆ లెటర్ నేను రాసింది కాదు లెటర్ మారిపోయింది ఆయనకు నిజం చెబితే మన ముగ్గురిలో ఎవరిదో ఒకరి ప్రాణం వెళ్ళిపోతుంది నిజం చెప్పి మీ ప్రాణాలు పోగొట్టే పరిస్థితి నేను ఎప్పటికీ తీసుకురాను అలాగని ఆయనను మోసం చేస్తూ చెప్పకుండా ఉండలేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మల్లి అంటుంది.

ఈ పరిస్థితులలో నువ్వు నిజం చెప్పడం కాన్న ఊరుకోవడం బెటర్ అని అరవింద్ అంటాడు. నేను రాసిన లెటర్ అది కాదు ఆ లెటర్ మాలిని అక్క మార్చేసి ఉంటుంది అని మల్లి అంటుంది.కట్ చేస్తే నిజంగానే మాలిని మల్లి రాసిన లెటర్ దాచేసిందా అని బీరువా అంతా వెతుకు తాడు ఆ లెటర్ దొరుకుతుంది మల్లి రాసిన లెటర్ ను తీసి వేరే లెటర్ ఎందుకు పెట్టావు మల్లి మీద ఎందుకు నీకు ఇంత కక్ష తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు అని అరవింద్ అంటాడు. నేను నా చెల్లికి అన్నయ్యని జరగకూడదు గౌతమ్ తో పెళ్లి అవ్వాలి అని ఆ లెటర్ ను మార్చి నేను మల్లి కి పెళ్లి జరగాలని ఆలోచించి అలా చేశాను కానీ ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను గౌతమ్ దగ్గరికి వెళ్లి నీకు మల్లి కి పెళ్లయిందని చెబుతాను అని వెళ్లి మాలిని గౌతమ్ కి నిజం చెప్పేస్తుంది కొన్ని పరిస్థితుల వలన ఆ లెటర్ ని నేను రాసి అక్కడ పెట్టాను అది మల్లి నీకు ఇచ్చింది కానీ మల్లి రాసిన లెటర్ ఇది చదువుకో అని మాలిని అంటుంది.

మాలిని చెప్పింది నిజమా నువ్వు రాసిన లెటర్ ఇద అని గౌతమ్ మల్లి ని అడుగుతాడు. అవునండి అని మల్లి అంటుంది. గౌతమ్ ఆ లెటర్ చదువుతాడు. ఇప్పుడు ఏం చేస్తావో నీ ఇష్టం మాలిని గౌతమ్ ని అంటుంది. అక్క లెటర్ దాచి పెట్టింది నువ్వే కానీ ఇప్పుడు నిజం ఎందుకు చెప్తున్నావ్ అని మల్లి అంటుంది. మల్లి ఇన్ని రోజులు నేను నీ జీవితం బాగుండాలని ఒక అక్కగా అనుకున్నాను కానీ నువ్వు నా జీవితానికి అడ్డుస్తుంటే తట్టుకోలేక ఇలా చేశాను అని మాలిని అంటుంది. అరవింద్ కి నీకు పెళ్లి అయ్యిందా ఆ విషయం ముందే చెప్పాలి కదా అని కౌసల్య అంటుంది. మా అక్క లెటర్ మార్చిందని నాకు ఈ మధ్య తెలిసింది నేను చెబుదామనుకునే లోపు మళ్లీ తనే వచ్చి మీకు నిజం చెప్పింది అని మల్లి అంటుంది.

నువ్వు నన్ను మోసం చేశావు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ కళ్ళల్లో నిజాయితీ కనపడట్లేదు నిన్ను ఎలా నమ్మమంటావ్ అని గౌతమ్ అంటాడు. నువ్వు ఈ ఇంటికి కోడలువి అయ్యాయి అర్హత నీకు లేదు బయటికి పో అని కౌసల్య అంటుంది. అమ్మ బయటికి పోవడంతో సమస్య తీరిపోదు దీనికి పరిష్కారం ఇప్పుడే చెబుతాను అని గౌతమ్ లోపలికి వెళ్లి గన్ను తెచ్చి ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది నువ్వు కాల్చుకుంటావా నన్ను కాల్చుకోమంటావా అని గౌతమ్ గన్ను తీసి మల్లి ని షూట్ చేస్తాడు. నో అలా జరగకూడదు అని అరవింద్ గట్టిగా అంటాడు ఇదంతా కల ఇలా ఈ లెటర్ గౌతమ్ దగ్గరికి వెళ్ళకూడదు

మా పెళ్లి విషయం బయటపడింది అంటే గౌతమ్ కసాయి వాడిలా మల్లి ని సూట్ చేసి పారేస్తాడు అని అరవింద్ అంటాడు. నీ మాజీ భార్య గురించి అన్నీ తెలిసె నల్లపూసల ఫంక్షన్ కానించి జరుపుకున్నారు నువ్వేం కంగారు పడిపోకు ఈ లెటర్ దాస్తే మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నాను కానీ కుక్క తోక వంకర అన్నట్టు నీ బుద్ధి మారలేదు ఇన్నింటికి కారణం నువ్వే అరవింద్ అని మాలిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది