Mehreen: న‌డిరోడ్డుపై మెహ్రీన్ తీన్‌మార్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌!

Share

Mehreen: మెహ్రీన్ కౌర్‌.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ` మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది.

ఇటీవ‌లె `ఎఫ్ 3`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న మెహ్రీన్.. తాజాగా తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది. అక్క‌డ ఫుల్‌గా చిల్ అవుతోంది. వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన బారాత్‌లో మెహ్రీన్ నడిరోడ్డుపై మాస్ స్టెప్పులేస్తూ అద‌ర‌గొట్టింది.

అలాగే ఓ అమ్మాయితో కలిసి తీన్‌మార్ కు ఉత్సాహంగా చిందులేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలోను, వీడియోల‌ను మెహ్రీన్ స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. `పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌` అంటూ క్యాప్స‌న్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

కాగా, మెహ్రీన్ గ‌తంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌తో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ అంగ‌రంగ వైభ‌వంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే భ‌వ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ విడిపోయింది. ప్ర‌స్తుతం ఈమె త‌న ఫోక‌స్ మొత్తాన్ని సినిమాపైనే పెట్టింది.

https://www.instagram.com/p/CfJbkDkoUvG/?utm_source=ig_web_copy_link


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

51 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

60 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago