NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: పవన్ సిరి వెంట పడుతుంటే ఎదురుపడ్డ చంగయ్య…

Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights

Mamagaru : మహేష్ గాడు గంగాధర్ దగ్గర ఉంటాడు వాడు ఎక్కడున్నాడో తెలుసా అని చంగయ్య అడుగుతాడు. తెలుసు నాన్న గంగాధర్ నాకు చెప్పాడు అని సుధాకర్ అంటాడు. మనం వాడి దగ్గరికి వెళ్దాం పద వాడు అందరి ముందు నా పరువు తీశాడు అని వాళ్ళు బయలుదేరుతారు. సిరి పవన్ కి భయపడి కాలేజ్ వెనుక నుండి వెళ్దామని వెళ్తుంది. పవన్ అక్కడే ఉంటాడు. గంగ గంగాధర్ కి ఫోన్ చేసి సిరి బ్యాంక్ ఎగ్జామ్ కి వెళ్ళింది కదా ఇప్పుడు అయిపోయి ఉంటుంది మీరు వెళ్లి తీసుకురండి అని చెప్తుంది. గంగాధర్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో చంగయ్య వాళ్ళు అక్కడికి వస్తారు. మహేష్ గాడు చెప్పిన విషయం అబద్ధమని తెలిసిపోయిందా నాన్న ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటాడు గంగాధర్. గంగాధర్ మహేష్ ని పిలిచి నువ్వు చెప్పింది అబద్ధమని తెలిసిపోయినట్టుంది నాన్న అన్నయ్యని తీసుకొని వచ్చారు అని అంటాడు.

Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights
Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights

ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు మహేష్. అబద్ధం నువ్వే చెప్పావు కదరా నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటాడు గంగాధర్. నువ్వు చెప్పమంటేనే చెప్పాను కదరా నన్నిరికిస్తావ్ ఏంటి అని అంటాడు మహేష్. నువ్వే ఏదో ఒకటి చేసి కాపాడురా నాన్నకి అబద్ధం తెలిసిపోయిందంటుంది అని గంగాధర్ అంటాడు. రేయ్ గంగాధర్ వాడిని పట్టుకోరా వాడు అబద్దం చెప్పాడు అని అంటాడు చంగయ్య. మహేష్ నాకేం తెలియదు నేనేం చేయలేదు అని పారిపోతాడు. ఏమైంది నాన్న అని అడుగుతాడు గంగాధర్.ఆ వెధవ శ్రీనివాసరావు ఐపి పెట్టాడని చెప్పాడు కదా తీరా అక్కడికి వెళ్తే నా పరువు పోయింది వాడు అబద్ధం చెప్పాడు అని అంటాడు చంగయ్య. ఈసారికి వదిలేయండి నాన్న అని అంటాడు గంగాధర్.

Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights
Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights

వాన్ని వదిలిపెట్టేది లేదు అని చంగయ్య వెళ్తాడు. గంగాధర్ నన్ను ఇలా ఇరికించాడు ఏంటి నేను గనుక దొరికితే నా పని అయిపోతుంది అని అనుకుంటాడు మహేష్. చంగయ్య మహేష్ కోసం వెతుకుతూ ఉంటాడు. మహేష్ తిరిగి చంగయ్య దగ్గరికి వస్తాడు. చంగయ్య మహేష్ చెంప పగలగొడతాడు. నా పరువు తీసావు కదరా వెధవ అని అంటాడు. నన్నెందుకు కొట్టావు బాబాయ్ అని అంటాడు మహేష్. అబద్ధం చెప్పి నా పరువు తీసావు కదరా అని మళ్ళీ చెంప పగలగొడతాడు. గంగాధర్ వినోదం చూస్తున్నావారా కాపాడొచ్చు కదా అని మహేష్ అంటాడు. ఎవడు అడ్డొచ్చినా కొడతాను అని అంటాడు చంగయ్య. బాబాయ్ నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు మహేష్.కుల శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి వెళ్లాను అని చెప్తాడు చంగయ్య. నేను చెప్పింది మేలా శ్రీనివాసరావు నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు బాబాయ్ అని అంటాడు మహేష్.

Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights
Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights

నాన్న వాడికి బుద్ధి చెప్పావు కదా ఇక బయలుదేరండి అని గంగాధర్ అంటాడు. నువ్వేంటి రా నన్ను బయలుదేరమంటావు మీ కాంట్రాక్టు పని చూద్దామని ఉన్నాను అని అంటాడు చంగయ్య. నాన్న ఇప్పుడు ఇవన్నీ చూడడం అవసరమా అని అంటాడు గంగాధర్. చూసే వెళ్తాము లేదంటే ఇంటి దగ్గర మీ అమ్మ అడుగుతుంది అని చంగయ్య అంటాడు. నాన్న ఇప్పుడు వెళ్లేలా లేడు అక్కడ సిరి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని కంగారు పడతాడు గంగాధర్. సిరి పవన్ కి దొరకకుండా తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. సిరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు జింక ఎప్పటికైనా పులికి దొరకాల్సిందే అని అంటాడు పవన్. పవన్ తన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సిరి ఒక చోట దాక్కొని ఉంటుంది. గంగాధర్ ఎగ్జామ్ సెంటర్ బయట సిరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights
Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights

సిరి పవన్ దగ్గర నుండి తప్పించుకొని పారిపోయి వస్తుంటే చంగయ్య కనపడతాడు తను చంగయ్య దగ్గరికి వెళుతుంది. ఏమైంది అని అడుగుతాడు చంగయ్య. కుక్క వెంట పడింది నాన్న అని చెప్తుంది సిరి. గంగాధర్ గంగకి ఫోన్ చేసి సిరి ఇక్కడ లేదు వెళ్ళిపోయినట్టుంది నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని అంటాడు. దేవమ్మ సిరి గురించి కంగారు పడుతుంది. సిరి చంగయ్య ఇంటికి వస్తారు. దేవమ్మ వాళ్ళిద్దరిని చూసి చంగయ్యకు నిజం తెలిసిపోయిందా అని అనుకుంటుంది. చంగయ్య వచ్చి కూర్చుంటాడు. దేవమ్మ వచ్చి ఇంతసేపైంది ఒక మంచినీళ్లు మజ్జిగ ఇవ్వవా అని అంటాడు.

Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights
Mamagaru Today Episode February 10 2024 Episode 132 Highlights

అవన్నీ అయిపోయాయి అని కంగారుగా చెప్తుంది దేవమ్మ. మజ్జిగ అయిపోతుంది కానీ మంచినీళ్లు కూడా అయిపోతాయా అని అంటాడు చంగయ్య. సిరి భయపడుతుంది తనతో కొంచెం మాట్లాడు అలాగే నాకు కొన్ని మంచి నీళ్లు కూడా ఇవ్వు అని అంటాడు చంగయ్య. దేవమ్మ మంచినీళ్లు తెచ్చి చంగయ్యకి ఇస్తుంది.సిరి గంగకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. సిరి మనం ఇలాంటి వాటికి భయపడకూడదు అని అంటుంది గంగ.

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu