Malli Nindu Jabili: అక్కడ అరవింద్ కనిపించడు ఇక్కడ చెప్పులు కనపడతాయి ఇదేంటి నా చెప్పులు ఇక్కడ ఉన్నాయి ఇంతకుముందు నేను షాపింగ్ చేసినప్పుడు కొన్నవి కదా అని గౌతమ్ అంటాడు.అవునండి అని మల్లి అదేంటి అరవింద్ బాబు గారు ఇక్కడ లేరు అని తన మనసులో అనుకుంటుంది. సరే అని గౌతమ్ ఫ్రెష్ అప్ అయి వస్తాడు. ఏవండీ మీకు ఒక విషయం చెప్పాలి అని మల్లి అంటుంది. ఇప్పుడు నేను టైడ్ గా ఉన్నాను మల్లి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం లే అని గౌతమ్ పడుకుంటాడు. కట్ చేస్తే అరవింద్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మానాన్నలు చూసి ఎక్కడికి వెళ్లావు అరవింద్ అని అంటారు. ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ అని అరవింద్ అంటాడు.

పొద్దున ఆఫీస్ లో గొడవ అయిందట మల్లికి ఏదో లెటర్ రాశావట మాలిని ఎంత బాధ పడుతుంది రా తను నీకోసం అంత లారాటపడుతుంటే నువ్వేంటి రా మల్లి వెనకాల తిరుగుతున్నావు అని వాళ్ళ నాన్న అంటాడు. నేను తప్పుగా ఏమి ఆలోచించలేదు అమ్మ నా పనులు మీకు అన్ని తప్పుగానే కనిపిస్తున్న ఏం చేయను అని అరవింద్ అంటాడు. అది కాదురా నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మాలిని గురించి ఆలోచించు ఒక్కసారి అని వాళ్ళ అమ్మ అంటుంది.అమ్మ నేను ఏదో చెబుదామనే మల్లి కి లెటర్ రాశాను కానీ అది కుదరలేదు దాన్ని చూసి మాలిని మీకు ఏదో చెప్పింది అంతే ఇంకేమీ జరగలేదు ఆఫీసులో అని అరవింద్ అంటాడు. గౌతమ్ నిన్ను బాగా గట్టిగా అరిచాడట కదా దానికి మల్లి కూడా సపోర్ట్ చేసిందట అని వాళ్ళ అమ్మ అంటుంది.

నేను ఏమి మాట్లాడినా మీరు అర్థం చేసుకోరు అని అరవింద్ అంటాడు. అక్కడ అంత టార్చర్ గా ఉంటే జాబ్ మానేయొచ్చు కదా అని అనుపమంటుంది. అమ్మ నేను నిర్దోషినని నిరూపించుకునే దాకా జాబ్ మానేయను అక్కడే చేస్తాను అని అరవింద్ వెళ్ళిపోతాడు. ఏంటండీ వీడు ఇంకా మారడా ఎప్పుడు మల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడా తన మీదనే ప్రాణాలు పెట్టుకున్న మాలిని గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు వీడు ఎప్పుడు మారుతాడు అని అనుపమ అంటుంది. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది అనుపమ మనం మార్చలేము అని వాళ్ళ నాన్న అంటాడు. అరవింద్ వెళ్లి మంచం మీద పడుకొని మాలిని గుర్తుకు తెచ్చుకొని నాకోసం నువ్వు ఇంత బాధ పడుతున్నావా మాలిని నేను నిన్ను ఇంకెప్పుడు కష్టపెట్టాను సారీ నన్ను క్షమించు అని తన మనసులో అనుకొని పడుకుంటాడు అరవింద్.అరవింద్ మీద చేయి వేసి అరవింద్ అరవింద్ అని కలవరిస్తూ ఉంటుంది మాలిని.

కట్ చేస్తే నేను ఆరోజు లెటర్ లో అంతా రాసి పెట్టాను కానీ అరవింద్ బాబు మాత్రం మా పెళ్లి జరిగినట్టు లెటర్లో రాసి లేదు అని అంటాడు ఏంటి ఏం చేయాలి ఇప్పుడు ఆయనకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ మల్లి ఒకసారి ఆ లెటర్లో చదివి చూద్దాము అని లెటర్ని తీసి చదువుతుంది బాబు గారు మీరు చాలా గొప్పోళ్ళు నీకు నాకు చాలా దూరం ఉంది అయినా సరే మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు అరవింద్ బాబు వాళ్ళ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చి చదువుకునేలా చేశారు

అందుకే అరవింద్ బాబు నా విషయంలో చనువు తీసుకున్న సరే నేను ఏమీ మాట్లాడలేక పోతున్నాను కష్టం వచ్చిన సమయంలో నన్ను మీరు ఆదుకొని నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు ఇంట్లో ఆశ్రయమిచ్చి నన్ను చేరదీశారు అలాంటి మీరు నన్ను పెళ్లి చేసుకుంటానంటే అదృష్టం అని భావిస్తాను కానీ కాదనికాళ్లతో ఎందుకు తన్నేస్తాను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే అని లెటర్ లో ఉంటుంది.అది చదివి నమ్మలే షాక్ అవుతుంది అందుకే గౌతమ్ బాబు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు నాకు అరవింద్ కి పెళ్లి అయ్యిందని తెలిస్తే ఇలా చూసుకునేవారు కాదు ఆయనకి ఇప్పుడు నిజం ఎలా చెప్పాలి అని మల్లి ఆలోచిస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది