Mamagaru november 11 2023 episode 54: ఒరేయ్ పెద్దోడా ఎందుకురా అలా మాట్లాడతావు రాకరాక వచ్చిన అవకాశం రా వీళ్ళని గడప దాటిదాం రా నాన్న మళ్ళీ ఒప్పుకుంటాడో ఒప్పుకోడు సంతకం పెట్టరా అని పాండురంగ అంటాడు. పెద్దన్నయ్య పెద్ద వదిన అని ఇచ్చే మర్యాద ఇదేనా రా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారే కానీ మా గురించి ఆలోచిస్తున్నారా అని సుధాకర్ అంటాడు. అదేంటి బావగారు అలా అంటారు ఎవరి స్వార్థం ఎవరు చూసుకుంటున్నారు అంతా కలిసికట్టుగా ఉండి మనము సాధించాము అనుకుంటే ఇప్పుడు ఇలా అడ్డుపడతారేంటి బావగారు అని గంగా అంటుంది. కలిసికట్టుగా ఉన్నామని అంటున్నారే కానీ అది మాటల్లోనే ఉంది గంగ చేతల్లో లేదు అని సుధాకర్ అంటాడు. వీళ్ళతో మనకెందుకండీ మనకు ఆ సంతకాలతో పనిలేదు అగ్రిమెంట్తో పనిలేదు అని వసంత అంటుంది. ఇంతలో చంగయ్య వచ్చి ఏమ్మా శ్రీలక్ష్మి ఇలా రా అని పిలుస్తాడు.

ఏంటి మామగారు అని శ్రీలక్ష్మి అడుగుతుంది. నాకు వసూళ్లకు వెళ్లే టైం అయింది అగ్రిమెంటు ఇలా ఇవ్వండమ్మా సంతకాలు పెట్టారా అని చoగయ్య అంటాడు. లేదు మామగారు వసంత అక్క సుధాకర్ బావ సంతకాలు పెట్టనన్నారు అని శ్రీలక్ష్మి అంటుంది. సంతకం పెట్టనన్నారా అయ్యయ్యో ఎందుకమ్మా అని చoగయ్య అంటాడు. పొదుపు సంఘం డబ్బులు తనకు ఇవ్వలేదని అక్క బావగారు సంతకం పెట్టనన్నారు అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటమ్మా కలిసికట్టుగా ఉన్నామన్నారు సమ్మెలు చేశారు ఆ కలిసికట్టుతనం ఎక్కడికి పోయింది కలిసి లేరా సమ్మెలు చేసినప్పుడు ఏమైందమ్మా ఈ విడిపోవడం అని చoగయ్య అంటాడు. చంగయ్య అలా అనగానే వాళ్ళు నలుగురు ఏమి మాట్లాడలేక నిలబడిపోతారు. గంగ అగ్రిమెంట్ పేపర్లు ఇలా ఇవ్వమ్మా అని చంగయ్య వాటిని తీసుకొని చింపేస్తాడు. అదేంటి మామయ్య గారు పేపర్లని అలా చింపేశారేంటి అని గంగా అడుగుతుంది. ముగ్గురు ఒప్పుకొని సంతకం పెడితేనే కదా అమ్మ మీరు ఉద్యోగాలకు వెళ్ళేది ఇప్పుడు దీనితో ఏం పనుంది వసంత సంతకం పెట్టలేదు కదా అని చెంగయ్య అంటాడు.

కట్ చేస్తే వాళ్లు ముగ్గురు లోపలికి వెళ్లి పోతారు. చంగయ్య పేపర్లు చేతిలో పట్టుకుని కావాలనే డబ్బు మీకు ఇచ్చాను డబ్బు తయారు చేసిన వాడికి దండం పెట్టాలి ఎందుకంటే అది ఎవరి మధ్యనైనా వివాదం సృష్టిస్తుంది కలిసికట్టుగా ఉన్నాము కలిమిడిగా ఉన్నాము అని సమ్మెలు చేసి నా మీద గెలిచాం అనుకున్నారు ఈ చంగయ్య వేసే ప్లాన్లకి నా ముందు మీరు ఎక్కడ గెలుస్తారు గంగ ఓటమి మీది గెలుపు నాది అంటూ చoగయ్య నవ్వుతాడు. కట్ చేస్తే,డబ్బులు తనకు ఇవ్వలేదని కడుపులో కక్ష పెట్టుకొని అక్క సంతకం పెట్టలేదండి బావగారు కూడా అక్కకి సపోర్టు పలికారు, ఉద్యోగం చేయొచ్చు అని ఎంత సంబర పడిపోయాను తెలుసా అని శ్రీలక్ష్మి అంటుంది. అవును శ్రీలక్ష్మి కానీ ఏం చేస్తాం అన్నయ్య వదిన సంతకం పెట్టలేదు కదా ఎన్ని అనుకుంటే మాత్రం ఏం లాభం దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని పాండురంగ అంటాడు. ఇంతలో శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేసి అమ్మ మీ మామగారు ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళమని చెప్తానన్నాడు ఒప్పుకున్నాడా అమ్మా అని అంటాడు. ఒప్పుకున్నాడు నాన్న కానీ కొన్ని షరతులు పెట్టాడు అని శ్రీలక్ష్మి అంటుంది.

శ్రీలక్ష్మి ఎన్ని షరతులైన ఒప్పుకొని సంతకం పెట్టమ్మా ముందు నువ్వు ఉద్యోగం చేయాలి అని వాళ్ళ నాన్న అంటాడు. నాన్న నేను ముందు చెప్పేది మీరు కాస్త వినండి తొందరపడి ఏదేదో మాట్లాడకండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఏంటమ్మా చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు. మామగారు ఉద్యోగాలకు వెళ్ళమన్నాడు కానీ కొన్ని షరతులు పెట్టాడు ఆ షరతుల్లో ముగ్గురం ఒప్పుకొని సంతకం పెడితేనే ఉద్యోగాలు చేయాలి లేదంటే ఎవ్వరూ ఉద్యోగం చేయొద్దు అని చెప్పాడు నాన్న అని శ్రీలక్ష్మి అంటుంది. నాకు తెలుసమ్మా మీ మామగారు అలాంటి లిటుకేదో పెడతాడని ఆయన షరతులు ఆయన పనులు చూస్తుంటే ఎప్పటికీ మిమ్మల్ని బాగుపడనిచ్చేలా లేడు మీరు ఆ ఇల్లు వదిలేసి వచ్చేయండి అమ్మ అని అంటాడు. సరే నాన్నగారు మీ అల్లుడు గారితో మాట్లాడి చెప్తాను అని శ్రీలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. నాన్నగారు ఏమన్నారు విన్నారు కదా అని శ్రీలక్ష్మి అంటుంది.ఇంట్లో నుంచి వచ్చేమన్నాడు కదా అలా ఎలా వెళ్ళిపోతాం శ్రీలక్ష్మి ఈ ఇంటి తో ఉన్న బంధం కేవలం డబ్బే నా మనుషులతో కాదా అని పాండురంగ అంటాడు. ఏముందండీ ఈరోజే తెలిసిపోయింది కదా ఎవరు మనవాళ్లు ఎవరు మనవాళ్లు కాదు అని శ్రీలక్ష్మి అంటుంది. మేము నలుగురం అన్నదమ్ములము ఒక చెల్లెలు ఇక్కడే పుట్టి పెరిగాము శ్రీలక్ష్మి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి వీటన్నిటిని వదిలిపెట్టి నీతో రమ్మంటావా అని పాండురంగ అంటాడు.

ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం ఇక్కడే ఉండి పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడతారా సంవత్సరానికి వస్తుందా 10 సంవత్సరాలకు వస్తుందా అప్పటిదాకా ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఎవడికి తెలుసు అండి ఇప్పుడు ఆనందంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి మీరు నాతో వస్తే రండి లేదంటే పిల్లలు నేను వెళ్ళిపోతాను అని శ్రీలక్ష్మి అంటుంది. ఏంటి శ్రీలక్ష్మి అలా అంటావు ఎప్పుడైనా నీ మాట నేను కాదన్నానా సరే నీతో పాటే నేను వస్తాను అని పాండురంగ అంటాడు.

కట్ చేస్తే, గంగ ఇంకా ఆ విషయం తలుచుకునే బాధపడుతుంది తనని నవ్విద్దామని గంగాధర్ అనుకుంటాడు. గంగ మన మహేష్ గాడు పెద్ద హీరో అయ్యాడు అంట సినిమా తీశాడంట ఇందులో జోక్ ఏంటో తెలుసా గంగా ఆ సినిమా హిట్ అయింది అంట అని నవ్వుతాడు గంగాధర్.నేను జాబ్ చేయాలని ఎంతో ఆశపడడాను తెలుసా అండి అప్పుల వాళ్లకి మా అమ్మ నాన్నలు రోజు సమాధానం చెప్పలేక చస్తున్నారు ఇంట్లో కూడా గడవడం లేదు ఈ ఉద్యోగం చేయడం నాకు చాలా అవసరం అండి అని గంగా బాధపడుతుంది..