NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru Today Episode April 3 2024 Episode highlights శ్రీలక్ష్మి పాండురంగని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటున్న చంగయ్య..

Mamagaru Today Episode April 3 2024 Episode 177 highlights

శ్రీలక్ష్మి పిన్ని కావాలనే వాళ్ళని తీసుకువెళ్లిందంట తాతయ్య అని వసంత కొడుకు అంటాడు. ఊరికే అని ఉంటారు లేరా అని చంగయ్య పాండురంగని పిలుస్తాడు. ఎందుకు నాన్న పిలిచావు అని పాండురంగ అంటాడు. ఏంట్రా ఏదో రెండు రోజులు పిల్లల్ని అక్కడ ఉంచొచ్చారు అనుకుంటే కావాలనే తీసుకువెళ్లి ఉంచొచ్చారంట వాళ్లేమో అక్కడ ఏసీలు ఉన్నాయి బెడ్ల మీద పడుకుంటున్నాం టిఫిన్లు తింటున్నాం అంటున్నారు అంట ఇక్కడ పిల్లలకి ఏం చెప్తాన్నారు రా మీరు అని చంగయ్య అంటాడు. మామగారు పిల్లల్ని కావాలనే ఉంచి వచ్చాను ఇక్కడ టిఫిన్ అడిగితే నూకలు ఇచ్చి టిఫిన్ చేయమంటారు కొబ్బెర తెచ్చి టిఫిన్ చేయమంటారు ఎలాగండి అని శ్రీలక్ష్మి అంటుంది. పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పాలి కదా మీరు అని చంగయ్య అంటాడు.పరిస్థితులు మనకు తెలుసు కానీ పిల్లలకు తెలియదు కదా మామగారు అందుకే రెండు రోజులైనా కడుపునిండా తింటారని ఉంచొచ్చాను అని శ్రీలక్ష్మి అంటుంది.

Mamagaru Today Episode April 3 2024 Episode highlights
Mamagaru Today Episode April 3 2024 Episode highlights

పాండురంగ నీ భార్య అలా నోరు పారేసుకుంటుంటే ఏం మాట్లాడవేంటి రా అని చంగయ్య అంటాడు. శ్రీలక్ష్మి అన్నదాంట్లో తప్పేముంది నాన్న మేము ఉద్యోగాలు చేస్తున్నాం అందులో ఖర్చు పెట్టొచ్చు కదా ఆస్తి ఉన్నప్పుడు పిసినారి తనం చూపించారు ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు కనీసం ఒక వంద రూపాయల ఖర్చు పెడుతున్నారా పావు కేజీ మటన్ తెచ్చి పదిమందిని తినమంటే ఎలా నాన్న అని పాండురంగ అంటాడు. నా పద్ధతులు ఇలాగే ఉంటాయి నచ్చితే ఇంట్లో ఉండండి లేదంటే బయటికి వెళ్లిపోండి అని చంగయ్య అంటాడు. వెళ్లిపొమ్మని మొహం మీదే చెప్పాక చూర్ పట్టుకొని వేలాడుతా మా మామగారు అలాగే వెళ్ళిపోతాం అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటి శ్రీలక్ష్మి అలా అంటావ్ అని దేవమ్మ అంటుంది. వెళ్లిపొమ్మని మొహం మీద చెప్పాక ఇంకా ఎలా ఉంటాం అత్తయ్య అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి ఇంకా ఏమీ మాట్లాడకు వెళ్లిపొమ్మన్నారు కదా వెళ్ళిపోదాం పద అంటూ పాండురంగ శ్రీలక్ష్మి తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 3 2024 Episode highlights
Mamagaru Today Episode April 3 2024 Episode highlights

వసంత గంగకి ఫోన్ చేస్తుంది. ఏంటక్కా అందరు ఎలా ఉన్నారు అని గంగ అడుగుతుంది. అందరం బాగానే ఉన్నాను గంగ కానీ మామ గారికి శ్రీలక్ష్మి అక్కకి పెద్ద గొడవ అయింది మామగారు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారు ఇలా ఒక్కొక్కరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా గంగ అని వసంత అంటుంది. గంగ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని వసంత ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 3 2024 Episode highlights
Mamagaru Today Episode April 3 2024 Episode highlights

ఏంటండీ గంగాధర్ వెళ్లిపోయిన బాధే తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు వాళ్లను కూడా పంపిస్తున్నారు అని దేవమ్మ బాధపడుతుంది. ఏదో ఆవేశంలో అన్నానులే దేవమ్మా వాళ్ళు వెళ్తాను అన్నా నేను వెళ్ళనిస్తానా నువ్వు ఊరుకో అని చంగయ్య దేవమ్మ కి నచ్చ చెబుతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 3 2024 Episode highlights
Mamagaru Today Episode April 3 2024 Episode highlights

ఏంటి వసంత అక్క ఏమీ మాట్లాడవు అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీ లక్ష్మక్క ఏదో మామయ్య ఆవేశంలో అన్నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని  వసంత అంటుంది. గంగవాళ్ళు వెళ్లిపోయారు కొన్నాళ్లు బాధపడ్డారు ఆ తర్వాత ఇద్దరు జాబ్ చేసుకుంటారు అందులో సగం ఖర్చు పెట్టుకుంటారు సగం దాచుకుంటారు అలాగే మేము వెళ్తాం ఇప్పుడు ఇబ్బంది పడ్డ తర్వాత అలవాటు అవుతుందిలే అక్కఅయినా బంధాల గురించి తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతలో చంగయ్య అక్కడికి వస్తాడు. శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. నాన్న చెప్పాను కదా మేము ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాము అక్కడికి రాము టీ కి టిఫిన్లకు ఎదురుచూడాల్సి వస్తుంది బయటికి వెళ్లి ఏదో ఒక జాబ్ చూసుకుని బ్రతుకుతాము మిగలకపోతే అప్పు చేసుకునే నా బ్రతుకుతాం కానీ వెళ్ళమన్న చోట చూర్ పట్టుకొని వేలాడలేము కదా నాన్న ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం అని శ్రీలక్ష్మి అంటుంది. అది విన్న చంగయ్య వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఏంట్రా అత్తమామల్ని వదిలేసి వెళ్ళిపోతారా ఏదో ఆవేశంలో గొడవలు అవుతాయి తిడతారు ఆ మాత్రానికి వెళ్ళిపోతారా ఈరోజు అత్త మామని వదిలేశారు ఆ తర్వాత తల్లిదండ్రులని వదిలేస్తారా నీకు బుద్ధి లేకపోయినా నీ భార్యకైనా ఉండాలి కదరా బుద్ధి మనిషి జన్మ ఎత్తాక అని చంగయ్య అంటాడు. ఇంతలో పాండురంగ అటుగా వస్తాడు ఏమండీ ఇల్లు చూడడానికి వెళ్దాం అన్నారు కదా వెళ్తారా అని శ్రీలక్ష్మి అడుగుతుంది. ఈరోజు నాకు లీవ్ లేదు శ్రీలక్ష్మి రేపు చూస్తానులే అంటూ పాండురంగ వెళ్లిపోతాడు. చూడు శ్రీలక్ష్మి ఇప్పటికే గంగాధర్ వెళ్లి న బాధలో ఉన్నాను మీరు కూడా వెళ్ళిపోతే తట్టుకోలేను అని దేవమ్మ అంటుంది. ఏం చేయమంటారు అత్తయ్య వెళ్లిపొమ్మన్నాక వెళ్ళిపోకపోతే బాగోదు కదా అని శ్రీలక్ష్మి అంటుంది. వెళ్ళిపోతే ఒంటరిగానే ఉండిపోతారు కలిసి ఉంటే అందరూ ప్రేమలో దొరుకుతాయి పిల్లలు తాతా నాయనమ్మ పెద్దమ్మ పెదనాన్న అంటూ తిరగలేరు కదా అని దేవమ్మ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 3 2024 Episode highlights
Mamagaru Today Episode April 3 2024 Episode highlights

గంగాధర్ పనికి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. గంగ టిఫిన్ పెట్టి గంగాధర్ కి ఇచ్చి బటన్ పెట్టి తల దువ్వుతుంది. ఇలా మగాడికి భార్య సేవలు చేస్తుంటే రాజు నన్న ఫీలింగ్ వచ్చేస్తుంది గంగ అని గంగాధర్ అంటాడు. అవునా మహారా రాజుగారు మా ఇంట్లో ఒక సమస్య ఉంది తీరుస్తారా అని గంగ అంటుంది.ఆ సమస్య ఏంటో చెప్పరా చెప్పండి మహారాణి గారు అని గంగాధర్ అంటాడు. ఏమీ లేదండి ఇప్పటికే మనం బయటికి వచ్చామని అత్తయ్య బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు శ్రీలక్ష్మి అక్క వాళ్ళు కూడా బయటికి వెళ్లిపోతే కొన్నాళ్ళకి వసంత అక్క వాళ్లకు కూడా బయటికి వెళ్లాలనిపిస్తుంది ఇలా కుటుంబం అంతా ముక్కలు ముక్కలైపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని గంగ అంటుంది. అవును గంగ అమ్మ ఇప్పటికే కుమిలిపోతూ ఉంటుంది ఇక అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతే అమ్మ తట్టుకోలేదు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపాలి అని గంగాధర్ అంటాడు..

Related posts

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N