మృణాల్ ఠాకూర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సీతారామం` మూవీతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కావ్యం ఇది. ఇందులో మృణాల్ హీరోయిన్గా నటిస్తే.. రష్మిక, సుమంత్, భూమిక, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఈ సినిమాలో సీత పాత్రను పోషించిన మృణాల్.. తనదైన అందం, అభినయం మరియు నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం ఈ అమ్మడుకు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మృణాల్ యువరాణిలా మారిపోయింది. లెహంగా చోలీ ధరించి వజ్ర వైడూర్యాలతో యువరాణిలా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెటిజన్ల మతిపోగొడుతూ నెట్టింట వైరల్‌గా మారాయి.