Malli Nindu Jabili October 31 Episode 482: మీకు అబద్ధం చెప్పి పెళ్లి చేయాల్సిన అవసరం మాకు లేదు బాబు మల్లి నిజం చెప్పింది కదా లెటర్ రాసి అని మీరు అంటుంది. నేను మిమ్మల్ని మోసం చేయలేదు నేను పెళ్లికి ముందే లెటర్ లో అంతా రాశాను కానీ నా దురదృష్టం వల్ల అది మీకు అందలేదు అని మల్లి బాధపడుతుంది. ని అమాయకత్వం చూసి నిన్ను ఇష్టపడ్డాను నువ్వు ఎంతో మంచి దానివి అని నేను పెళ్లి చేసుకున్నాను ఒక్క మొగుణ్ణి మార్చి నన్ను ఏ మార్చి పెళ్లి చేసుకుంటావా ఇది మోసం కాదా అని గౌతమ్ అంటాడు. మల్లి నిజమే చెప్తుంది గౌతమ్ నిన్ను ఏ మార్చి ఆ లెటర్ మార్చి నీకు నిజం తెలియకుండా చేసింది మాలిని తప్పంతా మాలిని చేసింది అని అరవింద్ అంటాడు. ఇంకొక కొత్త నాటకమా దీనికి పరిష్కారమేంటి అని గౌతమ్ అంటాడు. ఇది నేను కావాలని చేసిన తప్పు కాదండి నన్ను క్షమించండి అని మల్లి అంటుంది.

బాబు గారు ఎక్కడ ఏ తప్పు జరిగినా నా మల్లి మెడకే చుట్టుకుంటుంది జరిగింది ఏదో జరిగింది నా కూతుర్ని క్షమించేయండి క్షమించండి బాబు గారు అని మీరా అంటుంది. తప్పు నీది కాదు మల్లి నాది నేను గుడ్డిగా ప్రేమించాను నీ వెనకాల సైన్యంగా నిలబడ్డాను కదా ఆ తప్పు సరిదిద్దుకోవాలి అంటే శిక్ష నేనే అనుభవించాలి అని గౌతమ్ తనను తాను పొడుచుకుంటాడు. నో అలా జరగకూడదు మీకేం కాకూడదు అని మల్లి గట్టిగా అరుస్తుంది. మల్లి నీకేమైంది ఎందుకలా అరిచావు అని గౌతమ్ అంటాడు. మల్లి కళ్ళు తెరిచి చూసి అంతా కల అని అనుకుంటుంది. గౌతమ్ ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో మల్లి ఫోటో కనిపిస్తుంది.

అందులోనే బంగారు గాజులు కూడా ఉంటాయి మల్లి ఇది నీకోసమే ఎవరో పంపించారు తీసుకో అని గాజులు మల్లి కి ఇస్తాడు గౌతమ్. డాడీ ఇక మనం బయలుదేరుదామా అని మాలిని అంటుంది. వెల్దురుగానే ఉండు మాలిని నేను పెట్టే షరతులకు ఒప్పుకుంటే శరతంకులు నీ వెనకాల వస్తాడు లేదంటే ఇక్కడే ఉంటాడు అని గౌతమ్ అంటాడు. షరతుల ఏంటి అవి అని మాలిని అంటుంది. మీరా అత్తయ్య గారికి వసుంధర గారితో సమానమైన హక్కులు కావాలి ఆస్తిలో కానీ డబ్బులు కానీ హోదాలో కానీ పూజ చేసుకునేటప్పుడు పక్కన కూర్చునే హక్కు కావాలి ఆస్తిలో వాటా కావాలి ఆస్తి తదనంతరం తన కూతురికి చెందలి కొనుక్కునే బట్టలు కట్టుకునే చీరలతో సహా అన్ని అన్ని ఎవర్థింగ్ అని కావాలి షరతులకు ఒప్పుకుంటేనే నీతో శరత్ అంకుల్ అత్తయ్య వస్తారు లేదంటే ఇక్కడే ఉంటారు అని గౌతమ్ అంటాడు షరతులతో కాపురాలు నిలబడవు మామయ్య ఇక్కడే ఉంటే కొన్ని జీవితాలు రోడ్డున పడతాయి అని అరవింద్ అంటాడు.

అరవింద్ ఇన్ని షరతులు పెట్టిన గౌతమ్ దసరా ఫెస్టివల్ అయిపోయాక డాడీని పంపిస్తానని ఎందుకు మాట అన్నాడు అని మాలిని అంటుంది. తీసుకువెళ్లండి కానీ మీరా అత్తయ్య మీ ఇంటికి వచ్చాక పని మనిషిలా ఉండకూడదు పనులు చేయకూడదు పని మనుషులతో పని చేయించుకొని దర్జాగా ఇంట్లో కూర్చొని ఉండాలి ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అలాంటి షరతులకు ఒప్పుకుంటే తీసుకెళ్లండి అని గౌతమ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. బాబు గారు శరత్ బాబు గారు వసుంధరమ్మ గారి తోటే ఉండడం నాకు ధర్మం అనిపిస్తుంది అని మీరా అంటుంది. చూడండి డాడీ మీరు ఇంట్లో లేరని అమ్మ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయింది గెస్ట్ హౌస్ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఏమో మీరు రాకపోతే అమ్మ ఏమైపోతుందో డాడీ అని మాలిని ఏడుస్తుంది.

ఇదొక కొత్త నాటక మీ అమ్మ ఎటువంటిదో నాకు బాగా తెలుసు మీ అమ్మ నన్ను మల్లి నీ విడగొట్టడానికి ఏం చెప్పిందో తెలుసా మల్లి కి ఇంతకుముందే అరవింద్ తో పెళ్లి అయిపోయింది అని చెప్పింది నేను తనని అనుమానించట్లేదు కాబట్టి మల్లి ఇంకా బ్రతికే ఉంది లేదంటే మీ అమ్మ మాటలు పట్టుకుని మల్లి ఏం చేసే వాడినో ఏమో అయినా మల్లి కి నా గురించి తెలుసు నేను నమ్మకద్రోహని క్షమించానని అలా చేస్తే మల్లి నీ ఇంట్లో ఎందుకు ఉండనిస్తాను అయినా అరవింద్ ని చేసుకొని నన్ను మల్లి పెళ్లి ఎందుకు చేసుకుంటుంది మీ అమ్మకి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పి సంసారాలు విడదీస్తుందా అలాంటి క్యారెక్టర్ మీ అమ్మది అని గౌతమ్ అంటాడు.

అరవింద్ ఇక మనం వెళ్దామా డాడీని ఎలాగూ గౌతమ్ పంపించడు అని మాలిని అంటుంది. మల్లి ఇంటికి వచ్చిన అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చే చీర పెట్టి పంపించు అని గౌతమ్ అంటాడు. మాకు ఏమీ అక్కర్లేదు అని మాలిని అంటుంది. అమ్మవారి పసుపు కుంకుమ చీర వద్దంటే నీకే మంచిది కాదు మాలిని అని గౌతమ్ అంటాడు. మల్లి పెట్టిన పసుపు కుంకుమ చీర తీసుకొని మాలిని వెళ్ళిపోతుంది.మీరా గారు మల్లి ని ఇక్కడ ఏం జరుగుతుంది మల్లి గౌతమ్ బాబు కి పెళ్లికి ముందు నీకు పెళ్లి అయిన సంగతి లెటర్ లో రాసి పెట్టానని చెప్పావు కదా ఇప్పుడు తెలియనట్టు మాట్లాడుతున్నాడు ఏంటి అని మీరా అంటుంది.
ఆయన నన్ను పిలుస్తున్నారు మీతో తర్వాత మాట్లాడతాను అని మల్లి అంటుంది.చూడమ్మా నీ జీవితం చేయిజారి పోకముందే ఏం జరిగిందో మాకు చెప్పు నీకోసం ఒక తండ్రిగా ఎంత దూరమైనా వెళ్తాను అని శరత్ అంటాడు. దీనికంతటికీ కారణం మాలిని అక్క నేను రాసిన లెటర్ మార్చి తను రాసిన లెటర్ గౌతమ్ కి అందేలా చేసింది అని మల్లి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది