NewsOrbit
Entertainment News సినిమా

మంచు విష్ణు `జిన్నా` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఏదో అనుకుంటే ఇంకేదో జ‌రిగింది..!

భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్, మంచి టాలెంట్ ఉన్న సక్సెస్ లేని హీరోల్లో మంచు విష్ణు ఒకరు. గత కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మంచు విష్ణు.. తాజాగా `జిన్నా` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు నటించారు.

ఇషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్ల‌పై మోహన్ బాబు మంచు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దీంతో తొలిరోజు తన సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్‌ను రాబడుతుందని భావించాడు.

manchu vishnu ginna movie collections
manchu vishnu ginna movie collections

కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. తొలి రోజు ఈ చిత్రం దారుణమైన వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. అసలు కొన్ని ఏరియాల్లో అయితే ప్రేక్షకులు లేక షోలను సైతం క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 లక్షల రేంజ్ లో షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 19 లక్షలతో సరిపెట్టుకుంది.

నైజాం- 5 ల‌క్ష‌లు
సీడెడ్- 2 ల‌క్ష‌లు
ఆంధ్ర(టోటల్)- 7 ల‌క్ష‌లు
———————————-
ఏపీ + తెలంగాణ = 14 ల‌క్ష‌లు
———————————-

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 5 ల‌క్ష‌లు
—————————————–
వరల్డ్ వైడ్ టోటల్ = 19 ల‌క్ష‌లు
—————————————–

కాగా, ఈ చిత్రానికి రూ. 4.35 కోట్ల రేంజ్ లో థియేటర్ బిజినెస్ జరిగింది. రూ 4.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 4.47 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి తొలి రోజు తీవ్రంగా నిరాశ పరిచిన ఈ చిత్రం ఇక ముందైనా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల పరంగా ఊపందుకుంటుందేమో చూడాలి.

 

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N