మృణాల్ ఠాగూర్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రీసెంట్గా ఈమె నటించిన `సీతారామం` ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ప్రేమ కావ్యమిది.
ఇందులో మృణాల్ హీరోయిన్ గా నటిస్తే.. రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. అక్కడ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో రామ్‌గా దుల్కర్, సీతగా మృణాల్ తమదైన పర్ఫామెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేవారు. ఈ పాత్రలకు తాము తప్పా ఎవరూ సరిపోరు అన్నంతలా మైమరపించారు. ఈ మూవీ తర్వాత మృణాల్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఇలాంటి తరుణంలో ఆమెకు సంబంధించి ఓ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ పిక్‌లో మృణాల్ గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ముఖం, చేతులు కమిలిపోయినట్లు కనిపించారు. అసలు మృణాల్‌కు ఏమైంది..? ఇది ఎప్పటి ఫోటో..? ఏదైనా సినిమా కోసం ఆమెను అలా తయారు చేశారా..? లేక ఇంకేదైనా జరిగిందా..? అంటూ ఆ ఫోటోపై నెటిజన్లు ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ పిక్‌ను చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదో ఓల్డ్ పిక్ అని, ఏదో సీరియల్లోని పాత్ర కోసం ఆమె అలా డీగ్లామర్ లుక్‌లో మేకోవర్ అయిందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మృణాల్ స్పందించాల్సిందే.