Mamagaru November 15 2023 Episode 56: ప్రొద్దున్నే లేచి గంగ వంట చేయడం మొదలు పెడుతుంది. అమ్మో బాక్స్ కట్టే విషయంలో పడి కాఫీ పెట్టడం మర్చిపోయాను రాగానే కాపీ ఏది గంగ అని అంటాడు అని గంగ కాపీ కలుపుతుంది. ఇంతలో గంగాధర్ వచ్చి గంగ కాఫీ ఏది అని అడుగుతాడు. అనుకున్నాను మీరు వచ్చి కాఫీ ఏది అని అడుగుతారని అందుకే ముందే రెడీ చేసి పెట్టానని గంగ కాఫీ ఇస్తుంది. కాఫీ తీసుకొని గంగాధర్ తాగుతాడు. కాఫీ ఎలా ఉందో చెప్పనేలేదు అని గంగా అంటుంది. నీ కళ్ళలోకి చూస్తూ కాఫీ బాగుందని చెప్పడం కూడా తక్కువే అవుతుంది గంగా అని గంగాధర్ అంటాడు. అయితే చాలా బాగుంది అని అనండి అని అంటుంది. గంగ బాక్స్ లో ఏం పెట్టావు అని గంగాధర్ అడుగుతాడు. ఇప్పుడే చెప్తే తినేటప్పుడు కిక్కుపోతుంది తినేటప్పుడు తెలుస్తుందిగా ఏం పెట్టాను అని గంగా అంటుంది. ఎలాగైనా నేను తినాలని చెప్తున్నావు కదూ అని గంగాధర్ అంటాడు.

గంగ బాక్స్ చేతికిచ్చి ఇక వెళ్ళండి ఆఫీస్కి అని అంటుంది. ఏంటి వెళ్ళమనే చెప్తున్నావా అని గంగాదర్ అడుగుతాడు. ఉద్యోగ ధర్మం చేయాలి కదా అని గంగ అంటుంది. సరే వెళ్లొస్తాను గంగ అని గంగాధర్ వెళ్ళిపోతాడు. గంగా కాఫీ పెట్టుకొచ్చి వసంతకి ఇస్తుంది. నాకు ఏమీ వద్దులే గంగ అని వసంత అంటుంది. బావగారు కాఫీ తీసుకోండి అని పాండురంగని అంటుంది గంగ. పాండురంగ కాఫీ తీసుకొని బాగా పెట్టావు గంగ ఏ మాట కా మాట చెప్పాలి శ్రీలక్ష్మి గంగ కాఫీ పెడితే సూపర్ గా ఉంటుంది అని అంటాడు.ఎంత బాగుంటే ఏముంది లేండి ఇకమీదట నుంచి ఆ కాఫీ తాగే అదృష్టం లేదు కదా అని శ్రీలక్ష్మి అంటుంది. ఏంటి వదిన అన్నయ్య ఎక్కడికొ వెళ్తున్నట్టు అంటున్నావ్ ఏంటి అని గంగాధర్ వాళ్ళ చెల్లెలు అంటుంది. అంటే రోజు పొద్దున్నే డ్యూటీ కి వెళ్తాను కదా అమ్మ నాన్న ఈ రోజు నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్నాడు కదా అప్పుడు నాకు కాఫీ తాగే టైం దొరకదు కదాఅందుకే అలా అంది శ్రీలక్ష్మి అని పాండురంగడు అంటాడు. అందరూ కాఫీ తాగేసి ఎవరి ఆఫీసులోకి వాళ్ళు వెళ్లిపోగానే గంగ వసంత దగ్గరికి వెళ్లి అక్క ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు మనలో మనం గొడవ పెట్టుకుంటే బాగుంటుందా చెప్పు మనమే నష్టపోతాము అని గంగ అంటుంది.

మీరు ఈరోజు నష్టపోయారేమో నేను రోజు నష్టపోతూనే ఉన్నాను గంగ అని కోపంగా అంటుంది వసంత. ఇంతలో చoగయ్య వచ్చి గంగ కాఫీ ఏది అని అడుగుతాడు. గంగ చేతిలో కాఫీ కనపడగానే తీసుకొని ఈ వేడి సరిపోలేదమ్మా వేడి చేసి తీసుకురా అని గంగ వంక కోపంగా చూస్తూ ఉంటాడు.గంగ మౌనంగా అలాగే ఉండిపోతుంది. వాళ్ళిద్దరిని చూసినా దేవమ్మ గంగ దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా కాఫీ చల్లారిందా లేదా అని చూసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే పాండురంగ ఆఫీస్ కి వెళ్లే హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అంటాడు.

వెరీ గుడ్ మార్నింగ్ పాండురంగ అలాగే బాడ్ మార్నింగ్ కూడా ఎందుకు అంటే ఒక అతని దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి 30,000 లంచం తీసుకున్నారంట అతను వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాడు అది వైరల్ అవుతుంది అని వాళ్ళ ఆఫీసర్ అంటాడు. సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్ ఎక్కువ ఫైలు ఉండడంతో అతని ఫైలు కొంచెం లేట్ అవుతుందని చెప్పాను నాది తొందరగా రిజిస్ట్రేషన్ కావాలి నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అంటూ బెదిరించాడు నేను చేయను అన్నాను అందుకని ఇలా వీడియో చేసి పెట్టాడు సార్ అని పాండురంగడు చెప్తాడు. అంతేనంటావా నువ్వైతే లంచం తీసుకోలేదు కదా అని వాళ్ళ సార్ అంటాడు.

చూడు పాండురంగ అసలే ఆ శివరామ్ మంచోడు కూడా కాదు అతనికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అతనితో ఎందుకయ్యా పెట్టుకునేది ఆ ఫైల్ ఏదో చూడొచ్చు కదా అని ఆఫీసులో పనిచేసే అతను అంటాడు. నేను వాడు భద్రింపులకు ఏమి భయపడను నేను లంచం తీసుకోలేదు కాబట్టి నేను ఎందుకు చేస్తాను అని పాండురంగడు అంటాడు. కట్ చేస్తే గంగాధర్ పనికి వెళ్లి ఇంటికి వస్తాడు. ఏంటి బాబు ఈరోజు తొందరగా వచ్చావు అని దేవమ్మ అడుగుతుంది. అన్నయ్య ఏమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడా లేటుగా వడానికి కరెంటు పనే కదా ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పమ్మా అన్నయ్య చేస్తాడు అని వాళ్ళ చెల్లెలు అంటుంది. ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావ్ కోరుకుంటున్నానని అని గంగాధర్ అంటాడు. కట్ చేస్తే గంగాధర్ గంగ ని తీసుకొని బయటికి వెళ్తాడు. ఏవండీ ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని గంగ అడుగుతుంది. ఊరికే బయటికి తీసుకెళ్దాం అనిపించింది తీసుకొచ్చాను గంగ నీకు వెన్నెల ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా తీసుకు వస్తాను అని గంగాధర్ అంటాడు.

నాకు వెన్నెల ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని నీకు ఎవరు చెప్పారు మా చెల్లెలు చెప్పిందా కదా అని గంగ అడుగుతుంది. లేదు గంగా నా మనసు చెప్పింది అని గంగాధర్ అంటాడు. వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా గంగాధర్ కి అడ్వాన్స్ ఇచ్చిన అతను వచ్చి ఏంటయ్యా పని అయితే చేయవు కానీ అడ్వాన్స్ తీసుకుంటావా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయ్ అని అంటాడు. ఏవండీ ఈవిడ మా ఆవిడని గంగాధర్ అంటాడు. పెళ్లయితే పని చేయవా తీసుకున్న డబ్బులు తిరిగి చెయ్ అని అతను అంటాడు. సార్ రెండు రోజుల్లో వచ్చి మీ పని పూర్తి చేస్తాను సార్ అని గంగాధర్ అంటాడు. ఇదే ఆఖరి చాన్స్ ఆ తర్వాత మాటలు ఉండవు గంగాధర్ చేతలే అని అతను అంటాడు..