Bigg Boss 17 Mannara Chopra: బిగ్ బాస్ షో అన్ని భాషలలోను హిట్ అయినా షో. హిందీ లో కూడా ఈ షో 16 సీసన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 17 వ సీజన్లో కండల వీరుడు పెళ్లికాని ప్రసాద్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వస్తున్న బిగ్ బాస్ 17వ సీజన్ కొన్ని నిమిషాలలో కలర్స్ టీవీలో ఆర్భాటంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు అన్ని సీసన్స్ విజయవంతం కావడం వలన బిగ్ బాస్ 17 ప్రీమియర్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

బిగ్ బాస్ అభిమానులు రాబోయే మూడు నెలల పాటు తమ రోజువారీ వినోదపు విందు కోసం మరియు కొత్త బ్యాచ్ కంటెస్టెంట్ల రాక కోసం పిచ్చ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ 17 కోసం కంటెస్టెంట్లుగా అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ షో లో అంకిత లోఖండే-విక్కీ జైన్, మునావర్ ఫారూఖీ మరియు నీల్ భట్-ఐశ్వర్య శర్మ వంటి ప్రముఖులు సందడి చేయ బోతున్నారు.
అందరి తో పాటు ఈ సారి మన్నారా చోప్రా కూడా ఉండడం విశేషం. హిందీ లోను , తెలుగు లోను సినిమాల్లో నటించిన మన్నారా చోప్రా ప్రియాంక చోప్రా జోనస్ కు కజిన్ సోదరి. మన్నారా ఆమె అసలు పేరు కాదని మీకు తెలుసా? ఈ ముద్దుగుమ్మ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది కదూ? ఐతే ఆ వివరాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.

ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో మే 25, 1991 న జన్మించినట్లు తెలుస్తోంది. మన్నారా చోప్రా ప్రియాంక చోప్డా తండ్రి తరపు బంధువు. కరణ్ వీర్ శర్మ సరసన 2014లో విడుదలైన జిద్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ఈమె న్యూఢిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్లో విద్యాభ్యాసం చేసి తర్వాత బీబీఏ డిగ్రీ చేసిన ఫ్యాషన్ డిజైనర్.
View this post on Instagram
ఆమె సినిమాలతో పాటు కొన్ని మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ షోలు కూడా చేసారు . ఆమె బిగ్ బాస్ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆమె ఈ మధ్యనే ‘ముద్దు’ వివాదంలో చిక్కుకున్నారు ఆ విషయం ఏమిటో చూదాం. ?

క్రిందటి నెలలో మన్నారా చోప్రా దర్శకుడు తో ముద్దు వివాదంలో పడి వార్తలలో నిలిచారు. ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో ఆమె రాబోయే సినిమా ‘తిరగడ సామి’ దర్శకుడు ఆమె అనుమతి లేకుండా సడెన్ గా ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో మీడియాలో ప్రచారం కావడమ్ వలన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె దర్శకుడికి ఎలాంటి దురుద్దేశాలు లేవని తాను నమ్ముతున్నానని చెప్పింది.
ఈమె ప్రేమ గీమా జాన్తానై , హిందీ సినిమా జిద్ , తమిళంలో సన్దమారుతం , కావేరి, సినిమాల్లోనూ తెలుగులో జక్కన్న, తిక్క సీత అనే సినిమాల్లో కూడా నటించింది. ఏవ్ కాక ఒక వెబ్ సిరీస్ లోను కొన్ని మ్యూజిక్ వీడియో లలోను నటించారు. బిగ్ బాస్ లో ఈమె కు మంచి పేరు రావాలని కోరు కుందాము.