మృణాల్ ఠాకూర్ అంటే గుర్తు పడటం కాస్త ఆలస్యమవుతుందేమో గానీ.. `సీతారామం` హీరోయిన్ అంటే టక్కున పట్టేస్తారు. అంతలా ఆ మూవీతో మ్యాజిక్ చేసిందీ బ్యూటీ. మరాఠీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన మృణాల్.. ఆ తర్వాత బాలీవుడ్ లో అర డజన్‌కు పైగా చిత్రాల్లో నటించింది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం గత నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాళిని ఠాకూర్ తనదైన పర్ఫామెన్స్తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే `సీతారామం` విడుదల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారిన మృణాల్.. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతోంది.
తాజాగా కూడా క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో మైండ్ బ్లాక్ చేసేలా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు మన సీతామహాలక్ష్మి లేటెస్ట్ పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!