Malli Nindu Jabili: మల్లి కి ఎలా చెప్పాలి అని అరవింద్ ఆలోచిస్తూ ఒక లెటర్ రాసి పెడితే బాగుంటుంది అని లెటర్ రాసి మల్లి క్యాబిన్లో అరవింద్ పెట్టబోతు ఉండగా గౌతమ్ చూస్తాడు. మల్లి ఇలా రా మనం వెళ్దాం అని గౌతమ్ మల్లి క్యాబిన్ లోకి తీసుకువస్తాడు. మల్లి గౌతమ్ వస్తున్నది చూసి అరవింద్ లెటర్నిచ్చించి చెత్తబుట్టలో వేస్తాడు. మల్లి క్యాబిన్ లోకి వచ్చి లెటర్ పెట్టావు దాంట్లో ఏం రాశావు అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదు గౌతమ్ అని అరవింద్ అంటాడు. ఏమీ లేకపోతే మల్లి చదవడానికి నువ్వు లెటర్ రాసి తన క్యాబిన్లోని ఎందుకు పెడతావు అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదని చెప్తున్నాను కదా గౌతమ్ అని అరవింద్ అంటాడు. కాల్ మీ సార్ అని పిలు అని గౌతమ్ అంటాడు. అడుగుతున్నాడు కదా చెప్పండి అని మల్లి అంటుంది.

ఇంతలో మాలిని కూడా అక్కడికి వస్తుంది ఏం జరుగుతుంది అరవింద్ ఇక్కడ అని మాలిని అంటుంది. మాలిని నువ్వెందుకు వచ్చావు వెళ్ళు ముందు అని అరవింద్ అంటాడు. ఏమీ లేకపోతే వీళ్ళు నీ మీద ఎందుకు అరుస్తారు అని మాలిని అంటుంది. ఏమీ లేదని చెప్తున్నాను కదా నువ్వు ముందు బయలుదేరు ఇక్కడి నుంచి అని అరవింద్ అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను వెళ్ళను అని మాలిని అంటుంది.లెటర్ లో ఏముందో చెప్పమంటే చెప్పట్లేదు కదా ఆ చెత్త బుట్టలో చించేసిన లెటర్ ని తీసి గౌతమ్ టేబుల్ మీద వేసి అతక పెట్టి చదువుదామని చూస్తాడు ఇంతలో హౌస్ కీపర్ వచ్చి ఫ్యాన్ వేస్తాడు ఏం చేస్తున్నావ్ నికు కినిపించట్లేదా ఫ్యాన్ ఏసావ్ అని గౌతమ్ అంటాడు.

సారీ సార్ చూసుకోలేదు అని హౌస్ కీపర్ అంటాడు. కింద పడిపోయిన లెటర్ ముక్కల్లో ఒకటి తీసి మల్లి దీంట్లో ఏం రాసిందో చదువు అని అంటాడు గౌతమ్. పెళ్లి అని ఉంది అని మల్లి అంటుంది. అంటే నాతో నీ పెళ్లి జరగడం అరవింద్ కి ఇష్టం లేదు అందుకే లెటర్ రాసి పెట్టాడు చూసావా మన దగ్గరే పని చేస్తూ మనిద్దరం విడిపోవాలని అనుకుంటున్నాడు అరవింద్ అని గౌతమ్ అంటాడు. అరవింద్ అలా ఎందుకు రాసావు చెప్పు అని మాలిని అంటుంది. ఏమీ లేదు మాలిని నేను చెప్పేది అర్థం చేసుకోవా అని అరవింద్ అంటాడు.ఓకే ఆల్ రైట్ ఈరోజు ఈ విషయం గురించి వదిలేస్తున్నాను కానీ రేపు మాత్రం ఈ విషయం గురించి వదిలిపెట్టను అరవింద్ మల్లి నేను ఒక మీటింగుకి అటెండ్ అవ్వాలి వెళ్తున్నాను అట్నుంచి అంటే చెన్నై వెళ్తాను రేపు పొద్దున వస్తాను నువ్వు ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళిపో అని గౌతమ్ వెళ్ళిపోతాడు.

మాలిని అరవింద్ ను బయటికి లాక్కొచ్చి ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు అని మాలిని అంటుంది. మాలిని నాకు కొంచెం పని ఉంది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అరవింద్ అంటాడు. నువ్వు ఎందుకు రానంటున్నావో అర్థం అవుతుంది అరవింద్ ఆ లెటర్ లో ఏం రాశావో కూడా అర్థమవుతుంది మల్లి కి నీకు జరిగిన పెళ్లిని మరిచిపోలేకపోతున్నావు తన మీదనే ఇంకా వ్యామోహం పెంచుకున్నావు అదే రాసి ఉంటావు కదూ అని మాలిని అంటుంది. మాలిని నిజం చెప్పేటప్పుడు భయం ఉండదని అంటారు కానీ నిజానికి కూడా భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు అంటే అది చెబితే కొన్ని జీవితాలు కూలిపోతాయి అని అరవింద్ అంటాడు.

పైకి మీ ఇద్దరి మధ్య స్నేహబంధం మాత్రమే ఉందని అంటారు కానీ మీ మనసులో కామం ఉంది అని మాలిని అంటుంది. నేను ఎప్పుడూ మల్లి క్షేమమే ఆలోచిస్తాను కానీ అది నీకు వ్యామోహంగా కనిపిస్తుంది చూసే కళ్ళను పట్టి ఉంటుంది అని అరవింద్ అంటాడు. ఇప్పుడు నాకు అదంతా తెలియదు నువ్వు నాతో వస్తున్నావు రా అని మాలిని అరవింద్ ని తీసుకెళ్లి పోతుంది.అరవింద్ బాబు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు అని మల్లి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది