Malli Nindu Jabili October 17 ఎపిసోడ్ 470: బుర్ర గాని చెడిపోయిందా ఏంటి అలా మాట్లాడుతున్నావ్ అని జగదాంబ అంటుంది. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా కూతురికి అలాంటి దురుద్దేశం లేదు అని మీరా అంటుంది. నోరు ముయ్ నీ డ్రామాలు నీ కూతురు డ్రామాలు నేను కనిపెట్టలేని అనుకుంటున్నావా అని వసుంధర కోపంగా ఉంటుంది. మీరేదో కోపంలో అలా అంటున్నారు అత్తయ్య అని అరవింద్ అంటాడు. అమ్మ అన్న దాంట్లో తప్పేముంది అరవింద్ అని మాలిని అంటుంది. అక్కడ అంత సైలెంట్ గా ఉండి ఇక్కడ ఇంత వైలెంట్ అవసరమా అని అరవింద్ అంటాడు. ఆ గౌతమ్ గాడు మల్లి అనే కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే తన బుద్ధి చూపించుకుంది అని వసుంధర అంటుంది. మీరు అట్టా మాట్లాడకండి అమ్మగారు పడుతున్నాం కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడకండి అని మీరా అంటుంది.

మీరా అలా అనగానే నోరు ముయ్ అని వసుంధర చేయి లేపుతుంది.వసుంధర నీకసలు బుద్ధి ఉందా ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నావ్ అని శరత్ కోపంగా తనని తిడతాడు.ఏమిరా నా స్టేటస్ లో గాని నా కూతురు జీవిత విషయంలో గాని ఏదైనా తేడా జరిగితే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని వసుంధర మాలిని తీసుకొని వెళ్ళిపోతుంది. చూశారా బాబు గారు ఎలా మాట్లాడుతుందో అని జగదాంబ అంటుంది. మీరు ముందు లోపలికి వెళ్ళండి అని శరత్ అంటాడు. కట్ చేస్తే మల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ మీరు వసుంధర గారు కోపంగా వెళ్లారు కదా ఇంట్లో ఏ పెద్ద గొడవ జరగలేదు కదా అని అంటుంది. అట్లాంటిదేమీ జరగలేదమ్మా నేను నిజమే చెప్తున్నాను అని మీరా అంటుంది. నువ్వు నిజం చెప్తున్నట్టు నాకు అనిపించడం లేదే అని మల్లి అంటుంది.

మీ నాన్నగారు పిలుస్తున్నారు వస్తానమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది మీరా. మల్లి ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ వచ్చి మై కమింగ్ మేడం అని అంటాడు. దేనికి ఇలాంటి పనులన్నీ అని మల్లి అంటుంది. ఈ గౌతమ్ ఎప్పుడు సదా మీ సేవలో అని అంటాడు. నేనే కిందికి వచ్చేదాని కదా మీరు ఎందుకు వచ్చారు అని మల్లి అంటుంది. ప్రిన్సెస్ కిందికి రాకూడదు అని గౌతమ్ భోజనం తెచ్చి మల్లి కి తినిపిస్తూ ఉండగా నీలిమా చూసి ఈరోజు పుట్టిన పాపకి అన్న ప్రాసన చేస్తున్నావా బ్రో అని అంటుంది. ఏ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళు అని గౌతమ్ నీలిమని బెదిరిస్తాడు. వదిన అన్నయ్య 20 గిఫ్ట్ ఇచ్చాడు 21 గిఫ్టు అడుగు మర్చిపోకు అని నీలిమ వెళ్ళిపోతుంది.ఏవండీ నీలిమ గుర్తు చేసిన ఆ 21 గిఫ్ట్ ఏంటండి చెప్పండి అని మల్లి అడుగుతుంది. అది అని గౌతమ్ చెప్పబోతూ ఉండగా మల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది.

వెంటనే గౌతమ్ హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు. డాక్టర్ గారు గౌతమ్ ని పిలిచి మీ వైఫ్ కి ఫుడ్ పాయిజనింగ్ అయింది ఒక గంట అబ్జర్వేషన్ లో ఉంచి తీసుకువెళ్లండి అని అంటుంది.అందరూ తిన్నది అదే ఫుడ్డు మల్లి కి మాత్రం ఫుడ్ పాయిజనింగ్ ఎలా అయింది అని గౌతమ్ ఆలోచిస్తూ మల్లి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్లి మా ఇంట్లో ఎవరైనా ఏదైనా చేశారా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా అని గౌతమ్ చూస్తాడు ఆ ఫుటేజీలో మీరా గారు మల్లి కోసం జ్యూస్ చేస్తూ ఉండగా వసుంధర గారు వచ్చి అందులో ఏదో కలుపుతుంది అది చూసుకోకుండా తెచ్చి మల్లి కి ఇస్తుంది అది తాగిన మల్లెకి ఫుడ్ పాయిజనింగ్ అయింది అని గౌతమ్ కోపంతో ఫోన్ చేస్తాడు ఇంతకు దిగజారి పోతావని నేను అస్సలు అనుకోలేదు అని గౌతమ్ అంటాడు.

ఆ పల్లెటూరు దాన్ని చేసుకుని నువ్వు తప్పు చేశావు పని మనిషిలా ఉండేదాన్ని కోడలు చేసుకుని మీ అమ్మ దిగజారిపోయింది నువ్వేంటి నన్ను అంటున్నావ్ అని వసుంధర అంటుంది.పల్లెటూరి అమ్మాయి అయినా అమాయకురాలిని చంపడానికి ప్రయత్నించవు దాన్నేమంటారు దిగజారడం అనరా అని గౌతమ్ కోపంతో అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ నేనెందుకు అలా చేస్తాను అని వసుంధర అంటుంది.

నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన ఆధారాలు లేకుండా మాయమైపోతాయా చూడత్తా మల్లి అంటే నాకు ప్రాణం తనను ఏమైనా చేస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టను అత్తవని చూస్తున్నాను ఇది మై ఆర్డర్ అని గౌతమ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చ ఇంత చేసినా వాడు దాన్ని కాపాడుకుంటున్నాడు అని వసుంధర కోపంతో ఊగిపోతుంది. ఫోన్ మాట్లాడి గౌతమ్ వెనకకు తిరిగేసరికి మల్లి ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది