NewOrbit
Entertainment News సినిమా

బాస్ వ‌స్తున్నాడు.. `మెగా 154` టైటిల్ టీజ‌ర్‌కు ముహూర్తం పెట్టిన మేక‌ర్స్‌!

Share

ఇటీవ‌ల `గాడ్ ఫాద‌ర్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం `మెగా 154` సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాడీ తెర‌కెక్కిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు.

ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే కంప్లీట్ అవ్వ‌గా.. డ‌బ్బింగ్ ప‌నులు సైతం షురూ అయిన‌ట్టు చిత్ర టీమ్ తెలిపింది.

Advertisements
mega 154 title teaser update
mega 154 title teaser update

అయితే `మెగా 154` టైటిల్ టీజ‌ర్‌కు ముహూర్తం పెట్టేశారు మేక‌ర్స్‌. దీపావ‌ళి పండుగ కానుక‌గా అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు టైటిల్ టీజ‌ర్‌ను లాంఛ్ చేయ‌బోతున్నారు. తాజాగా `బాస్ వ‌స్తున్నాడు` అంటూ ఈ అప్డేట్‌ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. వాస్త‌వానికి ఎప్పటి నుంచో ఈ చిత్ర టైటిల్ కోసం అభిమానులు ఈగ‌ర్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు అధికారికంగా టైటిల్ ను ప్రకటించబోతున్నారు. కాగా, ఈ సినిమాకు `వాల్తేరు వీరయ్య` ప‌రిశీల‌న‌లో ఉంది. దాదాపు అదే క‌న్ఫామ్ అయింద‌ని కూడా అంటున్నారు.


Share

Related posts

ద‌ర్శ‌కుడిగా మోహ‌న్‌లాల్ అరంగేట్రం

Siva Prasad

Vakeel Saab × AP Government : రాబోయే వందల కోట్ల సినిమాలకూ ఏపీలో టికెట్ రేట్లు 5, 10 కేనా..?

Muraliak

Ajith Kumar: విఘ్నేష్ సినిమాకు అజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

kavya N