NewsOrbit
Entertainment News సినిమా

విక్రమ్‌కు హార్ట్ ఎటాక్ కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన మేనేజ‌ర్‌!

Share

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండె పోటుకు గుర‌య్యార‌న్న వార్త నేటి మ‌ధ్యాహ్నం ఇటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ తెగ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటు కార‌ణంగా చెన్నైలోని కావేరీ ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని, ప్రస్తుతం ఆయ‌న ఐసీయూలో చికిత్స పొందుతున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో అభిమానులు, సినీ ప్రియులు తెగ కంగారు ప‌డిపోయారు. కానీ, నిజానికి విక్ర‌మ్‌కు హార్ట్ ఎటాక్ రాలేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న మేనేజ‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. `ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు… చియాన్ విక్రమ్‌కు ఛాతిలో కొంచెం నలతగా అనిపించింది. అందుకు చికిత్స తీసుకుంటున్నారు.

ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదు. ఈ విష‌యంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. పుకార్లు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒక్క రోజులో ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అవుతారు. విక్రమ్, ఆయన ఫ్యామిలీకి ప్ర‌స్తుతం ప్రైవసీ ఎంతో అవ‌స‌రం. ఈ స్టేట్‌మెంట్‌తో అందరికీ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను.

ఇంతటితో తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడతారని ఆకాంక్షిస్తున్నాను` అంటూ విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ ట్వీట్ చేశారు. మ‌రోవైపు కావేరీ హాస్ప‌ట‌ల్ యాజ‌మాన్యం సైతం ఇదే విష‌యాన్ని పేర్కొంటూ విక్ర‌మ్ హెల్త్ బులెటిన్‌ను బ‌య‌ట‌కు వ‌దిలింది. దీంతో ఆయ‌న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.


Share

Related posts

సత్యదేవ్-తమన్నాల‌ ప్రేమ‌క‌థ‌కు ఇన్ని అడ్డంకులు ఎందుకో..?

kavya N

 Ram pothineni : రామ్ పోతినేని ప్రయోగాలకి సిద్దమవుతున్నాడంటే టార్గెట్ అదేనా..?

GRK

Tollywood Celebrities : వయస్సు 30 దాటిన పెళ్లి చేసుకొని… బుల్లితెర సెలబ్రిటీస్ వీళ్లే..!

Teja