Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ ఇంకా పలు రకాలుగా టాలెంట్ నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. వెబ్ సిరీస్ లో నటించడం మాత్రమే కాదు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ దిశగా కెరియర్ కొనసాగుతూ ఉండగా గత ఏడాది నిహారిక పెళ్లి చేసుకోవడం తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ … తన వ్యక్తిగత మరియు గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటది.
ఈ తరహాలోనే లేటెస్ట్ గా బికినీ ఫోటోలను నిహారిక పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో ఒక టాటూ కూడా వీపుపై కనిపిస్తూ ఉంది. టర్కీ టూర్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. బికినీలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తన వీపుపై ఉన్న సీక్రెట్ టాటూ కనిపించింది. NK అనే అక్షరం తో పాటు పక్షి సింబల్ ఇంకా.. చాలా కొత్త రకమైన డిజైన్ కనిపిస్తూ ఉంది.
దీంతో డిజైన్ ఏంటో అన్నది కనిపెట్టడానికి ఫోటో చూసినవాళ్లు తెగ తంటాలు పడుతున్నారు. నీళ్లలో సేద తీరుతూ జలకాలాటలాడుతూ… నిహారిక ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఒకపక్క ఫుల్ బికినీ ఫోటోలు పెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక బికినీ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.