సీతారామం.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన ప్రేమ కావ్యం. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు లో డైరెక్ట్ గా చేసిన రెండో చిత్రమిది.ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇక ఇందులో సీతా మహాలక్ష్మిగా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్.. తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులు ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ఈ సినిమాతో మృణాల్‌కు ఎక్కడ్లేని క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు సౌత్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే సీతారామం విడుదల తర్వాత సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయిన మృణాల్.. అదిరిపోయే ఫోటో షూట్లతో ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోంది.
అయితే ఇంతకు ముందు వరకు హాట్ హాట్ పిక్స్‌తో వార్తల్లో నిలిచిన మృణాల్ ఠాగూర్.. తాజాగా మాత్రం చీరలో అందంగా ముస్తాబై దర్శనమిచ్చింది. ఆకట్టుకుంటున్న మృణాల్ శారీ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
వీటిని చూస్తే ఎవ్వరైనా అదరహో అనాల్సిందే. అంత అందంగా మృణాల్ కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మృణాల్ తాజా పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.