దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం` మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. నిజానకి సీరియల్స్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత `లవ్ సోనియా` మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది.
అయితే మృణాల్ ఠాకూర్ తన తొలి సినిమాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన `సుల్తాన్` లో చేయాల్సిందట. ఈ సినిమాలో అనుష్క శర్మ పోషించిన పాత్ర కోసం మృణాల్‌ను మొదట ఎంపిక చేశారట. ఆ పాత్ర కోసం మృణాల్ ఎంతో కష్టపడిందట. కొద్దిరోజులు మల్లయుద్ధం లో శిక్షణ తీసుకుందట.

అలాగే మూడు నెలల్లోనే 11 కేజీలు బరువు తగ్గిందట. కానీ చివరకు మేకర్స్ మృణాల్‌ను తప్పించి అనుష్క శర్మను తీసుకున్నారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో మృణాల్ స్వయంగా వెల్లడించింది. ఇక ఈ సినిమా చేజారిన కొద్దిరోజులకే `లవ్ సోనియా` సినిమాలో ఆఫర్ వచ్చిందట.
తొలి చిత్రంతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్.. బాలీవుడ్లో వరుసగా ఆఫర్లు అందుకుంది. ఇక ఇటీవల `సీతారామం` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.