Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : మల్లి జీవితం సరి చేయడం కోసం నేను దిగినాను అని జగదాంబ అరవింద్ తో అంటుంది, మల్లి నేను పంపించలేదు థానే వెళ్లిపోయింది అని అరవింద్ సమాధానం ఇవ్వడం తో మల్లి నిండు జాబిలి జూన్ 6 ఈ రోజు ఎపిసోడ్ 373 మొదలవుతుంది. మల్లికి ఈ మధ్య ఆత్మభిమానం ఎక్కువ అయిపోయింది అందుకే వెళ్లిపోయింది అని అరవింద్ అంటాడు. ఇదిగో మీరా ఈ వరం రోజులు మనం పట్నం లో ఎక్కడ ఉందాం అని అడగకు, మనం మీ అల్లుడు ఇంట్లోనే ఉందాం అని అరవింద్ వంక చూస్తూ జగదాంబ నిక్కచ్చిగా చెప్తుంది.

Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : మనం మీ అల్లుడు ఇంట్లోనే ఉందాం మీరా
మీ అల్లుడు ఇంట్లోనే ఉందాం అని జగదాంబ అనేసరికి కంగారు తో భయంగా మొఖం పెడుతుంది మీరా. అరవింద్ కూడా మొఖం ఆందోళన తో పెట్టేసరికి, ఎందుకు భయపడుతున్నావ్ నీ ఇంట్లో వాళ్లకు ఎమ్ చెప్పుకుంటావో నీ ఇష్టం మేము మాత్రం మీ ఇంట్లో ఉంటున్నాం అని చెప్పేస్తుంది. నువ్వు కాదు అంటే మాత్రం ఊరుకోను మీ ఇంటికి వొచ్చేసి గొడవ చేస్తాను అని బెదిరిస్తోంది కూడా. అది కాదు అంది మా ఇంట్లో ప్రస్తుతం పరిస్థితి అని అరవింద్ ఏదో చెప్పబోతుంటే ఇంకేం మాట్లాడకు అని అరవింద్ నోరు మూయిస్తుంది జగదాంబ.

Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : మధు లేడీస్ హాస్టల్ లో మల్లి గౌతమ్
తరువాత సీన్ లో కథ మల్లి హాస్టల్ దెగ్గరకు వెళ్తుంది. మల్లి నిండు జాబిలి నిన్నటి ఎపిసోడ్ లో మల్లి ఇంకా గౌతమ్ కి మధయ్ జరిగిన గొడవ తెలిసిందే. ఇప్పుడు గౌతమ్ మనకు మల్లి ఉంటున్న మధు లేడీస్ హాస్టల్ బయట కనిపిస్తాడు. మల్లి కూడా గౌతమ్ ని హాస్టల్ ముందు చూసి కోపం తో ఊగిపోతోంది. నన్ను ఇబ్బంది పెట్టడం కోసం కదా నన్ను ఫాలో అయ్యి ఇక్కడ నా హాస్టల్ దాకా వొచ్చారు లేక పోతే మీకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని మల్లి గౌతమ్ తో అంటుంది.

కొంచెం సేపు మల్లి గౌతమ్ మధ్య గొడవ జరుగుతుంది, మల్లి గౌతమ్ కాలర్ పట్టుకుని తనను అవమానించి ఇబ్బంది పెట్టినందుకు చెంప దెబ్బలు కొడుతుంది. కానీ కొంచెం సేపు తరువాత మనకు అర్ధం అయేది ఏంటి అంటే హాస్టల్ వార్డెన్ ను చూసి గౌతమ్ అని ఉహించుకొని కొట్టేస్తుంది మల్లి నిజానికి అక్కడికి గౌతమ్ రాలేదు.

అరవింద్ ఇంటికి చేరిన మీరా జగదాంబ
మరోవైపు అరవింద్ మీరాను జగదాంబను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇంట్లో కూర్చును అనుపమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటుంది. రూప కూడా అక్కడే ఉంటుంది. అరవింద్ మీరా జగదాంబను లోపలికి తీసుకురావడం చూసిన అనుపమ వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకు వొచ్చావు అరవింద్ అని మండిపడుతుంది. ఇది నా కూతురి అల్లుడి ఇల్లు మాకు ఇక్కడ ఉండే అర్హత ఉంది అని బల్లగుద్దినట్లు చెప్పేస్తుంది జగదాంబ. ఎవరు నువ్వు అని అనుపమ ప్రశ్నిస్తే మీరా తల్లి మల్లి కి అమ్మమ్మని అని చెప్తుంది. నేలకొండపల్లి వొచ్చి జగదంబ గురించి అడిగారు అనుకోండి నా గురించి కథలు కథలుగా చెప్తారు అని మొదలుపెడుతుంది జగదాంబ. మల్లి వెళ్లిపోయింది మా ఇంటితో నీకు ఎమ్ పని అని అనుపమ అడుగుతే మల్లిని గెంటేశారు అనే కదా నేను ఇక్కడికి రావాల్సి వొచ్చింది అని సమాధానం ఇస్తుంది జగదాంబ.

Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : ఈ ఇంటికి అసలైన కోడలు ఎవరో తేలుస్తాను – మల్లి నిండు జాబిలి జూన్ 6 నేటి ఎపిసోడ్ లో జగదాంబ!
ఆవేశంలో ఉన్న జగదాంబ ని ముందు మీరు కూర్చోండి అని అంటాడు అరవింద్. ఈ ఇంటికి అసలైన కోడలు ఎవరో తేలుస్తాను ముందు ఆ మాలినిని బయటకు రమ్మను అని అంటుంది జగదాంబ. మాలిని ఇంట్లో లేదు అని సమాధానం ఇస్తుంది అనుపమ. అరవింద్ ఆలా జగదాంబని కోర్చోమనడం ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఒకరి మొఖాలు ఒకరు చూస్తూ ఉంటె మీరాని కూడా కూర్చో మంటుందు జగదాంబ. పర్లేదు అమ్మ అని మీరా సమాధానం ఇస్తుంది.

సుందర్ కాఫీ తీసుకురా అని అరవింద్ అంటాడు, సుందర్ లేదు అరవింద్ నేను వెళ్లి తీసుకురాన అని అక్కడే ఉన్న రూప అడుగుతుంది. తీసుకురా అక్క అని రూపతో అంటాడు కానీ పాక్కనే ఆగు రూప అని తన తల్లి రూపాను ఆపేస్తుంది. మల్లికి సంబంధించిన మనుషులు వొచ్చినప్పుడు మనం మర్యాదలు చేయాలి కదా అమ్మ అని అంటుంది రూప. నువ్వు బయటి వాళ్లకు మానేసి ఇంట్లో వాళ్లకు సపోర్ట్ చేస్తే మంచిది అని అంటుంది రూప తల్లి.

బయటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు కాదమ్మా
బయటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు కాదమ్మా నాకు ఎటు న్యాయం అనిపిస్తే ఆటే మాట్లాడతాను అని అంటుంది రూప. రూప ఇలా మాట్లాడటం విన్న అరవింద్ మొఖం కొంచెం వెలిగిపోవడం మనం చూస్తాం. ఏంటి మీరు మీ అమ్మను తీసుకువొచ్చి అల్లరి చేస్తే మేము భయపడి మిమ్మల్ని ఇంట్లో పీటుకుంటాం అనుకున్నారా అని అక్కడ ఉన్న రూప తండ్రి భార్గవ మీరాతో అంటాడు. నేను నా కూతురు జీవితం బాగుపడాలి అనే వొచ్చిన కానీ గొడవ చేయాలి అని కాదు బాబు అని సమాధానం ఇస్తుంది మీరా. మీ ఉద్దేశాలు ఏమైనా కావొచ్చు కానీ ఇది పద్ధతి కాదు అని అరవింద్ తండ్రి రామకృష్ణ అంటాడు. అనుపమ పోలీసులను పిలుస్తాను అని బెదిరిస్తోంది కానీ జగదాంబ భయపడకుండా మీరు పోలీసులను పిలుస్తే నేను మా ఊరు పెద్ద మనుషులను పిలుస్తాను, తెల్లారే సరికి నేలకొండపల్లి ఊరు మొత్తం మీ ఇంటి ముందు ఉంటుంది అని బెదిరిస్తోంది.

Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : చేతుల్లో కత్తులు కొడవళ్లు గడ్డపారలు
నేను పిలిచాను అంటే మా నేలకొండపల్లి జనం మాములుగా రారు చేతిలో కత్తులు కొడవళ్లు గడ్డపారలు పట్టుకుని దిగిపోతారు అని జగదాంబ తిరిగి అనుపమ ను బెదిరిస్తోంది. నేను అన్ని విషయాలు తెలుసుకునే వొచ్చాను మీరు కానీ మల్లి మా కోడలు కాదు అని అంటే మిమ్మల్ని ఈడ్చుకుపోయి మా ఊరిలో పంచాయతీ పెట్టిస్తాను అని అంటుంది. మల్లికి అరవింద్ బాబు కు పెళ్ళైనట్లు అన్ని సాక్షాలు ఉన్నాయి కాబట్టి మా ఊరు మీకు మాములు శిక్ష వేయదు అని ఇంకా దేదిరిస్తుంది జగదాంబ. ఈ జగదాంబ దెగ్గర మీ పప్పులు ఉడకవు, మల్లి ఈ ఇంటి కోడలు అని తేలేదాక నేను మీరా ఈ ఇంట్లోంచి బయటకు పొయ్యేదేలే అంటూ హెచ్చరిస్తుంది.

చివరికి జగదాంబ మీరాకు ఉండడానికి రూమ్ చూపించడానికి రూప వారిని తీసుకు వెళ్తుంది. ఎలాంటి వారిని మా నెత్తి మీద ఎందుకు పెట్టావు అరవింద్ అని అడుగుతారు కుటుంబసభ్యులు. మల్లిని చూడటానికి వచ్చిన వీళ్ళకి ఆక్సిడెంట్ అయింది పెద్దమ్మ ఇంకా ధరి లేక తీసుకురావాల్సి వొచ్చింది అని అరవింద్ సమాధానం ఇస్తాడు.
నేను మీ మనిషినే అనుకోండి
జగదాంబ మీరాను రూమ్ కి తీసుకువొచ్చినా రూప వారితో ఎంతో ప్రేమేపూర్వకంగా మాట్లాడుతుంది. నేను మీ మనిషినే అనుకోండి మీకు ఏమి కావాలన్నా నన్ను మొహమాట పడకుండా అడగండి నేనే మీ ఇంట్లో ఉంటున్నా అనుకోండి అని చెప్తుంది రూప.

నాకు మల్లి మీద కేవలం అభిమాన ఉండేది కానీ ఎప్పుడైతే తాను చేసిన త్యాగం గురించి తెలిసిందో అప్పుడు తన మీద గౌరవం పెరిగింది అని మల్లి పట్ల తన అభిప్రాయం చెప్పగానే మీరా జగదాంబ మొఖం ఆనందం తో వెలిగిపోతుంది. బయట అంత విపరీతంగా ఎందుకు అరిచిననో తెలుసాఅమ్మ గుండెల్లో అంత బాధ ఉంది కాబట్టి నా కూతురి జీవిత పోయినది ఇప్పుడు నా మనవరాలు జీవితం కూడా ఆలా అవ్వకూడదు అని జగదాంబ రూప తో అంటుంది.

Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : అమ్మా వసుంధర తల్లి, మల్లి మంచిదే
మరో పక్క వసుంధర ఇంట్లో మాలిని శరత్ ఇంకా వసుంధర మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. అరవింద్ మీరాను ఒక గుడి దెగ్గర కలిసిన విషయం మాలిని వాళ్లకు చెప్తుంది. అరవింద్ చెప్తున్నా వినకుండా మల్లి ఎందుకు వెళ్లిపోయింది అని శరత్ మాలినితో అంటాడు. ఆ విషయం మల్లిని పట్టుకుని అడగండి అని పక్కన ఉన్న వసుంధర వెటకారం చేస్తుంది. ఇంటర్న్షిప్ నుండి మల్లికి బ్రతకడానికి కావాల్సిన డబ్బు కూడా వొచ్చేది అట ఆంయినా మల్లి వెళ్లిపోయింది అంటే మల్లిలో ఒక్క శాతం కూడా స్వార్ధం లేనట్లే అని మాలిని మల్లి ని పొగుడుతుంది. ఆలా కొంచెం సేపు మాలిని మల్లి మంచితనం గురించి వసుంధరకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. తిరిగి రేపటి మల్లి నిండు జాబిలి సీరియల్ ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కల్సుకుందాం అంతవరకు సెలవు…