Malli Nindu Jabili: మల్లి గురించి నీకు కొన్ని విషయాలు చెబుతాను ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను అని వసుంధర అంటుంది. మల్లి గురించి మీకు ఏం తెలుసు అని గౌతమ్ అంటాడు. మల్లి కి ఇంతకుముందే పెళ్లి అయ్యింది నీకు తెలుసా మల్లి నీ పెళ్లి చేసుకున్న వాడు ఎవరో కాదు నా అల్లుడు అరవింద్ అ మీరా జగదాంబ మల్లి అందరూ కలిసి నిన్ను మోసం చేసి పెళ్లి చేశారు నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే వివాహ రద్దు చేసుకున్నట్టు విడాకుల నోటీసు ఉన్నాయి చూస్తావా చూడు అని వసుంధర చూపించి మళ్లీ ఇలా అంటుంది మల్లి నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు నీ ఇంటికి పనిమనిషిగా ఉండవలసిన దానిని గొప్పింటి కోడలిని చేసుకున్నావు భార్య రూపంలో ఉన్న మోసగత్తతో కాపురం చేస్తావో ఇంకేం చేస్తావో నీ ఇష్టం ఎందుకో నీకు నిజాలు చెప్పాలి ని అనిపించింది చెప్పేశాను కానీ నా పేరు బయటికి రాకుండా చూసుకో లేదంటే నేనే ఏదో గేమ్ ఆడుతున్నానని అందరూ అనుకుంటారు ఉంటాను గౌతమ్ అని వసుంధర వెళ్ళిపోతుంది

కట్ చేస్తే వసుంధర గారు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పారు నిజంగానే మలి కి పెళ్లి జరిగిందా అని గౌతమ్ కోపంతో రగిలిపోతూ మల్లి ఒక అబద్ధపు లెటర్ రాసి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నేను నిన్ను క్షమించలేను మలి నువ్వు అరవిందు కలిసి ఎంత డ్రామాలు ఆడారు నిన్ను అందనం ఎక్కించాను కానీ నువ్వు చేసింది ఏంటి కొంచెం కూడా విశ్వాసం లేకుండా నన్ను మోసం చేస్తావా అని గౌతమ్ అనుకుంటాడు. ఇంతలో తెల్లవారింది మల్లి నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసి పూజ చేస్తుంది.కౌసల్య లేసి ఇంత పొద్దున్నే లేచి పూజ చేస్తున్నారు ఎవరు అని చూస్తే మల్లి కనిపించింది ఏంటి మల్లి ఇంత పొద్దున్నే లేచావు ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా అని కౌసల్య అంటుంది. అత్తయ్య హారతి తీసుకోండి అని వాళ్ళందరికీ హారతి ఇస్తుంది. మల్లి నువ్వు కూడా హారతి తీసుకో అమ్మ అని కౌసల్య అంటుంది.అమ్మ కౌసల్య దేవి అన్నయ్య గదిలో నుంచి బయటికి రాకముందే నువ్వు అడగాల్సింది సూటిగా అడుగు అని నీలిమా అంటుంది.

అమ్మ మల్లి రాత్రి అంతా బాగానే ఉంది కదా నువ్వు ఏమీ భయపడకు మీ అమ్మని రమ్మని ఫోన్ చేస్తాను తను కూడా వస్తుందిలే ఇక్కడే ఉంటుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అత్తయ్య అది అని మలి చెప్పబోతుండగా ఇంతలో గౌతం వచ్చేస్తాడు మల్లి ఆఫీస్ కి వెళ్దామా అని గౌతమ్ అంటాడు. భోజనం చేయరా అని కౌసల్య అంటుంది. అమ్మ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాంలే వెళ్ళొస్తాము అని గౌతమ్ మల్లి ని తీసుకొని వెళ్ళిపోతాడు ఏంటమ్మా అలాగేనా అడిగేది వదిన అర్థం చేసుకోలేక పోతుంది అని నీలిమ అంటుంది. మల్లి చెప్పే లోపే గౌతమ్ వచ్చి తీసుకు వెళ్ళాడు సాయంత్రం ఎలాగో ఇంటికి వస్తారు కదా అప్పుడు అడుగుదాం లే అని కౌసల్య అంటుంది.బయటికి వచ్చిన గౌతమ్ కారు డోర్ తీసి ముందు సీట్లో మలిని కూర్చోబెడతాడు కూర్చోబెట్టాక మల్లి నేను నిన్ను ముందు సీట్లో కూర్చోబెట్టినట్టే అరవింద్ కూడా నిన్ను ముందు సీట్లో కూర్చోబెట్టాడా అని అంటాడు. అవును సార్ ఒకరోజు సీతారాముల కల్యాణానికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టాడు అని మల్లి అంటుంది. అవునులే కార్లు అయితే బాగోదని బైక్ మీద తిప్పాడు కదా బైక్ వేసుకొని ఊరంతా చట్టా పట్టాలతో తిరిగారు కదా అని తన మనసులో గౌతం అనుకుంటాడు.

మల్లి నేను మంచివాడినేనా చెడ్డవాడినా అని గౌతమ్ అంటాడు. అవునండి మీరు చాలా మంచివారు అని మలి అంటుంది. అవునులే నువ్వు నా భార్యవు కాబట్టి నాతో బాగానే ఉంటావు కానీ అరవింద్ తో ఎన్నిసార్లు కారులో బయటికి వెళ్లావు అని గౌతమ్ అంటాడు. ఒక్కసారి వెళ్ళానండి అని మలి అంటుంది. మల్లి సీట్ బెల్ట్ పెట్టుకో అని గౌతమ్ అంటాడు. మల్లి కి సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాకపోవడంతో గౌతమ్ సీట్ బెల్ట్ పెట్టి ఆ అరవింద్ కూడా ఇలాగే పెట్టి ఉంటాడా అని అంటాడు. మల్లి కి ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని బిత్తరపోయి చూస్తుంది. గౌతమ్ ఆఫీస్ దగ్గరికి రాగానే కార్ ఆపి కారులో నుంచి బయటకు వచ్చివెళ్లిపోతూ వెనక్కి తిరిగి చూస్తే మలి కారులోనే ఉంటుంది ఏంటి మలి కారు దిగిరా అని గౌతమ్ అంటాడు. మల్లి కారు దిగి వస్తుంది ఏంటి నేను కారు డోరు తీస్తానని నువ్వు ఎదురు చూసావా అన్నిసార్లు నేనే తీస్తే నాకు వ్యాల్యూ ఉండదు అని గౌతమ్ ఆఫీస్ లోపలికి రాగానే అరవింద్ కనిపిస్తాడు ఏంటి జైలు నుంచి వచ్చాక కూడా ఆఫీస్ కి వచ్చావా రావేమో అనుకున్నాను అని గౌతమ్ అంటాడు.

నేను నిర్దోషినని తెలిసేదాకా ఇక్కడే ఉంటాను నిర్దోషినని తెలిశాక నువ్వు ఉండమన్న అస్సలు ఉండను అని అరవింద్ అంటాడు. ఇంతకుముందు ఇక్కడే పని చేశావు నేను వచ్చాక కూడా ఇక్కడే పని చేస్తున్నావ్ అందుకే నీ మనసు ఆఫీస్ మీదకి లాగుతూ ఉంటుంది అని గౌతమ్ వెళ్లిపోతాడు.ఆ మాటలు ఏమీ అర్థం కాక మల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మల్లి కూర్చున్న దగ్గరికి అరవింద్ వచ్చి మల్లి ఎలా ఉన్నావు బాగానే ఉన్నావా అని అరవింద్ అంటాడు. నాకేంటి సార్ బాగానే ఉన్నాను అని మల్లి అంటుంది.మలి.బాగున్నాను అని అనడానికి బాగానే ఉన్నాను అన్న దానికి తేడా చాలా ఉంది ఎందుకంటే గౌతం అసలు రూపం అది కాదు ఇది అని అరవింద్ అంటాడు. లేదు సార్ ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు అని మల్లి అంటుంది గౌతమ్ ప్రవర్తన ఎలా ఉందో నీకు ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుంది కానీ గౌతమ్ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు నా మీద పగతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు అది గౌతమ్ క్యారెక్టర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అని అరవింద్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది