Mamagaru november 13 2023 episode 54: గంగ ఎందుకు అంతలా బాధపడుతున్నావు జ్యోతిష్యం చెప్పింది కదా నువ్వు ఉద్యోగం చేస్తావని ఇప్పుడు కాకపోతే ఇంకో నాలకైనా చేస్తావు లే అని గంగాధర్ అంటాడు. ఆ మాట అనకండి మళ్ళీ నాకు కోపం వస్తుంది ఆ జ్యోతిష్యుడు చెప్పాడని నేను ఎంతో సంతోషించాను ఉద్యోగానికి వెళ్ళొచ్చని అవన్నీ అబద్ధాలు నమ్మలేము అని గంగా కోపంగా అంటుంది. గంగా ఏది ఒకసారి నీ చేయి చూపించు అని చెయ్యి చూసి చూడు గంగ నీకు ఉద్యోగం చేసే రేఖ ఉంది ఇప్పుడు చేయకపోవచ్చు గంగా ఇంకో నాలుగు పోయాక మంచి ఉద్యోగం చేస్తావు అని గంగాధర్ అంటాడు. అయితే పదండి మీ నాన్న దగ్గరికి వెళ్లి గంగకు ఉద్యోగం చేసే రేఖ ఉంది ఉద్యోగానికి పంపించండి నాన్నగారు అని చెప్పండి అని గంగా అంటుంది. అమ్మ బాబోయ్ గంగ నేను అలా చెప్పలేను అని గంగాధర అంటాడు. ఎందుకండీ అలా మాట్లాడుతారు నేను ఉద్యోగం చేయడం చాలా అవసరం అండి మీరు చెప్తారా చెప్పరా అని గంగా అలుగుతుంది. గంగను నవ్వించడానికి గంగాధర్ నానావిధాల ప్రయత్నిస్తాడు డాన్స్ చేస్తాడు పాట పాడుతాడు ఆ కుప్పిగంతులకి గంగ నవ్వేస్తుంది.

కట్ చేస్తే, శ్రీలక్ష్మి ఆఫీస్ కి టైం అవుతుంది బాక్స్ కట్టావా అని పాండురంగడు అడుగుతాడు. ఏమండీ ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామని అందరికీ చెప్పండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఏంటి శ్రీలక్ష్మి పొద్దు పొద్దున్నే అందర్నీ బాధ పెట్టడం అవసరమా రాత్రి చూసావు కదా ఎంత పెద్ద గొడవ అయిందో ఇప్పుడు ఎందుకు నాలుగు రోజులు పోయాక చెబుదాంలే అని పాండురంగడు అంటాడు. అదేం కుదరదండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతలో వసంత వాళ్ళ ఆయన కూడా బయటికి వచ్చి నేను ఆఫీస్ కి వెళ్లి వస్తాను అని సుధాకర్ అంటాడు. జాగ్రత్త అండి అసలే రోజులు బాగోలేవు ఎవర్ని నమ్మాలో నమ్మకూడదొ అర్థం కావట్లేదు అని వసంత అంటుంది. ఒరేయ్ అన్నయ్య నా టైర్ పంచర్ అయింది నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయరా అని పాండురంగడు సుధాకర్ ని అడుగుతాడు.నేను అటువైపు వెళ్లట్లేదు అని సుధాకర్ బైకు వేసుకొని వెళ్లిపోతాడు. ఇవేనా అన్నయ్య తమ్ముడు అంటూ చూపించే ప్రేమలు అని శ్రీలక్ష్మి అంటుంది.

శ్రీలక్ష్మి రాత్రి పెద్ద గొడవ జరిగింది కదా అన్నయ్య కోపంలో అర్థం ఉంది డబ్బులు మనం తీసుకున్నామని కొంచెం కోపంగా ఉన్నాడు నాలుగు రోజులు పోతే వాడే సర్దుకుంటాడు లే అని పాండురంగడు అంటాడు. అందరి బాధ అర్థం అవుతుంది కానీ నా బాధ మాత్రం మీకు అర్థం కాదు అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మీ నేను మెకానిక్ ని పంపిస్తాను అని పాండురంగడు ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఒక్కడే నిలబడి వాళ్లను గమనిస్తూ ఏమి చెప్పాలో అర్థం కాక దేవమ్మ బాధపడుతుంది. కట్ చేస్తే గంగ వల్ల నాన్నను ఇంటికి తీసుకు వస్తారు. అత్తయ్య మామయ్య గారి గురించి మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అన్నం తినక పోయి టాబ్లెట్ వేసుకోకపోతే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడుతాను అని గంగాధర్ అంటాడు. బావగారు చాలా థాంక్స్ అండి మా నాన్న గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని వర్ష అంటుంది. ఇది నా బాధ్యత వర్షా అల్లుడుగా నేను చేయవలసిన పని ఇది దీనికి ట్యాంక్స్ దేనికి అని గంగాధర్ అంటాడు. బాబు అల్లుడువే అయినా కొడుకువు అయిపోయి ఆయనను కాపాడావు నీకు థాంక్స్ చెప్పినా తక్కువే బాబు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. గంగ ఇక మనం బయలుదేరుదామా అత్తయ్యకు మిగతా డబ్బులు ఇచ్చేయి అని గంగాధర్ అంటాడు.

అమ్మ 20,000 ఉంచు ఖర్చులకు పనికొస్తాయి అని గంగ వాళ్ళ అమ్మకి ఇస్తుంది. గంగా హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అవన్నీ మీకు ఎందుకు అత్తయ్య గారు ఎంతో కొంత అయింది మేము చూసుకుంటాం గా అని గంగాధర్ అంటాడు. లేదు బాబు ఎంత ఖర్చయిందో చెప్పు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అమ్మ లక్ష రూపాయలు తెచ్చాము 20000 మిగిలాయి అని గంగా చెప్తుంది. 80 వేలు ఖర్చు అయ్యాయా అని వాళ్ళ అమ్మ అంటుంది. అత్తయ్య ఎంత ఖర్చు అయితే ఏముంది మామయ్య కోలుకున్నాడు అంతే చాలు అని గంగాధర్ అంటాడు. నాన్న జాగ్రత్తగా ఉండు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే దేవమ్మ ఏడుస్తూ చంగయ్య కి కనిపిస్తుంది. ఏంటి దేవమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నీ కన్నీళ్లకు ఎవరు కారణం చెప్పు ఇప్పుడే పిలిపించి అడుగుతాను అని చoగయ్య అంటాడు. నా కన్నీళ్ళకు మీరే కారణం అండి అని దేవమ్మ అంటుంది.ఏంటి దేవమ్మ నీ కన్నీళ్లకు నేను కారణమా అని చoగయ్య షాక్ అవుతాడు. అవునండి మీరే ఎందుకంటే కోడలు ఉద్యోగాలు చేస్తామని నిన్ను ఒప్పించారు నువ్వు సరే అని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని వాళ్లకు డబ్బు ఎర వేశారు ఆ డబ్బు ఒకరికి అంది ఇంకొకరికి అందకపోగా వాళ్లలో విభేదాలు పెరిగి గొడవలు పడుతున్నారు అని దేవమ్మ అంటుంది.

దేవమ్మ నువ్వే కదా డబ్బులు కావాలని అడిగావు మరి నినే కారణం అంటావేంటి అని చంగయ్య అంటాడు. నేను డబ్బులు అడిగానని మీరు ఇవ్వలేదండి మీరు నాకు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు, ఇప్పుడు ఆ డబ్బుల గురించి గొడవ పెట్టుకుని ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటున్నారు ఎంతో ప్రేమగా ఉండే నా కొడుకులు కూడా భార్య మాటలు విని కోపాలు తెచ్చుకొని ఎడమొహం పెడముఖంగా ఉంటున్నారు, ఇందులో ఏ ఒక్కరైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఏం చేస్తారండి ఈ డబ్బులు అన్ని మూటగట్టుకొని మీరు నేను ఉండి కట్టుబాట్లు పద్ధతులు అని మనకు మనమే పెట్టుకుందామా అని దేవమ్మ అంటుంది.

అంతదాకా వస్తే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను దేవమ్మ వాళ్లకు కట్టుబాట్లు పెట్టి ఆచారాలు చెప్పింది అందరూ కలిసిమెలిసి ఉండేలా చెయ్యడానికే దేవమ్మ అని చంగయ్య అంటాడు. ఎప్పుడో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఇప్పుడు ఉన్న ఆనందాన్ని పాడు చేస్తే పిల్లలు ఏమైపోతారండి అంటూ దేవమ్మ కోపంగా వెళ్ళిపోతుంది.