Malli Nindu Jabili: లాయర్ అరవింద్ ని బయటికి తీసుకొని వస్తాడు వసుంధర గారే బాబు మీకు బెయిల్ ఇప్పించింది అని అంటాడు. అరవింద్ బయటికి రాగానే మాలిని వెళ్లి అరవింద్ ని పట్టుకొని ఏడుస్తుంది. అమ్మ ఇక నేను వెళ్లి రానా అని లాయర్ అంటాడు. థాంక్యూ లాయర్ గారు నేను ఫోన్ చేయగానే మీ అసిస్టెంట్ ని కూడా పంపించకుండా మీరే వచ్చి మా అల్లుడు గారిని విడిపించారు థాంక్యూ సో మచ్ అని వసుంధర అంటుంది. మీలాంటి వాళ్లు ఫోన్ చేస్తే మేము రాకుండా అసిస్టెంట్ ను ఎలా పంపిస్తాం అమ్మ అని లాయర్ అంటాడు. నా విలువ లాయర్ గారి కైనా అర్థమయింది కానీ ఇంట్లో వాళ్లకే ఎప్పటికీ అర్థం అవుతుందో ఏమో అరవింద్ ఇకనైనా నువ్వు మల్లి గురించి వదిలేసి అయిన వాళ్ల గురించి ఆలోచించడం మొదలు పెట్టు నువ్వు అరెస్టు అయిన మీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు మీరా శరత్చంద్ర కూడా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు కానీ నిన్ను విడిపించాలన్న ఆలోచన వాళ్లకు ఎవరికీ రాలేదు నా అల్లుడిని నేనే విడిపించుకుంటాను అని నేను వచ్చేసాను నేను నిన్ను విడిపించాను ఇక మీదటైనా మాలిని ని బాధ పెట్టకుండా చూసుకో అని వసుంధర అంటుంది.

విడిపించినందుకు థాంక్స్ మాలిని ఇక మనం వెళ్దామా అని అరవింద్ అంటాడు. నేను డ్రాప్ చేస్తాను అని వసుంధర అంటుంది. నో థాంక్స్ మేము వెళ్ళగలము అని అరవింద్ అంటాడు. పర్వాలేదులే నేను డ్రాప్ చేస్తాను అని అంటున్నాను కదా అలా మొహమాటo పడతావు ఎందుకు అని వసుంధర అంటుంది. అరవింద్ వెళ్దాం పద అని మాలిని అంటుంది. సరే పద అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే అరవింద్ బాబు తప్పు చేసినట్టు గౌతమ్ సార్ కి అనిపిస్తుంది కానీ నాకు మాత్రం అరవింద్ సార్ తప్పు చేసినట్టు అనిపించడం లేదు అది గౌతమ్ గారికి చెబితే అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏమో అని మల్లి మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజు ఫోన్ చేసి నా చెల్లెల్ని చంపిన వాడి మీద మీరు పగ తీర్చుకుంటారని అనుకున్నాను కానీ వాడికి బేలు వచ్చి బయటికి వచ్చేలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అని రాజు అంటాడు.

ఏంటి అరవింద్ బెయిల్ మీద బయటకు వచ్చాడా అని గౌతమ్ అంటాడు. అవును సార్ వాళ్ళ అత్తగారు బెయిల్ ఇప్పించి తీసుకువెళ్ళింది నా చెల్లెలి ని చంపిన వాడి మీద పగ నేనే తీర్చుకుంటాను ఎంతైనా మీరు మామూలు మనిషి కదా నా చెల్లెల్ని మరిచిపోయి మల్లిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు నేను మాత్రం అరవింద్ ను వదిలిపెట్టను అని రాజు అంటాడు. అరవింద్ బయటికి వచ్చావా అని కోపంతో ఫోను నేలకేసి కొడతాడు. గౌతమ్ ఏమైందిరా అని వాళ్ళ అమ్మ మల్లి వాళ్ళ చెల్లెలు అందరూ పరిగెత్తుకు వస్తారు. ఏమైంది బ్రో అని నీలిమ అంటుంది. అరవింద్ బెయిల్ మీద బయటికి వచ్చాడంట వాళ్ళ అత్త బేయిల్ ఇప్పించింది అంట వాడు చాలా హ్యాపీగా బయటికి వచ్చేసాడు అని గౌతమ్ అంటాడు.

ఒరేయ్ గౌతమ్ అరవింద్ మీద ఉన్న పగ కాసేపు పక్కన పెట్టు నీ సంతోషం గురించి నువ్వు ఆలోచించు ఈరోజు 11వ తారీకు పంతులుగారు మీకు శోభనానికి ముహూర్తం పెట్టాడు అరవింద్ మీద ఉన్న పగ ఎప్పుడైనా తీర్చుకోవచ్చు కానీ ఈ సంతోషాo మళ్లీ మళ్లీ రాదు రా అని వాళ్ళ అమ్మ అంటుంది. అలాగే అమ్మ నాకు కొంచెం బయట పని ఉంది బయటికి వెళ్లి వస్తాను అని గౌతమ్ వెళ్ళిపోతాడు. మల్లి నువ్వు వెళ్లి రెడీగా మీ అమ్మకి ఫోన్ చేస్తాను అని అంటుంది కౌసల్య. అలాగే అత్తయ్య అని మల్లి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అరవింద్ ని తీసుకొస్తున్నాను అని మాలిని చెప్పింది ఇంకా రాలేదేంటి అని అనుపమ అంటుంది. ఇంతలో అరవింద్ మాలిని వచ్చేస్తారు అరవింద్ నువ్వు జైలుకి వెళ్లడమేంటిరా అని అనుపమ అంటుంది. అనుపమ ముందు సోఫాలో కూర్చోపెట్టు మంచి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వు అని సుమిత్ర అంటుంది. అలాగే అక్క అని అరవింద్ ను సోపాలకు కూర్చోబెట్టి మంచి నీళ్లు తీసుకువచ్చి ఇస్తుంది అనుపమ.

ఇకనుంచి అయినా నీ గురించి నువ్వు ఆలోచించు ఆ మల్లి గౌతమ్ ప్లాన్ గా అనుకొని నిన్ను అరెస్టు చేయించారు కానీ మల్లి కి కొంచెమైనా కృతజ్ఞత ఉందా తనను చదివించి ఇంత పెద్ద దాన్ని చేస్తే తను చేసింది ఏంటి నువ్వు ఇంకెప్పుడూ మల్లి గురించి ఇంట్లో ప్రస్తావని తీసుకురావద్దు మల్లి తన బ్రతుకు తను బతుకుతుంది మీరిద్దరూ హ్యాపీగా ఉండండి అని అనుపమంటుంది. అవును అరవింద్ నువ్వు ఇక మల్లి గురించి ఆలోచించడం మానేయ్ ఒకే ఆఫీసులో పని చేస్తున్న ఎవరికి వారు తెలియనట్టు ఉండండి లేదంటే మళ్లీ మొదటికి వస్తుంది అని వాళ్ల నాన్న అంటాడు. గొప్ప జర్నలిస్టుగా ఈ సమాజంలో పేరు పొందిన నిన్ను అరెస్టు చేయించి చెడ్డపేరు వచ్చేలా చేశాడు ఆ గౌతం నువ్వు ఇంకా ఆ ఆఫీస్ లో పని చేయాల్సిన పని ఏముంది అరవింద్ అని సుమిత్ర అంటుంది. అవును అరవింద్ మల్లి ని నేను ఏదో బలవంతంగా గౌతమ్ కి కట్టబెట్టడానికి ఈ పని చేశాను అని అంటుంది కానీ తను ఏది మర్చిపోలేదు మన ఇంట్లో జరిగిన విషయాలను గుర్తు పెట్టుకొని ఇలా రివెంజ్ తీర్చుకుంటుంది అని మాలిని అంటుంది.

మీరు అందరూ మల్లి ని అపార్థం చేసుకుంటున్నారు మల్లి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు తనకు మంచి భర్త లభించాడనే నా మీద పగ తీర్చుకునే అంత దిగజారిపోలేదు మల్లి స్వప్న గురించి పేపర్ లో రాసింది నేనేనని మల్లి కి అసలు తెలియదు తెలిస్తే నన్ను అడిగేది కేవలం గౌతం కి నాకు మాత్రమే పగ ఇందులో మల్లిని లాగకండి గౌతమ్ నేనే చూసుకుంటాము అని అరవింద్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కౌసల్య మల్లిని రెడీ చేస్తుంది. వదిన పిల్లలు ఆడుకోవడానికి ఆన్లైన్లో బొమ్మలు అన్ని బుక్ చేశాను మీరు తొందరగా పిల్లల్ని మాకు ఇస్తే బాగుంటుంది అని నీలిమ అంటుంది. పిల్లలు పుట్టడానికి 9 నెలలు టైం పడుతుందమ్మా అప్పటిదాకా ఆగలేక పోతే ఆన్లైన్లో బుక్ చేసుకో వాళ్లే వస్తారు అని మల్లి అంటుంది. అబ్బో కౌంటర్లా అని నీలిమ అంటుంది. మరి ఏమనుకున్నావు నా కోడలు అంటే అని కౌసల్య అంటుంది. అమ్మ నా కూతురు జీవితంలో ఎప్పుడు ఇంత సంతోషంగా లేదు కానీ మీ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అని మీరా అంటుంది. ఇంతలో గౌతమ్ బయటికి వెళ్లి వస్తాడు అమ్మ అని పిలుస్తాడు. మీరా గౌతమ్ వచ్చినట్టున్నాడు మేము వెళ్లి వాడిని రెడీ చేస్తాం నువ్వు మల్లిని రెడీ చేయి అని కౌసల్య వెళ్ళిపోతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది