Entertainment News సినిమా

భారీగా రేటు పెంచేసిన `సీతారామం` భామ.. నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

Share

సీరియ‌ల్స్ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన అందాల సోయ‌గం మృణాల్ ఠాకూర్.. మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో అవ‌కాశాలు ద‌క్కించుకున్న మృణాల్ ఠాకూర్‌.. రీసెంట్‌గా `సీతారామం`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది.

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా డైరెక్ట‌ర్ హను రాఘవపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌ష్మిక‌, సుమంత్‌, భూమిక‌, గౌత‌మ్ మీన‌న్‌, తరుణ్ భాస్కర్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆగ‌స్టు 5న తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. సంచల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఇందులో రామ్ పాత్రలో దుల్కార్ సల్మాన్- సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా న‌టించి సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డానికి ముఖ్య కార‌కుల‌య్యారు. ఇక‌పోతే `సీతారామం` హిట్ అనంత‌రం మృణాల్‌కు టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్రేజ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసింద‌ట‌.

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయిలు డిమాండ్ చేస్తోంది. అడిగినంత ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తాన‌ని మృణాల్ తేల్చి చెప్పేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఆమె రేటు తెలిసి ఫిల్మ్ మేక‌ర్స్‌ ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. ఏదేమైనా ఒక్క హిట్ ప‌డితేనే మృణాల్ ఈ రేంజ్‌లో డిమాండ్ చేస్తోందంటే.. ముందు ముందు నిర్మాత‌ల‌కు ఆమె చుక్క‌లు చూపించ‌డం ఖ‌య‌మ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Share

Related posts

`ఆమె` రెమ్యున‌రేష‌న్ వెన‌క్కిచ్చేసింది

Siva Prasad

Sreemukhi Black Saree New HD Stills

Gallery Desk

టాలీవుడ్ చరిత్రలో సంచలనం ఏకంగా ఆస్కార్ రేసులో ఎన్టీఆర్..??

sekhar